కుర్ర చేష్టలతో వీక్ ఎండ్ లో పెను ప్రమాదాలు
నగర ట్రాఫిక్ అసలే నరకాన్ని తలపిస్తుంది. వీకెండ్ సమయాల్లోనైతే పరిస్థితి మరీ దారుణం. వారాంతపు సరదాల కోసం కుర్రకారంతా తమ వాహనాలను కళ్లాలు విడిచిన గుర్రాల్లా యథేచ్ఛగా పరుగులు తీయిస్తారు. బిజీబిజీగా ఉండే గజిబిజి రోడ్లపై సైతం రకరకాల విన్యాసాలు సాగిస్తారు. కనీసం హెల్మెట్లయినా ధరించకుండా, బైకులతో శరవేగంగా దూసుకుపోతారు. సీటు బెల్టులైనా పెట్టుకోకుండానే కార్లతో రేసులాడతారు. ఇలాంటి చేష్టలే పెను ప్రమాదాలకు దారితీస్తున్నాయి. పలువురి ప్రాణాలను బలిగొంటున్నాయి. కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి.
కుర్ర చేష్టలతో పెను ప్రమాదాలు
4,230 గత ఐదున్నరేళ్లుగా వీకెండ్ ప్రమాదాలు .వీరిలో యువతే అధికం.. ట్రాఫిక్ ఉల్లంఘనలు షరామామూలే
2,949 ఆరేళ్లలో నగరంలో రోడ్డు ప్రమాద మృతులు
15,295 మూడేళ్లలో డ్రంకెన్ డ్రైవ్‌లో చిక్కిన యువత
బిరుద రాజు వాసుదేవ రాజు/హైదరాబాద్
హాలిడేను ఇంటిల్లిపాదితో కలసి జాలిడేగా గడపాలనుకున్న సిటిజన్ల ఆశలను రోడ్డు ప్రమాదాలు చిదిమేస్తున్నాయి. చాలీచాలని రహదారులు... పెరుగుతున్న వాహనాలు.. ప్రమాదకరమైన డ్రైవింగ్.. మితిమీరిన వేగం... వెరసి నగర రహదారులు నిత్యం నెత్తురోడుతున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే వారాంతాలైన శని, ఆదివారాల్లో ప్రమాదాల సంఖ్య ఏటేటా పెరుగుతున్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీకెండ్ సరదాకు మిత్రులతో కలసి ఔటర్‌పై రయ్‌మని దూసుకుపోయే కుర్రకారు క్షణాల్లో సమిధలుగా మారుతుండడంతో కన్నవారికి పుట్టెడు శోకం మిగులుతోంది. రోడ్డు ప్రమాదాల్లో అసువులు బాసిన వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకుంటున్నాయి. గత ఐదున్నరేళ్లుగా శని, ఆదివారాల్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో ఏకంగా 4,230 మంది మృత్యువాత పడ్డారంటే వీకెండ్ ప్రమాదాల తీవ్రత ఎంతుందో అర్థం చేసు కోవచ్చు. ఇక ప్రమాదకర డ్రైవింగ్ కేసులు గత నాలుగున్నరేళ్లుగా 40,325 నమోదయ్యాయంటే... భాగ్యనగరంలో రహదారి భద్రత తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా మరోవైపు నగర శివార్లలో వందలాదిగా విస్తరించిన వృత్తివిద్యా కళాశాలలు, ఇంజనీరింగ్, ఫార్మా, మేనేజ్‌మెంట్, ఎంసీఏ కాలేజీల విద్యార్థులకు... వారి తల్లిదండ్రులు మార్కెట్‌లోకి వస్తున్న కొత్తకొత్త వాహనాలను కొనిస్తున్నారు. ఈ ఆధునిక వాహనాలే ఇప్పుడు విద్యార్థుల పాలిట యమపాశాలవుతున్నాయి. కనీస భద్రతా చర్యలు విస్మరిస్తుండడం, హెల్మెట్‌లను భారంగా భావిస్తుండడం.. ప్రమాదం జరిగిన వెంటనే (గోల్డెన్ అవర్- 30 నిమిషాల్లోగా) వారిని ట్రామా కేర్ సెంటర్లకు తరలించకపోవడంతో యువకుల జీవితాలు అర్ధంతరంగా చితికిపోతున్నాయి.శివారు ప్రాంతాలకు సరైన ప్రజా రవాణా వ్యవస్థ లేకపోవడం, ఆ దిశగా పాలకులెవరూ చర్యలు తీసుకోకపోవడంతో... విద్యార్థులు సొంత వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి. రహదారులపై ప్రమాదాలు పెరగడానికి ఇదీ ఓ ముఖ్య కారణం.
