delhi cop
-
పోలీస్ పాటకు జనం ఫిదా.. వీడియో వైరల్
-
పోలీస్ పాటకు జనం ఫిదా.. వీడియో వైరల్
సాక్షి, ఢిల్లీ: హెల్మెట్ ధరించండి.. ప్రాణాలు కాపాడుకోండి అంటూ ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ ఒకరు పాడిన పాట అందరి ప్రశంసలను అందుకుంటోంది. రహదారి భద్రత గురించి ఉన్న ఈ పాట వైరల్‌గా మారింది. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ నటించిన గల్లీబాయ్ సినిమాలోని 'ఆప్నా టైమ్ ఆయేగా..' పాటను తన వెర్షన్లో పాడాడు. రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడుకోండంటూ సలహాలను చరణాలుగా మలిచాడు. 42 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోలో రోడ్డు భద్రతపై సందేశాన్నిచ్చే విధంగా సొంత లిరిక్స్నుపయోగించాడు సందీప్ సాహి అనే ట్రాఫిక్ పోలీస్. సందీప్ భార్య రోడ్డు ప్రమాదంలో మరణించింది. అప్పటినుంచి రోడ్డు భద్రతపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాడు. హెల్మెట్స్, సీట్‌బెల్ట్ ధరించండని ప్రస్తుత పాటలో వాహనదారులకు పిలుపునిస్తున్నాడు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించవద్దని కోరుకుంటున్నాడు. ‘నేను చెప్పేది పాటించండి.. హాయిగా జీవించండి’ అని తన వీడియో ద్వారా సందేశాన్నిచ్చాడు. అదే సమయంలో తాగి వాహనాలు నడిపే వారిని హెచ్చరించాడు. 'జై హింద్, జై భారత్' అంటూ పాట ముగించాడు. ఈ వీడియోకు నెటిజన్లు స్పందిస్తూ అతని పాటకు పూర్తిగా ఫిదా అయ్యామని, అందుకు 10కి 10 మార్కులు ఇవ్వొచ్చని ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి పోలీసులే మాకు కావాల్సింది అంటూ అతనికి సెల్యూట్ చేస్తున్నారు. మరి ఈ సాంగ్ రణవీర్ కూడా చూశాడో, లేదో తెలియాలి! -
గ్యాస్ లీకై మంటలొస్తే ఇలా చేయండి
-
గ్యాస్ లీకై మంటలొస్తే ఇలా చేయండి
న్యూఢిల్లీ: ఎల్పీజీ గ్యాస్ లేని ఇళ్లును ఈ రోజుల్లో దాదాపు చూపించలేం. ప్రతి ఇంట్లో ఇదొక నిత్యావసరం. వంట చేసుకునేందుకు ఇది ఎంత సౌకర్యంగా ఉంటుందో ఒక్కోసారి లీకైతే అంత వినాశనాన్ని చూపిస్తుంది. అత్యధిక శబ్దంతో భారీ పేలుడు కూడా సంభవించి విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ప్రాణనష్టాన్ని కలగ జేస్తోంది. వేసవి కాలంలో ఇలాంటి సంఘటనలు కాస్తంత ఎక్కువగా జరిగేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అలాంటి ప్రమాదం నుంచి ఎలా బయటపడవచ్చో ఢిల్లీకి చెందిన సుశీల్ కుమార్ అనే పోలీసు అధికారి ఫేస్బుక్ ద్వారా ఓ మాక్‌డ్రిల్ చేసి చూపించారు. పెద్ద మొత్తంలో జనసమూహం ఓ చోట చేరి ఉండగా వారి మధ్యలో గ్యాస్ బండ పెట్టి దానిని ఆయనే లీక్ చేసి నిప్పంటించి అనంతరం తేలికగా ఆర్పేశారు. అందుకు ఓ తడిపిన వస్త్రాన్ని ఉపయోగించారు. గ్యాస్ లీకవ్వగానే అది మండటానికి ఆక్సిజన్ సహకరిస్తుందని, అది అందకుండా చేస్తే గ్యాస్ మంటను ఆర్పేయవచ్చని అందుకు తడిసిన వస్త్రాన్ని తీసుకొని మండుతున్న గ్యాస్ సిలిండర్‌పై పూర్తిగా కప్పివేస్తే వెంటనే ఆ మంట ఆరిపోతుందని ప్రయోగాత్మకంగా చూపించారు. ఈ వీడియోను ఆయన తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేయగా దానిని ఇప్పటకి 60లక్షలమంది వీక్షించారు. మొత్తానికి ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
మీడియాపై కోర్టుకెక్కిన పోలీస్
న్యూ ఢిల్లీ: తాగిన వ్యక్తిలా ఊగుతూ ఢిల్లీ మెట్రో రైలులో కిందపడ్డ కానిస్టేబుల్ వీడియో గత ఏడాది హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ రోజు అతను అసలు మద్యం తీసుకోలేదని, ఆరోగ్య సమస్య కారణంగానే అలా తూలిపడ్డాడని పోలీసుల విచారణలో తేలింది. వీడియో బయటకు వచ్చినప్పుడు తనను అప్రతిష్టపాలు చేయడానికి మీడియా చూపించిన చొరవ, తాను తప్పు చేయలేదని నిర్ధారణ అయిన తర్వాత చూపించకపోవడంతో ఇప్పుడు సలీం సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. వివరాలు..ఢిల్లీ మెట్రోరైలులో కానిస్టేబుల్‌గా విధి నిర్వహణలో ఉన్న పీకే సలీం తప్ప తాగి తూలుతూ ఉన్నట్టు కనిపించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆ వీడియోకు 2లక్షలకు పైగా లైక్స్ కూడా వచ్చాయి. దీంతో అతనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారించిన పోలీసులు సలీంను సస్పెండ్ చేశారు. అయితే తాను మద్యం సేవించలేదని సలీమ్ చెప్పడంతో మరోసారి విచారణ చేపట్టారు. ఆ రోజు సలీమ్ తాగలేదని, ఆరోగ్యం బాగోలేకపోవడంతోనే ఆ ఘటన జరిగిందని పోలీసుల ధ్రువీకరించారు. దీంతో అతడిని గత నవంబర్‌లో తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఈ వార్త మీడియాలో ఎక్కడా రాలేదు. 'ఆ వీడియో వల్ల సలీం సస్పెండ్ అయ్యాడు. అప్పుడు అన్ని పత్రికల్లో ముందు పేజీల్లో వేశాయి. కానీ సలీం ఆ రోజు తాగిలేడు అని నిర్ధారణ అయిన తర్వాత ఎవరూ ఆ వార్తని ప్రచురించలేదు. ప్రజల దృష్టిలో అతను ఇంకా సస్పెండ్ అయ్యే ఉన్నాడు.' అని సలీం తరఫు న్యాయవాది తెలిపారు. దీంతో ఆ వీడియో వల్ల తనకు చెడ్డపేరు వచ్చిందంటూ ఇప్పుడు సలీమ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు పరువునష్టం అందించాలని కోరాడు.