సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అతి వేగంలో ఉన్న కారు డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న డిగ్రీ విద్యార్ధి మృతి చెందాడు. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. దుర్గానగర్ చౌరస్తాలో కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో కారు పల్టీలు కొట్టింది. అనంతరం.. రోడ్డుపై ఆగి ఉన్న కారును ఢీకొట్టి రోడ్డుకు అడ్డంగా కారు పడిపోయింది. ఇక, ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న డిగ్రీ విద్యార్థి చంద్రశేఖర్ మృతి చెందాడు. మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో, వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా, విద్యార్థులు మద్యం సేవించి కారు నడిపినట్టు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: ‘బెంగాల్ రామోజీ’ బిశ్వప్రియ గిరి అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment