డెట్రాయిట్: ప్రముఖ వాహన తయారీ కంపెనీ 'ఫియట్' పెద్ద సంఖ్యలో వాహనాలను వెనక్కి పిలిచింది. ఫియట్ క్రిస్లర్కు చెందిన వాహనాల యాంటీ లాక్ బ్రేక్స్, ఎయిర్ బ్యాగ్లలో సమస్యలు తలెత్తడంతో ఫియట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వాహనాలలో జీప్, డోగ్జే, ఫియట్ ఎస్యూవీ రకానికి చెందినవి ఉన్నాయి.
యాంటీ లాక్ బ్రేక్ వ్యవస్థలో తేమ చేరే అవకాశాలు ఉన్నందున, సమస్యను పరిష్కరించడానికి వాహనాలను వెనక్కి పిలుస్తున్నట్లు ఫియట్ తెలిపింది. ఈ నిర్ణయంతో 2012 నుండి 2015 మధ్య కాలంలో తయారైన 5.5 లక్షల డోగ్జే వాహనాలలో సమస్యలను పరిష్కరించనున్నారు.