
శంకరపట్నం: హెల్మెట్ కొనాలంటే పట్టణాలకు పరుగులు తీయాల్సిన పని లేదు. జాతీయ రహదారి వెళ్లే పల్లెల్లోనూ లభ్యమవుతున్నాయి.శంకరపట్నం మండలంలో హెల్మెట్ విక్రయాలు ఊపందుకున్నాయి. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెల్మెట్ చట్టం అమలుకావడంతో ద్విచక్రవాహనదారులు హెల్మెట్లు ధరిస్తున్నారు. హెల్మెట్ లేకుండా రోడ్డెక్కితే కేసులు నమోదు చేస్తున్నారు. గతంలో మాదిరిగా వాహనాలు తనిఖీచేసి కేసులు పెట్టేవారు. ఇప్పుడు ఈ పెట్టి కేసులు పెడుతుండడంతో ద్విచక్రవాహనదారుడు హెల్మెట్ ధరించకుంటే ఫోటోతీసి అప్‌లోడ్ చేస్తున్నారు. కారు నడుపుతున్న వ్యక్తి సీటుబెల్ట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తే సీసీ కెమెరల్లో నమోదవుతున్న పుటేజీల ఆధారంగా కేసులు నమోదుచేస్తున్నారు. ఈ చలాన్ విధానం అమల్లోకి రావడంతో పోలీసులు జాతీయరహాదారిపై రోజుకో ప్రాంతంలో నిఘా పెంచుతున్నారు. మండలంలోని కేశవపట్నంలోనే మూడు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డుపక్కన విక్రయిస్తున్నారు. ఒక్కో హెల్మెట్ రూ.300నుంచి రూ.1000 వరకు ధరల్లో లభ్యమవుతున్నాయి.
హెల్మెట్ ధరించండి
కరీంనగర్– వరంగల్ జాతీయ రహాదారి ని త్యం రద్దీగా ఉంటుంది. వాహనాల రాకపోకల తో అప్రమత్తంగా డ్రైవింగ్ చేయకుంటే ప్రమాదాల బారిన పడుతున్నారు. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తే సురక్షతంగా గమ్యానికి చేరుకుంటారు. హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపితే ఈ పెట్టి కేసులు నమోదు చేస్తున్నాం.
– సత్యనారాయణ, ఎస్సై
Comments
Please login to add a commentAdd a comment