టోకు వస్తువుల డిమాండూ డౌన్!
• నవంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం 3.15%
• పెద్ద నోట్ల రద్దు ప్రభావం...
న్యూఢిల్లీ: రూ.500, రూ.1,000 పెద్ద నోట్ల రద్దు ప్రభావం వ్యవస్థలో డిమాండ్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. రిటైల్‌తో పాటు టోకు వస్తువుల డిమాండ్ ప్రత్యేకించి ఆహార ఉత్పత్తుల విషయంలో భారీగా పడిపోయింది. నవంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం 3.15 శాతంగా నమోదయ్యింది. అంటే టోకు వస్తువుల బాస్కెట్ ధర 2015 నవంబర్‌తో పోల్చితే 2016 నవంబర్‌లో 3.15 శాతమే పెరిగిందన్నమాట. అక్టోబర్‌లో ఈ రేటు 3.39 శాతం. ఫుడ్, నాన్–ఫుడ్ ఆర్టికల్స్ విభాగంలో డిమాండ్ మందగమన జాడలు బుధవారం వాణిజ్యమంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల్లో కనిపించాయి. మంగళవారం విడుదలైన నవంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం కూడా రెండేళ్ల కనిష్ట స్థాయిలో 3.63 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే.
తాజా గణాంకాలు చూస్తే...
ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్–ఫుడ్ ఆర్టికల్స్‌తో కూడిన ఈ విభాగంలో టోకు ద్రవ్యోల్బణం 1.25 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 2.15 శాతం. వేర్వేరుగా చూస్తే, ఫుడ్ ఆర్టికల్స్‌లో రేటు 2.55 శాతం నుంచి 1.54 శాతానికి తగ్గింది (అక్టోబర్‌లో 4.34 శాతం). నాన్–ఫుడ్ ఆర్టికల్స్‌లో ద్రవ్యోల్బణం పెరక్కపోగా –0.14% క్షీణించింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 6.33 శాతం. ఆహార ఉత్పత్తులకు సంబంధించి టోకున కూరగాయల ధరలు అసలు పెరక్కపోగా, – 24.10 శాతం క్షీణించాయి.
తయారీ: మొత్తం సూచీలో దాదాపు 60 శాతం వాటా కలిగిన ఈ విభాగంలో కూడా టోకు ద్రవ్యోల్బణం –1.42 క్షీణత నుంచి 3.20 శాతం పెరుగుదల నమోదుచేసుకుంది.