
సీట్‌బెల్ట్, ఎయిర్‌బ్యాగ్‌లతో మరో లాభం
కారు డ్రైవింగ్ చేసే సమయంలో పెట్టుకునే సీట్‌బెల్ట్ యాక్సిడెంట్స్‌లో డ్రైవర్ ప్రాణాలు కాపాడుతుందన్న...
నోఫియర్ విత్ బ్యాగ్ ఆఫ్ ఎయిర్
కారు డ్రైవింగ్ చేసే సమయంలో పెట్టుకునే సీట్‌బెల్ట్ యాక్సిడెంట్స్‌లో డ్రైవర్ ప్రాణాలు కాపాడుతుందన్న విషయం తెలిసిందే. దీనికి తోడు యాక్సిడెంట్ జరిగిన మరుక్షణం ఎయిర్‌బ్యాగ్ తెరచుకొని, అది వాహనం నడిపే వ్యక్తి జీవితాన్ని రక్షిస్తుందన్న విషయమూ తెలిసిందే. ఒక అంచనా ప్రకారం... ఈ ఎయిర్‌బ్యాగ్ వ్యాకోచించి డ్రైవర్ ఛాతీని, తలను ఆవరించి, వాటిని రక్షిస్తుంది కాబట్టి, కీలకమైన ఈ అవయవాలకు రక్షణ దొరకడంతో ప్రాణగండం తప్పుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే.
కానీ డ్రైవింగ్ చేసే వ్యక్తి మూత్రపిండాలనూ కాపాడుతుంది ఈ ఎయిర్‌బ్యాగ్. ఈ విషయాన్ని అమెరికన్ యూరలాజికల్ అసోసియేషన్‌కు చెందిన అధ్యయన వేత్తలు నిరూపించారు. 2,87,174 మందిపై నిర్వహించిన అధ్యయనంలో ఈ సంగతి తెలిసింది. ఇందులో యాక్సిడెంట్ కాగానే ఎయిర్‌బ్యాగ్ విచ్చుకోవడం వల్ల 2,580 మంది కిడ్నీలకు రక్షణ లభించింది.