సాక్షి, న్యూఢిల్లీ: సీటు బెల్టు ధరిస్తే గోపీనాథ్ ముండేకి ప్రాణాపాయం తప్పేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అభిప్రాయపడ్డారు. వాహన ప్రయాణం చేసేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు తమ మంత్రిత్వశాఖ త్వరలో ప్రచార ఉద్యమం చేపట్టనుందన్నారు. ముండే అంత్యక్రియల్లో పాల్గొనడం కోసం బుధవారం మహారాష్ట్రలోని బీడ్‌కు బయల్దేరే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. సీటు బెల్టు ధరించి ఉన్నట్టయితే ముండే ప్రాణాలు దక్కేవని, సీటు బెల్టు అలంకారప్రాయమేనన్న అపోహ కారణంగా తాను మంచి స్నేహితుడిని కోల్పోయానన్నా రు.
వెనుక సీట్లలో ఉండేవారు బెల్టులు కేవలం అలంకారప్రాయమేనని చాలామంది అనుకుంటారని, అయితే నిజానికి ముందు సీట్లలో ఉన్న సీటు బెల్టు ధరించడం ఎంత ముఖ్యమో వెనుక సీట్లలో ప్రయాణించేవారు కూడా ధరించడం అంతే ముఖ్యమని ఆయన చెప్పారు. ఇందుకోసం స్వయంసేవా సంస్థల సహకారంతో ప్రచారం చేసే అంశాన్ని పరిశీ లిస్తున్నట్లు ఆయన చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో చిన్నారుల మరణాలు, తల్లిదండ్రుల మరణం వల్ల అనాథలుగా మారే చిన్నారుల గురించి ప్రధానంగా ప్రచారం చేస్తామన్నారు. పిల్లలు సరైన వ్యక్తులను ఆదర్శంగా తీసుకోరని, అయితే వాహనాలను నిర్లక్ష్యంగా నడిపేవారిని ఆరాధించేలా చూడడానికి బదులు సరైన జీవన శైలిని గురించి వారికి తెలియజెప్పాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ముండేవిషాద, అకాల మర ణం వాహన చోదకులకు మేల్కొలుపు కావాలని ఆయన చెప్పారు. సీటు బెల్టు ప్రాధాన్యాన్ని గుర్తించకపోవడంవల్ల జరిగే ప్రమాదాల్లో మరణించిన వ్యక్తుల ఆప్తులు అనుభవించే బాధ ఎలాంటిదనే విషయం తనకు ముండే మరణంతో తెలిసొచ్చిం దని ఆయన చెప్పారు. సీటు బెల్టు ధరించినట్లయితే డయానా, సాహెబ్ సింగ్ వర్మ ప్రాణాలకు ముప్పు వాటిల్లేదికాదని ఆయన గుర్తుచేసుకున్నారు.
సీటు బెల్టు ధరిస్తే ముండేకి ప్రాణాపాయం తప్పేది
Published Wed, Jun 4 2014 10:18 PM | Last Updated on Sat, Sep 2 2017 8:19 AM
Advertisement
Advertisement