three-month highs
-
Wholesale price inflation: 3 నెలల గరిష్టానికి టోకు ధరలు
న్యూఢిల్లీ: దేశీయంగా టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యూపీఐ) మూడు నెలల గరిష్టానికి ఎగిసింది. కూరగాయలు, బంగాళదుంప, ఉల్లి, ముడి చమురు మొదలైన వాటి ధరల పెరుగుదల కారణంగా మార్చిలో 0.53 శాతంగా (ప్రొవిజనల్) నమోదైంది. ఫిబ్రవరిలో ఇది 0.20 శాతంగా ఉంది. గతేడాది మార్చిలో ఇది 1.41 శాతంగా నమోదైంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మైనస్లోనే ఉన్న టోకు ధరల ఆధారిత సూచీ నవంబర్లో ప్లస్ 0.26 శాతానికి వచి్చంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. రిటైల్ ద్రవ్యోల్బణం అయిదు నెలల కనిష్ట స్థాయి 4.85 శాతానికి తగ్గిన నేపథ్యంలో తాజా టోకు గణాంకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బేస్ ఎఫెక్ట్ తగ్గుతుండటంతో రాబోయే రోజుల్లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. గతేడాది మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం 5.42 శాతం నుంచి 6.88 శాతానికి చేరింది. కూరగాయల ధరల పెరుగుదల మైనస్ 2.39 శాతం నుంచి 19.52 శాతానికి ఎగిసింది. -
మార్చిలో 3 నెలల గరిష్టానికి ‘నిరుద్యోగం’
ముంబై: దేశంలో నిరుద్యోగ సమస్య మార్చిలో తీవ్రమైంది. మూడు నెలల గరిష్ట స్థాయిలో 7.8 శాతంగా నమోదయినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియా ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాలు వెల్లడించాయి. 2022లో డిసెంబర్లో 8.30 శాతానికి పెరిగి న నిరుద్యోగితా రేటు జనవరిలో 7.14 శాతానికి తగ్గింది. అయితే మరుసటి రెండు నెలల్లో మళ్లీ పెరుగుదల ప్రారంమైంది. ఫిబ్రవరిలో 7.5 శాతం అన్ఎంప్లాయ్మెంట్ రేటు నమోదయితే, మార్చితో మరింత పెరిగి 7.8 శాతానికి ఎగసింది. మార్చిలో పట్టణ ప్రాంతాల్లో అన్ఎంప్లాయ్మెంట్ రేటు 8.4 శాతం ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 7.5 శాతంగా నమోదయ్యింది. మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే.. ► మార్చిలో నిరుద్యోగం విషయంలో హర్యానా 26.8%తో అగ్ర స్థానంలో ఉంది. రాజస్తాన్ (26.4%), జమ్మూ, కశ్మీర్ (23.1%), సిక్కిం (20.7%), బీహార్ (17.6%), జార్ఖండ్ (17.5%) తరువాతి స్థానాల్లో నిలిచాయి. ► తక్కువ నిరుద్యోగితా రేటు (0.8 శాతం) ఉత్తరాఖండ్, ఛత్తీస్గడ్లో నమోదయితే, అటుపైన పుదుచ్చేరి (1.5 శాతం), గుజరాత్ (1.8 శాతం), కర్ణాటక (2.3 శాతం), మేఘాలయ, ఒడిస్సా (2.6 శాతం) ఉన్నాయి. పండుగ సీజన్ తర్వాత డౌన్ అక్టోబర్–జనవరి పండుగ సీజన్ తర్వాత రిటైల్, సప్లై చైన్, లాజిస్టిక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈ–కామర్స్ రంగాల్లో ఉపాధి తగ్గింది. ఐటీ, టెక్నాలజీ, స్టార్టప్ల్లో క్రియాశీలత తగ్గింది. ఇది తాజా నియామకాలలో మందగమనానికి దారితీసింది. ఇక మార్చి ఆర్థిక సంవత్సరాంతము, పరీక్షల నెల కావడంతో ప్రమాణాలు, పర్యాటకం, వినోదం, ఆతిథ్య రంగాల్లో అధిక డిమాండ్ కనిపించ లేదు.ఇది నిరుద్యోగితా శాతం పెరుగుదలకు దారితీసింది. తయారీ, ఇంజనీరింగ్, నిర్మాణం, మౌలిక సదుపాయాల రంగాల్లో కూడా ఉపాధి కల్పన అంతంతమాత్రంగానే ఉంది. ఆయా అంశాలు ఉద్యోగ మార్కెట్ వేగాన్ని తగ్గించాయి. అయితే ఏప్రిల్లో పురోగమనం ఉంటుందని భావిస్తున్నాం. – ఆదిత్య మిశ్రా, సీఐఈఎల్ హెచ్ఆర్ సర్వీసెస్ సీఈఓ, డైరెక్టర్ తాత్కాలికమే కావచ్చు... నిరుద్యోగ డేటా ప్రస్తుత ఆర్థిక అనిశ్చితి వాతావరణానికి అద్దం పడుతోంది. భారత్ కార్పొరేట్ రంగం వ్యయాల విషయంలో చాలా విచక్షణతో వ్యవహరిస్తోంది. ప్రతి అడుగును జాగ్రత్తగా బేరీజు వేసుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి భారత్నూ ప్రభావం చూస్తుంది కాబట్టి, దేశంలో కార్కొరేట్ రంగం నియామకాలను తాత్కాలికంగా తగ్గించింది. అయితే భారత్ సవాళ్లను అధిగమించే పరిస్థితిలో ఉంది కాబట్టి, తాజా నిరుద్యోగ సమస్య తాత్కాలికమే అని నేను భావిస్తున్నాను. – రితుపర్ణ చక్రవర్తి, టీమ్లీజ్ సర్వీసెస్ కో–ఫౌండర్ -
CMIE: నవంబర్లో మూడు నెలల గరిష్టానికి నిరుద్యోగం!
