
ఫ్లవర్ మేకింగ్
కాగితం విరిస్తే... పువ్వు అవుతుంది. వాడని పూలతో ఇంటిని అలంకరించాలనే సరదా ఉంటే, ఆ పూలను సొంతంగా పూయించాలనే ముచ్చట ఉంటే చాలు. రంగు కాగితం పవ్వులా రెక్కలు విరుచుకుంటుంది.
ఏమేం కావాలి!
రంగు కాగితం, కత్తెర, హాట్ గ్లూ గన్, సన్నటి పుల్ల (టూత్‌పిక్ సరిపోతుంది)
ఏలా చేయాలంటే!
రంగు పేపర్ తీసుకుని గులాబీ రెక్కల ఆకారాన్ని గీసి ఆ మేరకు పేపర్‌ను కత్తిరించాలి. లేదాకంప్యూటర్ నుంచి గులాబీ రెక్కల డిజైన్‌ను తెల్ల కాగితం మీద ప్రింట్ తీసుకుని రెక్కలను కట్ చేయవచ్చు. లేత ఆకుపచ్చ కాగితం మీద ఫొటోలో కనిపిస్తున్న మూడు ఆకుల ఆకారాన్ని కూడ కత్తిరించుకోవాలి. రెక్కల అంచులను కత్తెర మొన సాయంతో వంపు తిప్పాలి. ప్రతి రెక్కకూ రెండు అంచులను ఇలా వంపు తిప్పాలి. ఆకుల ఆకారంలో కత్తిరించిన కాగితంలోని ప్రతి ఆకునూ మధ్యలోకి నొక్కాలి. పుల్లకు గ్లూ రాసి ముందుగా ఒక్క రెక్కను పుల్లకు చుట్టినట్లు అతికించాలి. సింగిల్ రెక్కలను అతికించిన తర్వాత రెండు రెక్కల కాగితాలను అతికించాలి. ఎక్స్‌ట్రాగా ఉన్న పుల్లను తుంచేసి, ఆ తర్వాత మూడురెక్కల కాగితాల మధ్యలో గ్లూ వేస్తూ అతికిస్తే పువ్వు రెడీ. చివరగా ఆకుల మధ్యలో గ్లూ వేసి పువ్వుని ఆకులకు అతికించాలి. పువ్వుని ఫ్లవర్ వేజ్‌లో అలంకరించడానికి వీలుగా ఉండడానికి టూత్‌పిక్‌ను అలాగే ఉంచుకోవచ్చు. ఆకు కింద వైపు గమ్ కానీ వ్యాక్స్ కానీ రాస్తే ఈ కాగితం గులాబీని నీటి పళ్లెంలో(ఉళ్లేలు) కూడా అలంకరించుకోవచ్చు.