Milardevpally
-
మద్యం మత్తులో కారు బీభత్సం.. విద్యార్థుల హల్చల్
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అతి వేగంలో ఉన్న కారు డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న డిగ్రీ విద్యార్ధి మృతి చెందాడు. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. దుర్గానగర్ చౌరస్తాలో కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో కారు పల్టీలు కొట్టింది. అనంతరం.. రోడ్డుపై ఆగి ఉన్న కారును ఢీకొట్టి రోడ్డుకు అడ్డంగా కారు పడిపోయింది. ఇక, ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న డిగ్రీ విద్యార్థి చంద్రశేఖర్ మృతి చెందాడు. మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో, వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా, విద్యార్థులు మద్యం సేవించి కారు నడిపినట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: ‘బెంగాల్ రామోజీ’ బిశ్వప్రియ గిరి అరెస్టు -
షాకింగ్: హైదరాబాద్‌లో కలుషిత నీటి కలకలం.. ఇద్దరు మృతి!
మైలార్‌దేవ్‌పల్లి: హైదరాబాద్ పాతబస్తీ మైలార్‌దేవ్‌పల్లిలో అస్వస్థతకు గురైన ఇద్దరు మరణించడం కలకలం రేపుతోంది. కలుషిత నీటి కారణంగానే వీరు మరణించారని స్థానికులు ఆరోపిస్తుండగా.. అలాంటిదేమీ లేదని జలమండలి అధికారులు చెబుతున్నారు. స్థానికులు, మృతుల కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..మైలార్‌దేవ్‌పల్లిలోని కొన్ని ప్రాంతాల్లో గత 15 రోజులుగా మంచినీటిలో డ్రైనేజీ నీరు కలిసి సరఫరా అవుతోంది. ఈ నేపథ్యంలో మొఘల్స్ కాలనీ, శాలివాహన పాఠశాల పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నవారిలో కొందరు ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. దాంతో కుటుంబసభ్యులు వారిని చికిత్స నిమిత్తం ఓ ఆస్పత్రికి తరలించారు. వీరిలో మహ్మద్ కైసర్ (28) మంగళవారం మృతి చెందగా, బుధవారం ఉదయం ఆఫ్రిన్ సుల్తానా (22) మరణించింది. కాగా అజారుద్దీన్, మీన్బేగం, ఆర్పీ సింగ్, షెహజాది బేగం, ఇత్తేషాముద్దీన్, ఇక్రాబేగం అనే మరో ఆరుగురు ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిసింది. నష్ట పరిహారానికి డిమాండ్ ఈ విషయం సోషల్ మీడియా ద్వారా బయటకు పొక్కటంతో కలకలం రేగింది. నీటిని తాగటంతోనే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక రోడ్డు విస్తరణలో భాగంగా మంచినీటి పైప్‌లను కొత్తగా అమర్చటంలో మురుగునీరు సరఫరా అయ్యిందని ఆరోపించారు. జలమండలి అధికారులపై చర్యలు తీసుకోవాలని, చనిపోయినవారి కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సవిషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ జలమండలి అధికారులు చంద్రశేఖర్, ఖాదర్, వారి బృందం ఆ ప్రాంతానికి చేరుకుని మంచినీటి నమూనాలను సేకరించారు. మంచినీళ్లు కలుషితం కాలేదని ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా దీనిపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ మధు తెలిపారు. స్థానిక కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు. -
బ్యుటిషియన్ ఆత్మహత్య
-
బ్యుటిషియన్ ఆత్మహత్య
సాక్షి, రంగారెడ్డి: జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆకతాయి వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. తన గదిలో సీలింగ్‌కు ఉరివేసుకుని తనువు చాలించింది. వివరాలు.. లక్ష్మిగూడకు చెందిన లీజ(19)ను అష్రాష్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు విషయం చెప్పగా అతడిని మందలించారు. అయినప్పటికీ అతడి తీరు మారలేదు. అష్రాఫ్ ప్రవర్తనతో విరక్తి చెందిన లీజ తీవ్ర నిర్ణయం తీసుకుంది. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని మృతిచెందింది. కాగా పోస్ట్‌మార్టం నిమిత్తం యువతి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. కాగా అష్రాఫ్ వేధింపుల వల్లనే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబసభ్యులు తెలిపారు. తను చనిపోయిన తర్వాత కూడా సుమారు ఫోన్లో సుమారు 35 మిస్డ్ కాల్స్ ఉన్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. దీనిని బట్టి అష్రాఫ్ లీజను ఎంతగా వేధిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చని, అతడికి కొంతమంది బడా నాయకులు అండదండలు ఉన్నందువల్లే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. -
పెళ్లికి వస్తారు.. గిఫ్టులు ఎక్కడున్నాయో తెలుసుకుని..
సాక్షి, మైలార్‌దేవ్‌పల్లి: బంధువుల వలే వివాహాలకు హాజరై అదును చూసి విలువైన వస్తువులు, నగుదును కాజేస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు గురువారం రిమాండ్‌కు తరలించారు. వీరిలో ఆరు సంవత్సరాల బాలిక కూడా ఉంది. మైలార్‌దేవ్‌పల్లి ఇన్స్పెక్టర్ వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాజ్ఘడ్ జిల్లాకు చెందిన ప్రశాంత్ (22), శ్రావణ్ (21)తోపాటు ఓ మహిళ, ఆరు సంవత్సరాల బాలికతో నెలరోజుల క్రితం నగరానికి వచ్చారు. కారును అద్దెకు తీసుకోని మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ల పరిధిలోని ఫంక్షన్‌హాల్స్‌లో జరిగే శుభకార్యాల్లో బంధువుల వలే హాజరయ్యేవారు. ఆయా శుభకార్యాల్లో బంధువులు ఇచ్చిన ఖరీదైన గిప్టులను ఎక్కడ పెట్టారో తెలిపి బాలికను పంపించే వారు. ఆడుకుంటూ వెళ్లి ఆ చిన్నారి వాటిని తీసుకువచ్చి ఆ మహిళకు అందించేది. దొంగలించిన సొత్తుతో నిమిషాల వ్యవధిలో శుభకార్యం నుంచి వెళ్లిపోయే వారు. మైలార్‌దేవ్‌పల్లితో పాటు రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇలా మూడు దొంగతనాలకు పాల్పడ్డారు. గతనెల మూడో వారంలో జరిగిన శుభకార్యంలో విందు నిర్వహించిన కుటుంబ సభ్యులు విలువైన వస్తువులతో పాటు నగదును ఓ బ్యాగ్‌లో వేసి స్టేజిపైనే ఉంచారు. ఈ శుభకార్యంలో పాల్గొన్న చిన్నారి చాకచక్యంగా దానిని తీసుకోని ఉడాయించింది. విందులో ఏర్పాటు చేసిన వీడియో కెమెరాలో చిన్నారి బ్యాగ్ తీసుకువెళ్లిన సంఘటన రికార్డయ్యింది. కుటుంబ సభ్యులు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు శంషాబాద్ ఎస్ఓటీ సహాయాన్ని కోరారు. ఆ రోజు ఫంక్షన్‌హాల్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో పాటు బయటకు వెళ్లిన వాహనాల పూర్తి వివరాలను సేకరించి బుధవారం నిందితులైన ఇద్దరు యువకులు, మహిళ, చిన్నారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఐ20 కారు, నాలుగు సెల్ఫోన్లు, రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను గురువారం రిమాండ్‌కు తరలించారు. -
సిగ్నల్ జంప్ చేసిన వాహనాలు.. ఒకరి మృతి
మైలార్‌దేవ్‌పల్లి: సిగ్నల్ జంప్ చేసిన రెండు వాహనాలు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. చంద్రయాణగుట్ట నుంచి వస్తున్న స్వరాజ్ మజ్డా వాహనం బంజారాహిల్స్ వెళ్తుంది. కాటేదాన్ నుంచి వస్తున్న ఆటో చంద్రయాణగుట్ట వైపు వెళ్తుంది. ఈ ఆటోలో డ్రైవర్ అర్మాజ్(19)తో పాటు మహ్మద్ గౌస్(20) ప్రయాణిస్తున్నాడు. ఈ రెండు వాహనాలు దుర్గానగర్‌కు వచ్చే సమయానికి రెడ్ సిగ్నల్ పడింది. ఇరువురు డ్రైవర్లు నిర్లక్ష్యంగా సిగ్నల్ జంప్ చేయడంతో వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌తో పాటు ప్రయాణికుడు గాయపడ్డారు. స్వరాజ్ మజ్డా డ్రైవర్ దావూద్(55) పోలీసులకు సమాచారం ఇచ్చాడు. గాయపడిన వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ డ్రైవర్ అర్మాజ్ మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారు నంబరు బైక్‌కు పెట్టుకుని కొత్తూరు: చలానాలు తప్పించుకోవడంలో భాగంగా కొందరు ఇటీవల కాలంలో ఒక వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ మరో వాహనానికి వేసుకోవడం పరిపాటిగా మారింది. తీరా చాలానాలు వచ్చే దాక విషయం తెలియడం లేదు. ఇలాంటి ఘటనే మండలంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. గూడూరు గ్రామానికి చెందిన పెండ్లిమడుగు విజయనిర్మల పేరు మీద మారుతి బ్రిజాకారు ఉంది. కాగా ఇదే నెంబర్‌ను ఓ యువకుడు బైకుకు పెట్టుకున్నాడు. ఈ నెల 17న షాద్‌నగర్ ఎక్స్‌రోడ్‌లో యువకుడు హెల్మెట్ ధరించని కారణంగా ట్రాఫిక్ పోలీసులు బైకు ఫొటోను తీసి చలానా వేయడంతో కారు యజమానురాలికి మెసేజ్ వచ్చింది. దీంతో తనది కారు అయినప్పటికీ బైకు చలానా ఎందుకు వచ్చిందని ట్రాఫిక్ ఎస్ఐ రఘుకుమార్‌ను వివరణ కోరగా తప్పుడు నంబర్ ప్లేట్లు పెట్టుకున్నట్లు తేలితే వాహనం యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు. బ్రీజా కారు నంబర్‌ను బైకు పెట్టుకున్న విషయాన్ని విచారిస్తామన్నారు. ర్యాష్ డ్రైవింగ్ ప్రమాదకరం నిర్లక్షంగా వాహనం నడిపి ఓ వ్యక్తి గాయపడేలా చేశాడో బైకర్. ట్రాఫిక్ సిగ్నల్‌ను సమీపిస్తున్న సమయంలో ర్యాష్‌గా డ్రైవ్ చేసి ప్రమాదానికి కారణమయ్యాడు. మైలార్దేవపల్లి, దుర్గానగర్ జంక్షన్ వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విటర్లో షేర్ చేశారు. నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. Rash driving when approaching a traffic signal is dangerous. At Durganagar Junction, Mailardevapalli.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/rovPPPhZhs — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) February 23, 2021 -
బీజేపీ బరాబర్ హిందువుల పార్టీ
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన రంగారెడ్డి జిల్లా మైలార్దేపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి బీజేపీలో చేరారు. సోమవారం దుర్గానగర్ చౌరస్తాలో జరిగిన బీజేపీ సభలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి సమక్షంలో ఆయన బీజేపీ గూటికి చేరారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. బీజేపీ బరాబర్ హిందువుల పార్టీ అని అన్నారు. హిందు ధర్మానికి అడ్డం వచ్చిన వాళ్ళను తొక్కేస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నియంతగా వర్ణించారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నాయకుల బాక్సులు బద్ధలు కొడతామన్నారు. తెలంగాణలో బియ్యం, డబుల్ బెడ్రూం, రోడ్లు, లైట్లు, టాయిలెట్ల పైసలన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నవే అని స్పష్టం చేశారు.తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఏం చేస్తాడో చెప్పాలని డిమాండ్ చేశారు. వరద నష్టంపై ఇంటింటికీ సర్వే చేసి నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. తాము ఛత్రపతి శివాజీ వారసులమైతే.. కేసీఆర్ లాడెన్, బాబార్, అకర్బ్ వారసుడని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన ఎంఐఎంతో దోస్తీ చేస్తోన్న కేసీఆర్‌ను బొంద పెడతామని ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. హిందువులను అవమానిస్తోన్న ఎంఐఎంకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. ‘ గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ 75స్థానాలు గెలుస్తుంది. వంద డివిజన్లలో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తాం. ఇంటి పక్కన ఉన్న దుబ్బాక ప్రజలే కేసీఆర్ మాటలు నమ్మటం లేదు. కేసీఆర్‌ను ఫాంహౌస్ కే పరిమితం చేయాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకం. హైద్రాబాద్ నగర అభివృద్ధిపై హామీలు ఇచ్చింది కేసీఆరా? ప్రధాని మోదీనా? తెలంగాణకు టీఆర్ఎస్ వద్దు బీజేపీనే ముద్దు. హైదరాబాద్ అభివృద్ధిపై టీఆర్ఎస్ జూఠా మాటలు చెప్పింది. వరద బాధితులను సీఎం పరామర్శించకపోవటం బాధ్యతారాహిత్యం. కేంద్రం నిధులను ప్రాజెక్టుల పేరుతో సీఎం కేసీఆర్ దోచుకుంటున్నారు. నియంత నుంచి తెలంగాణను కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది. మోదీ ఫోటో ముద్రించాలనే ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయటం లేదు’ అని అన్నారు. -
ఇంకా దొరకని చిరుత.. కొనసాగుతున్న ఆపరేషన్
సాక్షి, హైదరాబాద్ : రాజేంద్రనగర్ శివారు మైలార్‌దేవ్‌పల్లి-కాటేదాన్ ప్రధాన రహదారి(ఎన్‌హెచ్ 7) హైవే రోడ్డు పక్కన గురువారం గాయాలతో కనిపించిన చిరుత ఆచూకి ఇంకా చిక్కలేదు. నిన్న మధ్యాహ్నం నుంచి అధికారులు శ్రమిస్తున్నా చిరుత ఆచూకీ లభించలేదు. సమీపంలోని రైల్వే స్టేషన్ పక్కన చెట్లు ఎక్కువగా ఉండడంతో అక్కడే ఉంటుందని భావిస్తున్నారు. కల్వకుర్తి పరిసర ప్రాంతాల్లో తప్పించుకున్న చిరుత ఇదే అయి ఉంటుందని, శంషాబాద్ అటవీ ప్రాంతం మీదుగా వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు. చిరుత ఇంకా దొరక్కపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇళ్ళలో నుంచి ఎవ్వరూ బయటకు రావొద్దని అధికారులు స్థానికులను హెచ్చరించారు. డ్రోన్ కెమెరాల సాయంతో ఆ ప్రాంతమంతటా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కాగా చిరుతపులికి సంబంధించిన అడుగులను అధికారులు గుర్తించారు. కాగా అడుగుల ఆధారంగా చిరుత ఫాంహౌస్ లోనే ఉన్నట్లు తెలుస్తుంది. చిరుతను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన నైట్ విజన్ కెమెరాలతో పాటు ట్రాప్ కెమెరాల ఫీడ్ ఆధారంగా అధికారులు చిరుత ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. చిరుతను బంధించేందుకు రెండు బోన్లతో పాటు ప్రత్యేక వలల ఏర్పాటు చేశారు. దీంతో పాటు అటవీశాఖకు చెందిన షూటర్లను కూడా సిద్ధంగా ఉంచారు. ఎలాగైనా సరే చిరుతను పట్టుకొని తీరుతామని అధికారులు వెల్లడించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) (లారీ డ్రైవర్ అత్యుత్సాహం; చిరుత దాడి) (చిరుత కలకలం : రంగంలోకి కుక్కలు) -
హైదరాబాద్ నడిరోడ్డుపై పడుకున్న చిరుత ఫోటోలు
-
హైదరాబాద్ శివార్లలో చిరుత ప్రత్యక్షం
రాజేంద్రనగర్/బహదూర్‌పురా/మైలార్‌దేవ్‌పల్లి: జనావాసంలోకి వచ్చిన చిరుత కలకలం సృష్టిం చింది. నడిరోడ్డుపై సేదదీరుతూ కనిపించిన చిరుత.. జనం హడావుడితో పరుగులు తీస్తూ ఒక రిని గాయపరిచి, సమీపంలోని పొదల్లోకి దూరి పరారైంది. అటవీ శాఖ బృందాలు దాన్ని బంధిం చేందుకు రోజంతా చేసిన యత్నాలు ఫలించ లేదు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బుద్వేల్ రైల్వేస్టేషన్ అండర్ పాస్ బ్రిడ్జి ప్రధాన రహదారి మధ్యలో డివైడర్ పక్కన పడుకుని ఉన్న చిరుత పులిని గురువారం ఉదయం 7.30 సమయంలో జీహెచ్ఎంసీ సిబ్బంది, అటుగా రోడ్డున వెళ్తున్న వారు గమనించారు. ఆ రహదారిపై వాహనాల రాక పోకలు సాగు తున్నా 50 నిమిషాలపాటు చిరుత కదలకుండా ఉంది. దీంతో అది గాయపడి ఉండొచ్చని స్థానికులు భావించారు. ఈలోగా విషయం ఆనోటా ఈనోటా వ్యాపించి జనం పెద్దసంఖ్యలో గుమికూడారు. అరుస్తూ, కేకలు వేస్తూ.. కొందరు దాన్ని ఫొటోలు తీయగా, ఇంకొందరు సెల్ఫీలు తీసుకోవడానికి పోటీపడ్డారు. ఈ హడావుడికి బెదిరిన చిరుత రెండుసార్లు అక్కడే తచ్చాడింది. ఈలోగా కొందరు రాళ్లు విసరడంతో అక్కడి నుంచి ప్రధాన రహదారిపై పరుగులు తీసింది. కొన్ని వీధికుక్కలు వెంబడించడంతో, పక్కనే ఉన్న ప్రహరీ గోడపై నుంచి దూకి అన్మోల్ గార్డెన్ (ఫాంహౌస్)లోపలికెళ్లింది. ఆ సమయంలో చిరుత అక్కడే ఉన్న కాకినాడకు చెందిన లారీ డ్రైవర్ సుభానీ కాలిని గాయపరిచింది. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అతనిని ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్‌లో రోడ్డు డివైడర్‌కు ఆనుకొని పడుకున్న చిరుత (వృత్తంలో) కొనసాగుతున్న గాలింపు.. చిరుత గురించి సమాచారాన్ని అందుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు, జూపార్క్ డిప్యూటీ డైరెక్టర్ ఎంఏ హకీం, రెస్క్యూ సిబ్బంది, అటవీశాఖ అధికారులు 8.30 సమయంలో ఘటన స్థలానికి చేరుకున్నారు. చిరుతను బంధించేందుకు జిల్లా ఫారెస్టు రేంజ్ అధికారి శివయ్య, జూపార్క్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ హకీం, డాక్టర్ అసద్దుల్లాతో పాటు నాలుగు రెస్క్యూ బృందాలు గాలింపు ప్రారంభించాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దాని జాడ కనిపెట్టేందుకు డ్రోన్ కెమెరాలను వినియోగించినా ఫలితం లేకపోయింది. చిరుత ప్రవేశించిన గార్డెన్‌లోని ఖాళీ ప్రాంతం దాదాపు 40 ఎకరాల్లో పిచ్చిమొక్కలు, పొదలు, దట్టమైన చెట్లతో నిండి ఉంది. దీని పక్కనే బుద్వేల్ రైల్వే స్టేషన్‌బస్తీ, వెంకటేశ్వర కాలనీ, నేతాజీనగర్, శ్రీరామ్‌నగర్ కాలనీలు ఉండడంతో పోలీసులు అక్కడి వారిని అప్రమత్తం చేశారు. జూపార్క్ నుంచి తెచ్చిన రెండు బోన్లను అమర్చారు. నాలుగు మేకలను ఎరగా వేశారు. ఆ ప్రదేశం చూట్టూ లైట్లను ఏర్పాటు చేశారు. ఘటనా స్థలాన్ని శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ సందర్శించారు. కాగా, అటవీశాఖ, జూపార్క్ అధికారులు సమాచారం అందుకున్న వెంటనే వచ్చి ఉంటే, దాదాపు 50 నిమిషాల పాటు అండర్‌పాస్ మార్గంలో ఉన్నప్పుడే చిరుత చిక్కి ఉండేది. అనంతరం గాలింపు చేపట్టడంతో రాత్రి వరకు దాని జాడ దొరకలేదు. గార్డెన్ చుట్టుపక్కల గల కాలనీవాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో..? ఆరు నెలల క్రితం ఎన్ఐఆర్డీలోని అటవీ ప్రాంతంలో లేగదూడతో పాటు అడవిపంది కళేబరం కనిపించడంతో సిబ్బంది అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అంతకుముందు కొన్నేళ్ల క్రితం