న్యూఢిల్లీ: ఎనర్జీ స్టోరేజ్, స్మార్ట్ గ్రిడ్ రంగంలో అంతర్జాతీయంగా 2022 జనవరి–సెప్టెంబర్‌లో రూ.2.05 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ మొత్తం 66 శాతం పెరిగిందని స్వచ్ఛ ఇంధన కన్సల్టింగ్ కంపెనీ మెర్కామ్ క్యాపిటల్ నివేదిక వెల్లడించింది. ఎనర్జీ స్టోరేజ్ విభాగంలో 92 డీల్స్‌కుగాను రూ.1.8 లక్షల కోట్ల నిధులు వెల్లువెత్తాయి. మిగిలిన మొత్తం స్మార్ట్ గ్రిడ్, ఇంధన సామర్థ్యం విభాగాలు కైవసం చేసుకున్నాయి.
ఇంధన నిల్వ సంస్థలు శిలాజ ఇంధనాల నుండి పునరుత్పాదక ఇంధనాలకు మారడంలో కీలక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నందున పెట్టుబడులు పెరుగుతూనే ఉంటాయని మెర్కామ్ సీఈవో రాజ్ ప్రభు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment