
క్షతగాత్రులను బయటికి తీస్తున్న స్థానికులు
పెనుకొండ రూరల్: జాతీయరహదారిపై వేగంగా వెళుతున్న కారు కుక్క అడ్డురావడంతో బోల్తాపడింది. కారు నుజ్జునుజ్జయినప్పటికీ అందులో ప్రయాణిస్తున్న దంపతులు సీటుబెల్టు ధరించడం వల్ల ఎటువంటి గాయాలు కాకుండా ప్రాణాలతో బయటపడ్డారు. పెనుకొండ ఎస్‌ఐ జనార్ధన్ తెలిపిన మేరకు... బెంగళూరుకు చెందిన సంతోష్ తన భార్య ప్రశాంతితో కలసి ఆదివారం ఉదయం గుంతకల్లుకు కారులో బయల్దేరాడు.
పెనుకొండ మండలం హరిపురం జాతీయ రహదారిపై కుక్క అడ్డురావడంతో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. వాహనం పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ సీటు బెల్టు ధరించడంతో లోపల ఉన్న వారికి ప్రాణాపాయం తప్పింది. స్థానికులు, వాహనదారులు గమనించి దంపతులను బయటకు తీశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment