
సాక్షి, రంగారెడ్డి: జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆకతాయి వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. తన గదిలో సీలింగ్‌కు ఉరివేసుకుని తనువు చాలించింది. వివరాలు.. లక్ష్మిగూడకు చెందిన లీజ(19)ను అష్రాష్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు విషయం చెప్పగా అతడిని మందలించారు. అయినప్పటికీ అతడి తీరు మారలేదు. అష్రాఫ్ ప్రవర్తనతో విరక్తి చెందిన లీజ తీవ్ర నిర్ణయం తీసుకుంది. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని మృతిచెందింది. కాగా పోస్ట్‌మార్టం నిమిత్తం యువతి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.
కాగా అష్రాఫ్ వేధింపుల వల్లనే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబసభ్యులు తెలిపారు. తను చనిపోయిన తర్వాత కూడా సుమారు ఫోన్‌లో సుమారు 35 మిస్డ్ కాల్స్ ఉన్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. దీనిని బట్టి అష్రాఫ్ లీజను ఎంతగా వేధిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చని, అతడికి కొంతమంది బడా నాయకులు అండదండలు ఉన్నందువల్లే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment