మార్చి నెల టోకు ధరల ఆధారిత సూచీ (డబ్ల్యూపీఐ) దిగివచ్చింది.
న్యూఢిల్లీ: మార్చి నెల టోకు ధరల ఆధారిత సూచీ (డబ్ల్యూపీఐ) దిగివచ్చింది. ఫిబ్రవరి నెలలో 6.55 శాతంతో పోలిస్తే మార్చినెల డబ్ల్యుపీఐ 5.70శాతంగా నమోదైంది. ఇంధన ధరలు, తయారీ వస్తువుల ధరలు తగ్గిన కారణంగా టోకు ధరల ద్రవ్యోల్బణం కూడా శాంతించింది. 2016-17 ఆర్థికి సంవత్సరంలో పెరుగుతే వచ్చిన సూచీ నాలుగు సం.రాల గరిష్టాన్నినమోదు చేసింది. ఎనలిస్టుల అంచనాలను తారుమారుచేస్తూ టోకు ధరల సూచి దిగి రావడం విశేషం.
గతేడాది ఇదేకాలంతో పోల్చితే.. డిఫ్లేషన్ నుంచి బయటపడింది. 2016 ఫిబ్రవరిలో మైనెస్ 0.45 శాతంగా ఉన్న డబ్ల్యూపీఐ ప్రతికూలత నుంచి బయకువచ్చింది. తయారీ వస్తువుల ధరలు తగ్గిన కారణంగానే సూచీ 5.70 శాతంగా నమోదయ్యిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇంధన ధరలు 21.02 శాతం నుంచి 18.16 శాతానికి తగ్గడం, తయారీ వస్తువుల ధరలు 3.66 శాతం నుంచి 2.99 శాతానికి తగ్గడం లాంటి సానుకూల అంశాలతో నెలరోజుల పరంగా తగ్గుదల నమోదయ్యింది. అయితే, ఆహారోత్పత్తుల ధరలు 2.69 శాతం నుంచి 3.12 శాతం పెరగడం.. ప్రత్యేకించి పండ్ల ధరలు 7.62 శాతంగా నమోదు కావడం, గుడ్లు, మాంసం, చేపల ధరలు 3.12 శాతంగా ఉండడం వల్ల టోకు ధరల సూచీ 5.70 శాతంగా నమోదయ్యింది. లేదంటే, డబ్ల్యూపీఐ ఇంకా తగ్గేదని డేటా వెల్లడిస్తోంది.
మరోవైపు 2017 సగటు ద్రవ్యోల్బణ సగటు 3.7 శాతంతోలిస్తే 2018 ఆర్థికసంవత్సరంలో ద్రవ్యోల్బణం సగటున 4.8 శాతంగా ఉండనుందని కొటక్ మహీంద్రా బ్యాంకు విశ్లేషకులు అంచనా వేశారు.