హెల్మెట్ ధరించండి.. ప్రాణాలు కాపాడుకోండి అంటూ ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ ఒకరు పాడిన పాట అందరి ప్రశంసలను అందుకుంటోంది. రహదారి భద్రత గురించి ఉన్న ఈ పాట వైరల్‌గా మారింది. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ నటించిన గల్లీబాయ్ సినిమాలోని 'ఆప్నా టైమ్ ఆయేగా..' పాటను తన వెర్షన్‌లో పాడాడు. రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడుకోండంటూ సలహాలను చరణాలుగా మలిచాడు. 42 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోలో రోడ్డు భద్రతపై సందేశాన్నిచ్చే విధంగా సొంత లిరిక్స్‌నుపయోగించాడు సందీప్ సాహి అనే ట్రాఫిక్ పోలీస్.