
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలను షేర్‌చేస్తూ..'కరోనా ఇంకా ముగియలేదు. కాబట్టి మీరు బయటికి వెళ్లేటప్పుడు మాస్క్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించండి. లుక్స్ కంటే మాస్క్‌పై దృష్టి పెట్టండి. సరక్షితంగా ఉండండి' అంటూ పేర్కొన్నారు. ఈ పోస్ట్‌పై సోనూసూద్ సహా పలువురు ప్రముఖులు స్పందించారు. జో హుకుమ్(మీరు ఎలా చెబితే అలాగే)అంటూ సోనూ సూద్ పేర్కొనగా, మీరు మాస్క్ ఉన్నా లేకపోయినా అందంగానే ఉంటారంటూ ఫేమస్ చెఫ్ సువిర్ సారన్ ప్రశంసించారు. స్మృతి పోస్ట్‌పై పలువురు నెటిజన్లు సైతం హార్ట్ ఎమోజీలతో కామెంట్లు పెడుతున్నారు.
చదవండి : శర్వానంద్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చిన మెగా హీరో..
చదవండి : తాప్సీని మరోసారి టార్గెట్ చేసిన కంగనా
Comments
Please login to add a commentAdd a comment