ముంబై: దేశంలో నిరుద్యోగం రేటు నవంబర్లో మూడు నెలల గరిష్టం ఎనిమిది శాతానికి పైగా పెరిగింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాల ప్రకారం– పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం 8.96 శాతానికి చేరితే, గ్రామీణ ప్రాంతాల్లో ఈ రేటు 7.55 శాతంగా ఉంది. అక్టోబర్లో దేశంలో నిరుద్యోగం రేటు 7.77 శాతం. పట్టణ ప్రాంతాల్లో ఇది 7.21 శాతంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 8.04 శాతంగా ఉంది. ఇక దేశ వ్యాప్తంగా సెప్టెంబర్లో నిరుద్యోగిత రేటు 6.43 శాతంగా ఉంది. నవంబర్లో 30.6 శాతంతో హర్యానా నిరుద్యోగంలో మొదటి స్థానంలో నిలిచింది. తరువాతి స్థానంలో రాజస్తాన్ (24.5 శాతం), జమ్మూ,కశ్మీర్ (23.9 శాతం) బీహార్ (17.3 శాతం), త్రిపుర (14.5)లు ఉన్నాయి. అతి తక్కువ నిరుద్యోగం రేటు విషయంలో చత్తీస్గఢ్ (0.1 శాతం), ఉత్తరాఖండ్ (1.2 శాతం), ఒడిస్సా (1.6 శాతం), కర్ణాటక (1.8 శాతం), మేఘాలయ (2.1 శాతం)లు ఉన్నాయి. -
బంగారం @రూ.30 వేలు
అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు వరుస సెషన్లలో పరుగులు పెడుతున్న డాలర్ బలపడటంతో బుధవారం గరిష్టస్థాయి నుంచి కొద్దిగా క్షీణించాయ. ట్రంప్ వివాదాస్పద నిర్ణయాల కారణంగా డాలర్ విలువ నేలచూపులు చూస్తుండడంతో ఈ విలువైన మెటల్ కు డిమాండ్ పుంజుకోవడంతో మంగళవారం మూడునెలల గరిష్టాన్ని తాకింది. స్పాట్ గోల్డ్ 0.1 శాతం పెరిగి ఔన్స్ బంగారం ధర 1,234 డాలర్లు గా నమోదైంది. అయితే అమెరికా, యూరోప్ లో నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్తితుల కారణంగా డాలర్ బుధవారం కొద్దిగా బలపడింది. డాలర్ ఇండెక్స్ 0.2శాతం ఎగిసి 100.510వద్ద ఉంది. అమెరికాలో గోల్డ్ ఫ్యూచర్స్ లో 0.2 శాతం క్షీణించి 1,231డాలర్ల వద్ద ఉంది. వెండి ధరలు కూడా ఇటీవలి గరిష్టంనుంచి స్వల్పంగా 0.1శాతంక్షీణించి 17.69 డా డాలర్లుగా ఉంది. ప్లాటినం 0.6శాతం ఎగిసి 1,007.20 డాలర్లుగా ఉండగా పల్లాడియం 0.1 శాతం బలహీనంగా ఉంది. ట్రంప్ విధించిన ఏడు ముస్లిం మతం దేశాలనుంచి ప్రజలపై ట్రంప్స్ తాత్కాలిక వీసా బ్యాన్ నిషేధం వివాదం, రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఐరోపాలో రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో డాలర్ డిమాండ్ క్షీణిస్తోంది. దీంతో సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడిపై బులియన్ మార్కెట్లో ఆసక్తి నెలకొంది. అయితే జనవరి సీపీఐ డాటాపై పసిడి పరుగు ఆధారపడి ఉంటుందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఇటు దేశీయం కూడా మూడునెలల గరిష్టాన్ని తాకిన బంగారం ధర పదిగ్రా. రూ.30వేల స్థాయిని తాకింది. బుధవారం డాలర్ బలపడడంతో మూడునెలల గరిష్టం నుంచి బంగారం ధరలు కొద్దిగా వెనక్కి తగ్గాయి. ముంబై మార్కెట్లో 22 కారెట్ల బంగారం ధర పది గ్రా. రూ. 28540 ఉండగా, 24 కారెట్ల ధర రూ. 30524 వద్ద ఉంది. ఢిల్లీలోరూ. 28400 ( 22 కారెట్లు పదిగ్రా.), రూ.30374 (24 కారెట్లు పదిగ్రా.) గా వుంది. హైదరాబాద్లో రూ. 28310 (22 కారెట్లు పదిగ్రా.) రూ. 30278 ( 24 కారెట్లు పదిగ్రా.)గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బుధవారం పసిడి పది గ్రా. రూ.47 నష్టపోయి రూ.29,285 పలుకుతోంది.