
ప్రమాదానికి గురైన కారు
సాక్షి, రాజేంద్రనగర్: కారు సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో ఎయిర్ బ్యాగ్ తెరుచుకుని ప్రమాదం నుంచి సురక్షితంగా ఓ యువ డాక్టర్ బయటపడింది. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సైదాబాద్ పూర్ణాదేవీకాలనీకి చెందిన డాక్టర్ ఎ.దివ్యారెడ్డి(26) గచ్చిబౌలిలోని ఓ ఆసుపత్రిలో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తుంది. గురువారం నైట్ డ్యూటీ చేసిన డాక్టర్ దివ్యారెడ్డి శుక్రవారం ఉదయం విధులు ముగించుకుని తన కారులో ఇంటికి బయలుదేరింది. ఔటర్ పై నుంచి హిమాయత్‌సాగర్ వద్ద దిగి రాజేంద్రనగర్ మీదుగా చంద్రాయణగుట్ట వైపు వెల్తుంది.
గాందీనగర్ మందిరం దాటగానే రోడ్డుపై ఓ వీధి కుక్క అడ్డు రావడంతో దానిని తప్పించే క్రమంలో కారు కాస్తా పక్కనే ఉన్న సైన్‌బోర్డును ఢీకొని అలాగే ముందున్న రాళ్లను ఢీకొంటూ వెళ్ళి ఆగిపోయింది. ఆమె సీటు సీటు బెల్టు ధరించడంతో వెంటనే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడింది. వాహనం పూర్తిగా ధ్వంసమయింది. ఆ రోడ్డు మీదుగా వెళ్తున్న వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన దివ్యారెడ్డిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment