సాక్షి, రంగారెడ్డి : మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ పరిధిలో లారీ డ్రైవర్‌పై దాడి చేసి తప్పించుకుపోయిన చిరుత పులి ఆచూకి కోసం ఫారెస్ట్ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇప్పటికే నాలుగు సార్లు డ్రోన్ కెమెరాలను ఉపయోగించి గాలించినా చిరుత ఆచూకీ లభించలేదు. ఫారెస్ట్ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి చిరత కోసం విస్తృతంగా గాలించారు. అయినప్పటికీ అది చిక్కడం లేదు. దీంతో చిరుతను పట్టుకోవడంతో కోసం కుక్కలను రంగంలోకి దించారు అధికారులు. చిరుతను గుర్తించడానికి ఫాంహౌజ్‌లోకి కుక్కలను వదిలారు. బోన్లలో మేకలను ఎరవేసి చిరుతను బందించే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 9 గంటలుగా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. చిరత ఆచూకి లభించకపోవడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ( చదవండి : లారీ డ్రైవర్ అత్యుత్సాహం; చిరుత దాడి)
కాగా, చిరుత ఆచూకీ లభించేంత వరకు కాటేదాన్, బుద్వేల్ వాసులు బయటకు రావొద్దని అధికారులు సూచించారు. కుక్కల అరుపులు వినిపస్తే డయల్ 100కు ఫోన్ చేయాలన్నారు. అలసిపోయిన చిరుత స్థానికంగా ఉన్న తోటలో నక్కినట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. చిరుతను పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేయడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment