గులాబీ పెదవుల కోసం... | Beauty tips | Sakshi
Sakshi News home page

గులాబీ పెదవుల కోసం...

Published Sun, Aug 26 2018 11:47 PM | Last Updated on Mon, Aug 27 2018 12:01 AM

Beauty tips - Sakshi

కొన్ని గులాబీ రెక్కలు, టీ స్పూన్‌ పాలు, టీ స్పూన్‌ వెన్న కలిపి పేస్ట్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునేముందు పెదవుల పై అప్లై చేయాలి. తరచుగా ఈ విధంగా చేస్తే పెదవులు గులాబీరేకల్లా సుతిమెత్తగా తయరవుతాయి.
 అర టీ స్పూన్‌ నిమ్మరసంలో మూడు చుక్కల తేనె, కొద్దిగా గ్లిజరిన్‌ కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకని పెదవులపై మసాజ్‌ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే పెదవులు పగడాల్లా కాంతులీనుతాయి.

గంధంపొడి మాస్క్‌
టొమాటో రసం – కొద్దిగా, కీరారసం –  పావు టీ స్పూన్‌ నిమ్మర సం – పావు టీ స్పూన్‌ గంధం పొడి – రెండు టీ స్పూన్‌లు
తయారి: గంధం పొడిలో టొమాటో రసం, నిమ్మరసం, కీరారసం కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేస్తే చర్మం తాజాగా కాంతులీనుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement