గ్యాస్ లీకై మంటలొస్తే ఇలా చేయండి
పెద్ద మొత్తంలో జనసమూహం ఓ చోట చేరి ఉండగా వారి మధ్యలో గ్యాస్ బండ పెట్టి దానిని ఆయనే లీక్ చేసి నిప్పంటించి అనంతరం తేలికగా ఆర్పేశారు. అందుకు ఓ తడిపిన వస్త్రాన్ని ఉపయోగించారు. గ్యాస్ లీకవ్వగానే అది మండటానికి ఆక్సిజన్ సహకరిస్తుందని, అది అందకుండా చేస్తే గ్యాస్ మంటను ఆర్పేయవచ్చని అందుకు తడిసిన వస్త్రాన్ని తీసుకొని మండుతున్న గ్యాస్ సిలిండర్‌పై పూర్తిగా కప్పివేస్తే వెంటనే ఆ మంట ఆరిపోతుందని ప్రయోగాత్మకంగా చూపించారు. ఈ వీడియోను ఆయన తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేయగా దానిని ఇప్పటకి 60లక్షలమంది వీక్షించారు. మొత్తానికి ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.