యూత్ ఉల్లంఘనలు ఇవే..
► సిగ్నల్ జంపింగ్
► ఓవర్‌స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్
► సెల్‌ఫోన్ మాట్లాడుతూ
► డ్రంకన్ డ్రైవింగ్
► రాంగ్‌సైడ్ డ్రైవింగ్
► ట్రిపుల్ రైడింగ్
► ప్రమాణాలకు విరుద్ధంగా ఉండే హారన్లతో సౌండ్ పొల్యూషన్
లైన్ డిసిప్లిన్‌పై దృష్టి...
రాజధానిలోని రోడ్లపై లైన్ డిసిప్లిన్‌ను అమలు చేయడం ద్వారా వాహనాల ప్రయాణ వేగాన్ని పెంచి, గమ్యం చేరే సమయాన్ని తగ్గించవచ్చు. ముంబైలో ఈ విధానం మంచి ఫలితాలనిచ్చింది. ట్రాఫిక్ ఉల్లంఘనులను కట్టడి చేయడం వల్ల కూడా ప్రమాదాలు, ప్రాణ నష్టాన్ని అరికట్టవచ్చు. ఇప్పుడు గ్రీన్‌లైట్-రెడ్‌లైట్ మధ్య సిగ్నల్‌ను 100 వాహనాలు దాటితే...లైన్ డిసిప్లేన్ అమలుతో 150కి పైగా దాటేలా చేయవచ్చు. ఫలితంగా వాహనాల ప్రయాణ వేగం పెరిగి, గమ్య స్థానాలకు చేరడానికి పట్టే సమయాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. లైన్ డిసిప్లేన్ విధానాన్ని పరిచయం చేయడానికి ముందు కొన్ని మౌలిక వసతుల్ని మెరుగుపర్చడంతో పాటు ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సి ఉంది. - ట్రాఫిక్ చీఫ్ జితేందర్
డ్రంకెన్ డ్రైవ్
26,047 పోలీసులకు చిక్కిన యువత
తనిఖీలు ప్రారంభం : 2011 నవంబర్
నేటి వరకు నమోదైన మొత్తం కేసులు : 32,125
జైలు శిక్ష పడింది(వీరిలో మహిళలు 46 మంది) : 1,759
బైక్‌పై వెళ్తూ పట్టుబడినవారు : 23071
ఆటో డ్రైవర్లు : 1384
కారు డ్రైవర్లు : 7403
ఇతర వాహనాలు : 267
వసూలైన మొత్తం జరిమానా : రూ.5,78,05,552
పట్టుబడిన వారిలో...
ఏజ్ గ్రూప్ నమోదైన కేసులు
18-20 625
21-30 15295
31-40 10752
41-50 4178
51-60 1127
61-70 146
కేసులివీ...
ఏడాది కేసులు జైలుశిక్ష జరిమానా
2011 1700 - రూ.31,15,600
2012 10813 27 రూ.2,21,25,000
2013 13476 1234 రూ.2,37,71,420
2014 6136 498 రూ.78,58,733
ప్రముఖులూ ఉన్నారు
ప్రభుత్వ ఉద్యోగులు - 488
ప్రయివేటు ఉద్యోగులు - 10756
న్యాయవాదులు - 185
డాక్టర్లు - 213
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు - 837
ప్రెస్ -127
డ్రైవర్లు -3574
బ్లూకాలర్స్ - 8279
వ్యాపారులు - 5618
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు - 92
విద్యార్థులు - 1720
బ్యాంకు ఉద్యోగులు - 144
టీచర్లు - 29
మాజీ పోలీసులు - 63
మార్గదర్శకాలు...
→ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి
→ ఫ్యూయల్ ట్యాంకుపై పిల్లలను కూర్చోపెట్టవద్దు
→ స్కూటర్ల వంటి వాహనాల్లో ముందు వైపు ఖాళీగా ఉండేచోట పిల్లలను నిలబెట్టవద్దు
→ డ్రైవింగ్ లెసైన్స్ సహా ముఖ్యమైన పత్రాలను మరచిపోవద్దు
→ మద్యం సేవించి వాహనాన్ని నడపొద్దు
→ డ్రైవింగ్ చేస్తుండగా మొబైల్ ఫోన్‌లో మాట్లాడొద్దు
→ పరిమితిని మించిన వేగంతో పోవద్దు
→ ట్రాఫిక్ సిగ్నల్స్‌ను, బోర్డులను, సంకేతాలను గమనించి, వాటికి అనుగుణంగా వాహనాలు నడపండి
→ రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులు ఇచ్చే సంకేతాలను అర్థం చేసుకుని, వాటికి అనుగుణంగా ముందుకు సాగండి
→ ట్రాఫిక్ జామ్ అయినప్పుడు, నెమ్మదిగా ముందుకు సాగుతున్నప్పుడు దూసుకుపోయే ప్రయత్నాలు చేయొద్దు.
→ జీబ్రా క్రాసింగ్స్ వద్ద వాహన వేగం తగ్గించండి.
→ రోడ్డుపై వాహనాన్ని పార్క్ చేయవద్దు. పే అండ్ పార్క్ సేవలను ఉపయోగించుకోండి.
→ మితిమీరిన లగేజీ, ప్రయాణికులతో వాహనాన్ని ఓవర్‌లోడ్ చేయకండి.
→ అకస్మాత్తుగా బ్రేకులు వేయడాన్ని, దూకుడుగా వేగం పెంచడాన్ని నివారించండి.
→ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు క్లచ్‌ను ఫుట్‌రెస్ట్‌గా ఉపయోగించుకోవద్దు.
రాత్రివేళే ఎక్కువ...
జనవరి 1, 2014 నుంచి ఏప్రిల్ 30 వరకు
ఘోరమైనవి
జూన్ 20, 2010 నటుడు కోట శ్రీనివాసరావు కుమారుడు కోట ప్రసాద్ దుర్మరణం
సెప్టెంబర్ 11, 2011 మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ కుమారుడు అయాజుద్దీన్ దుర్మరణం
నవంబర్ 23, 2011 సైబరాబాద్ ఎస్‌ఓటీ ఎస్సై వీసీ విజ్జు దుర్మరణం
డిసెంబర్ 20, 2011 మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు సహా ముగ్గురి మృత్యువాత
మే 9, 2012 సీడ్స్ కంపెనీ డెరైక్టర్ పిచ్చిరెడ్డి దుర్మరణం
స్కూల్/కాలేజ్ జోన్స్ పరిధిలో...
గడిచిన ఆరేళ్లలో 3786 ప్రమాదాలు, 3786 మంది క్షతగాత్రులు ఔటర్ రింగ్‌రోడ్డుపై గడిచిన మూడేళ్లలో
137 ప్రమాదాలు, మృతులు 173
ట్రాఫిక్ ఉల్లంఘనలు ఇలా...
రాష్ డ్రైవింగ్
2012 ⇒ కేసులు : 7,594 జరిమానా : 75,94,000
2013 ⇒ కేసులు : 11,126 జరిమానా : 1,11,26,000
ఓవర్ స్పీడ్
2012 ⇒ కేసులు : 4843 జరిమానా : 48,43,000
2013 ⇒ కేసులు : 12,770 జరిమానా : 1,27,70,000
సిగ్నల్ జంపింగ్
2012 ⇒ కేసులు : 66,260 జరిమానా : 6,62,60,000
2013 ⇒ కేసులు : 75,323 జరిమానా : 7,53,23,000
ట్రిపుల్ రైడింగ్
2012 ⇒ కేసులు : 10,720 జరిమానా : 1,07,20,000
2013 ⇒ కేసులు : 12,472 జరిమానా : 1,24,72,000
నో పార్కింగ్
2012 ⇒ కేసులు : 4,16,956 జరిమానా : 41,69,56,000
2013 ⇒ కేసులు : 4,57,899 జరిమానా : 45,78,99,000
సీటు బెల్టు లేకుండా..
2012 ⇒ కేసులు : 348 జరిమానా : 3,48,000
2013 ⇒ కేసులు : 345 జరిమానా : 3,45,000
హెల్మెట్ లేకుండా..
2012 ⇒ కేసులు : 812 జరిమానా : 8,12,000
2013 ⇒ కేసులు : 503 జరిమానా :5,03,000
సెల్‌ఫోన్ డ్రైవింగ్
2012 ⇒ కేసులు: 15,058 జరిమానా : 1,50,58,000
2013 ⇒ కేసులు : 24607 జరిమానా : 2,46,07,000