సీటు బెల్టు కాపాడింది..! | Seat belt saved them ! | Sakshi
Sakshi News home page

సీటు బెల్టు కాపాడింది..!

Published Fri, Sep 16 2016 9:48 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

సీటు బెల్టు కాపాడింది..! - Sakshi

సీటు బెల్టు కాపాడింది..!

కొలనుకొండ (తాడేపల్లి రూరల్‌): జాతీయ రహదారిపై తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద ఇద్దరు యువతులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తూ పల్టీ కొట్టి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. అయితే సీటు బెల్టులు పెట్టుకున్న కారణంగా వారిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సేకరించిన వివరాల ప్రకారం... గుంటూరు వైపు నుంచి విజయవాడ వెళుతున్న మారుతి ఆల్టో కారులో ఇద్దరు యువతులు ప్రయాణిస్తున్నారు. అతి వేగంగా కారు నడపడంతో, కారు అదుపు తప్పి ముందు వెళుతున్న మరో కారును ఢీకొట్టి, జాతీయ రహదారి నుంచి 30 అడుగుల దూరంలో పంట పొలాల్లో పడిపోయింది.

మూడు పల్టీలు కొట్టి, వెనుక, ముందు అద్దాలు పగలడంతోపాటు కారు క్యాబిన్‌ కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఓ యువతికి స్వల్ప గాయాలు కాగా, మరో యువతి తలకు గాయమైంది. ఇద్దరూ సీటు బెల్టు పెట్టుకోవడం వల్లే పెద్దగా గాయపడలేదని వారు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి ప్రమాదానికి కారణమైన ఇద్దరు యువతులు బస్సులో విజయవాడ వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement