
సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు ఇండిగో, గో ఎయిర్ లాంటి విమాన యాన సంస్థలకు చెందిన విమానాలపై నిషేధం కొనసాగుతుండగా దేశీయ పాసింజర్ ఎయిర్ ట్రాఫిక్ పెరుగుదలను నమోదు చేసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తన నెలవారీ దేశీయ ట్రాఫిక్ నివేదికలో పేర్కొన్న ప్రకారం ఫిబ్రవరిలో విమాన ప్రయాణికుల సంఖ్య(ఏవియేషన్ ట్రాఫిక్) 24 శాతం జంప్‌చేసింది. 24 శాతం వృద్ధితో 2018 ఫిబ్రవరి నాటికి దేశీయ దేశీయ విమాన ప్రయాణీకుల సంఖ్య 1.07 కోట్లకు పెరిగింది. మొత్తం దేశీయ విమాన ప్రయాణీకుల రద్దీ జనవరి నెలలో 1.14 కోట్లకు పెరిగింది. డిజిసిఎ ఇచ్చిన సమాచారం ప్రకారం జనవరి-ఫిబ్రవరి 2018 నాటికి ప్రయాణీకుల రద్దీ 21.80 శాతం పెరిగింది. 2017 నాటికి 86.55 లక్షల నుంచి పెరిగినట్లు సోమవారం వెల్లడించిన అధికారిక గణాంకాలు వెల్లడించాయి. దీంతో విమానయాన కంపెనీల కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. జెట్ ఎయిర్‌వేస్ 2 శాతం, స్పైస్‌జెట్ 1.2 శాతం, ఇంటర్‌గ్లోబ్(ఇండిగో) 0.75 శాతం లాభపడింది.
Comments
Please login to add a commentAdd a comment