ఆక్సిజన్‌ కోసం అర్థిస్తే.. అరెస్ట్‌ చేశారు | Man Sends SOS for Oxygen UP Police Books Him For Spreading Rumours | Sakshi
Sakshi News home page

ఆక్సిజన్‌ కోసం అర్థిస్తే.. అరెస్ట్‌ చేశారు

Published Wed, Apr 28 2021 2:46 PM | Last Updated on Wed, Apr 28 2021 4:52 PM

Man Sends SOS for Oxygen UP Police Books Him For Spreading Rumours - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

లక్నో: దేశప్రజలంతా కోవిడ్‌ బారిన అల్లాడుతున్నారు. ముఖ్యంగా సెకండ్‌ వేవ్‌లో మహమ్మారి విజృంభణ ఉధృతంగా ఉంది. ఈ సారి ఆక్సిజన్‌, బెడ్ల కొరత అధికంగా ఉంది. ఏ హాస్పిటల్‌ ముంద చూసినా ప్రాణవాయువు కోసం అర్థిస్తూ.. ఆస్పత్రుల్లో చేర్చుకోమంటూ వేడుకునే జనాలకు సంబంధించిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు సోషల్‌ మీడియా వేదికగా తమ సమస్యను తెలియజేస్తూ.. సాయం అర్దిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఆక్సిజన్‌ కోరుతూ ట్వీట్‌ చేసినా ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ లోపు సదరు వ్యక్తి కుటుంబ సభ్యుడు మరణించాడు. ఆ వివరాలు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన శశాంక్‌ యాదవ్‌ అనే వ్యక్తి ట్విట్టర్‌ వేదికగా.. తన తాత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.. తనకు ఆక్సిజన్‌ సిలిండర్‌ అత్యవసరం అంటూ ట్వీట్‌ చేస్తూ నటుడు సోనూ సూద్‌ని ట్యాగ్‌ చేసి సాయం చేయాల్సిందిగా కోరాడు.

శశాంక్‌ స్నేహితుడు అంకిత్‌ ఈ మెసేజ్‌ను ఓ జర్నలిస్ట్‌కు సెండ్‌ చేసి తన ఫ్రెండ్‌కి సాయం చేయాల్సిందిగా అభ్యర్థించాడు. సదరు రిపోర్టర్‌ ఈ మెసేజ్‌ను షేర్‌ చేస్తూ స్మృతి ఇరానీని ట్యాగ్‌ చేశారు. అయితే ఈ మెసేజ్‌లలో ఎక్కడా కూడా శశాంక్‌ తాత కోవిడ్‌తో బాధపడుతన్నట్లు వెల్లడించలేదు. ఈ మెసేజ్‌ చూసిన స్మృతి ఇరానీ శశాంక్‌కు సాయం చేద్దామని భావించి అతడికి 3 సార్లు కాల్‌ చేసినప్పటికి.. ఎలాంటి స్పందన లేదని తెలిసింది.

దాంతో స్మృతి ఇరానీ ఈ మెసేజ్‌ను అమేథీ జిల్లా మెజిస్ట్రేట్‌, పోలీసు ఉన్నతాధికారికి సెండ్‌ చేసి.. వివరాలు కనుక్కోమని ఆదేశించారు. ఇదిలా ఉండగానే శశాంక్‌ తాత చనిపోయినట్లు తెలిసింది. దాంతో స్మృతి ఇరానీ సంతాపం తెలిపారు. ‘‘శశాంక్‌ తన ట్వీట్‌లో షేర్‌ చేసిన నంబర్‌కు మూడు సార్లు కాల్‌ చేశాను. కానీ ఎలాంటి రెస్పాన్స్‌ లేదు. దాంతో అమేథీ డిస్ట్రిక్‌ మెజిస్ట్రేట్‌, పోలీసులకు అతడి గురించి కనుక్కోని సాయం చేయాల్సిందిగా ఆదేశించాను’’ అంటూ స్మృతి ఇరానీ ట్వీట్‌ చేశారు.

ఈ క్రమంలో అమేథీ పోలీసులు శశాంక్‌ వివరాలు తెలుసుకుని అతడిని అరెస్ట్‌ చేశారు. ఎందుకంటే శశాంక్‌ తాత కోవిడ్‌ బారిన పడలేదు. ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ‘‘అతడి తాత కోవిడ్‌ బారిన పడలేదు. అసలే బయట జనాలు ఆక్సిజన్‌ కొరతతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో శశాంక్‌ తన సోషల్‌ మీడియాలో జనాలను భయపెట్టేలా ఇలా ట్వీట్‌ చేయడం సరైంది కాదు. పైగా అతను బయట ఎక్కడా ఆక్సిజన్‌ సిలిండర్‌ కోసం ప్రయత్నించలేదు. డైరెక్ట్‌గా యాక్టర్‌ సోనూ సూద్‌నే తనకు సాయం చేయమని కోరాడు. తప్పుడు సమాచారం షేర్‌ చేసినందుకు అతడిని అరెస్ట్‌ చేశాం’’ అన్నారు. 
 

చదవండి: 
వైరల్‌: భర్తకు కోవిడ్‌.. నోటి ద్వారా శ్వాస అందించిన భార్య
ఢిల్లీ సర్కార్‌ ఆక్సిజన్‌ ‘యాక్షన్‌ ప్లాన్‌ ’

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement