ఎల్పీజీ గ్యాస్ లేని ఇళ్లును ఈ రోజుల్లో దాదాపు చూపించలేం. ప్రతి ఇంట్లో ఇదొక నిత్యావసరం. వంట చేసుకునేందుకు ఇది ఎంత సౌకర్యంగా ఉంటుందో ఒక్కోసారి లీకైతే అంత వినాశనాన్ని చూపిస్తుంది. అత్యధిక శబ్దంతో భారీ పేలుడు కూడా సంభవించి విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ప్రాణనష్టాన్ని కలగ జేస్తోంది. వేసవి కాలంలో ఇలాంటి సంఘటనలు కాస్తంత ఎక్కువగా జరిగేందుకు అవకాశం ఉంది.