కిస్మత్పూర్, గ్రీన్‌సిటీ ప్రాంతాల్లో చిరుత కనిపించినట్టు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇప్పుడొచ్చిన చిరుత ఎక్కడి నుంచి వచ్చిందనేది తేలలేదు. చిరుత కనిపించిన ప్రదేశానికి 500 మీటర్ల దూరంలో వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటు గగన్‌పహాడ్ అటవీ ప్రాంతం, హిమాయత్‌సాగర్ చెరువు, గ్రేహౌండ్స్ ఫైరింగ్స్థలం, ఎన్ఐఆర్డీ, అపార్డ్, కొత్వాల్‌గూడలో దట్టమైన పొదలతో కూడిన ప్రాంతం ఉంది. చుట్టుపక్కల కొండలు, గుట్టలు కూడా ఉన్నాయి. చిరుతలకు ఇటువంటిది అనువైన ప్రాంతమని అటవీ అధికారులు చెబుతున్నారు. మరోపక్క కాటేదాన్ ఇందిరమ్మ సొసైటీ, జల్పల్లి, మారేడ్‌పల్లి, మహేశ్వరం మీదుగా వచ్చిందా అనేదీ ఆరా తీస్తున్నారు. సాధారణంగా చిరుత చీకటిపడ్డాకే బయటికి వస్తుందని, దాన్ని బంధించేందుకు, 24 గంటల పాటు పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. ‘డ్రోన్’ కంటికీ చిక్కని చిరుత జాడ చిరుత జాడ కనుగొనేందుకు అధికారులు ఉదయం 11 గంటల నుంచే రెండు డ్రోన్ కెమెరాలతో 40 ఎకరాల ప్రాంతాన్ని పూర్తిగా చిత్రీకరించారు. దట్టమైన తుమ్మపొదలు, ఏపుగా పెరిగిన సుబాబుల్ చెట్ల కారణంగా చిరుత కనిపించలేదు. చిరుతను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు, చుట్టుపక్కల 25 కెమెరా ట్రాప్లను ఏర్పాటు చేసినట్టు వైల్డ్‌లైఫ్ ఓఎస్డీ ఎ.శంకరన్ ‘సాక్షి’కి తెలిపారు. ఏదైనా జంతువు జాడ కనిపించగానే ఈ కెమెరా ట్రాప్‌లు ఆటోమేటిక్‌గా ఫొటో తీస్తాయి. ప్రతి మూడు గంటలకోసారి ఈ కెమెరా మెమరీ చిప్‌లను అధికారులు పరిశీలించారు. ఫామ్‌హౌస్ వద్ద చిరుత కోసం తనిఖీలు చేస్తున్న పోలీసులు కాగా, శంషాబాద్ ఎయిర్‌పోర్టు రహదారి (కర్నూలు పాత జాతీయ రహదారి) మీదుగా ఉన్న పెట్రోల్ బంక్‌లు, ప్రైవేటు వ్యాపార కేంద్రాల నిర్వాహకులు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. తెల్లవారుజాము 4.30 – 5 గంటల మధ్య గగన్‌పహాడ్ పెట్రోల్‌బంక్ వద్ద వీధికుక్కలు గుంపుగా తరుముతున్న దృశ్యాలు కనిపించాయి. అది చిరుతే అయి ఉండొచ్చని, బహుశా గగన్‌పహాడ్ అటవీ ప్రాంతం నుంచి వచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఘటన స్థలం నుంచి వెళ్లిపోతున్న చిరుత -
చిరుత కలకలం : రంగంలోకి కుక్కలు
సాక్షి, రంగారెడ్డి : మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ పరిధిలో లారీ డ్రైవర్‌పై దాడి చేసి తప్పించుకుపోయిన చిరుత పులి ఆచూకి కోసం ఫారెస్ట్ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇప్పటికే నాలుగు సార్లు డ్రోన్ కెమెరాలను ఉపయోగించి గాలించినా చిరుత ఆచూకీ లభించలేదు. ఫారెస్ట్ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి చిరత కోసం విస్తృతంగా గాలించారు. అయినప్పటికీ అది చిక్కడం లేదు. దీంతో చిరుతను పట్టుకోవడంతో కోసం కుక్కలను రంగంలోకి దించారు అధికారులు. చిరుతను గుర్తించడానికి ఫాంహౌజ్‌లోకి కుక్కలను వదిలారు. బోన్లలో మేకలను ఎరవేసి చిరుతను బందించే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 9 గంటలుగా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. చిరత ఆచూకి లభించకపోవడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ( చదవండి : లారీ డ్రైవర్ అత్యుత్సాహం; చిరుత దాడి) కాగా, చిరుత ఆచూకీ లభించేంత వరకు కాటేదాన్, బుద్వేల్ వాసులు బయటకు రావొద్దని అధికారులు సూచించారు. కుక్కల అరుపులు వినిపస్తే డయల్ 100కు ఫోన్ చేయాలన్నారు. అలసిపోయిన చిరుత స్థానికంగా ఉన్న తోటలో నక్కినట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. చిరుతను పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేయడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. -
లారీ డ్రైవర్ అత్యుత్సాహం; చిరుత దాడి
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లో గురువారం ఒక చిరుతపులి కలకలం రేపింది. వివరాలు.. రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ పరిధిలో కాటేదాన్ రైల్వే ట్రాక్ వద్ద ఉన్న ఎన్‌హెచ్ 7 హైవేపై డివైడర్‌ను ఆనుకొని ఒక చిరుతపులి కూర్చొని ఉంది. కాగా చిరుతకు గాయాలు కావడంతో కదల్లేని పరిస్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో కాకినాడకు చెందిన సుభానీ అనే లారీ డ్రైవర్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. దానికి ఏమైందోనని దగ్గరికి వెళ్లి చూసేందుకు ప్రయత్నించాడు. దీంతో చిరుతపులి లారీ డ్రైవర్‌ను గాయపరిచింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకొని గాయపడిన లారీ డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. ఇరువైపుల ఉన్న రోడ్డును తమ పరిధిలోకి తెచ్చుకున్న పోలీసులు చిరుతపులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు చిరుతను బంధించేందుకు ప్రయత్నించారు. అయితే మత్తు మందు ఇచ్చేలోపే చిరుత అక్కడి నుంచి పారిపోయింది. దీంతో దాన్ని ఎలాగైనా పట్టుకొని తీరుతామని అధికారులు పేర్కొన్నారు. -
రెండో పెళ్లాం మోజులో పడి..
హైదరాబాద్, మైలార్‌దేవ్‌పల్లి: రెండో పెళ్లాం మోజులో పడి ఓ వ్యక్తి ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్యను రోకలిబండతో మోది దారుణంగా హత్య చేసిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ హన్మంతు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా, హన్వడా గ్రామానికి చెందిన శిరీష,రమేష్ 12 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలసవచ్చిన వీరు కాటేదాన్ పారిశ్రామిక వాడలోని పద్మశాలీపురంలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. కాగా రెండేళ్ల క్రితం రమేష్‌కు మహబూబ్‌నగర్ జిల్లా బండమీదిపల్లెకు చెందిన పద్మ పరిచయం ఏర్పడంతో ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో శిరీష బంధువులు పంచాయతీ పెట్టి పద్మతో కాపురం వద్దని, ఆమెకురూ. 4 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని తీర్మానం చేశారు. మంగళవారం డబ్బుల విషయమై శిరీష, రమేశ్‌ల మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన రమేశ్ ఆమెపై రోకలిబండతో దాడి చేయడంతో శిరీష అక్కడికక్కడే మృతి చెందింది.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు రమేశ్ కోసం గాలిస్తున్నారు.