air bag trouble
-
ఎలాన్ మస్క్‌కు మరో దెబ్బ.. ఆ మోడల్ టెస్లా కారులో లోపాలు, చేసేదేమిలేక..
ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్‌కి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ టెస్లా కంపెనీ వినియోగదారుల భద్రత కోసం కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీకి చెందిన 30 వేలకు పైగా వాహనాలను రీకాల్ చేసింది. తమ వాహనాలలోని లోపాలు ఉన్న భాగాలను రిపేర్/రీప్లేస్ చేయడానికే టెస్లా ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన మోడల్ ఎక్స్ (Model X) కార్లలో ఎయిర్‌బ్యాగ్ అమరికలో లోపాలు ఉన్నాయని కంపెనీ గుర్తించింది. ఈ సమస్య వల్ల కారు ముందు కూర్చునే ప్యాసింజర్లకు ప్రమాద సమయల్లో గాయాలయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ మోడల్లోని 30 వేల కార్లను రీకాల్ చేసింది. ఈ సమస్యను ఓవర్-ది-ఎయిర్ సాఫ్ట్వేర్ అప్డేట్ పరిష్కరించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇదిలా ఉండగా ఈ నెల ప్రారంభంలో.. కఠినమైన రోడ్లపై డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా గుంతలలో ప్రయాణించేటప్పుడు మోడల్ ఎస్ (Model S), మోడల్ ఎక్స్ (Model X) కార్లలో పవర్ స్టీరింగ్ సమస్య ఏర్పడుతోందని, ఆ మోడల్లోని 40,000 వాహనాలను కంపెనీ రీకాల్ చేసిన సంగతి తెలిసిందే. మరో వైపు టెస్లా షేర్లు దాదాపు 3 శాతం క్షీణించి రేండేళ్ల కనిష్టానికి చేరుకున్నాయి. ఇప్పటికే ట్విటర్లోని పరిణామాలు మస్క్‌కి తలనొప్పిగా ఉంటే తాజాగా టెస్లా షేర్లు పతనం కావడం దెబ్బ మీద దెబ్బ అనే చెప్పాలి. చదవండి: భారత్‌లో వన్ అండ్ ఓన్లీ గుర్తింపు.. మారుతీ సుజుకీ సొంతం! -
8.9 లక్షల ఫియట్ వాహనాలు రీకాల్
డెట్రాయిట్: ప్రముఖ వాహన తయారీ కంపెనీ 'ఫియట్' పెద్ద సంఖ్యలో వాహనాలను వెనక్కి పిలిచింది. ఫియట్ క్రిస్లర్కు చెందిన వాహనాల యాంటీ లాక్ బ్రేక్స్, ఎయిర్ బ్యాగ్‌లలో సమస్యలు తలెత్తడంతో ఫియట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వాహనాలలో జీప్, డోగ్జే, ఫియట్ ఎస్యూవీ రకానికి చెందినవి ఉన్నాయి. యాంటీ లాక్ బ్రేక్ వ్యవస్థలో తేమ చేరే అవకాశాలు ఉన్నందున, సమస్యను పరిష్కరించడానికి వాహనాలను వెనక్కి పిలుస్తున్నట్లు ఫియట్ తెలిపింది. ఈ నిర్ణయంతో 2012 నుండి 2015 మధ్య కాలంలో తయారైన 5.5 లక్షల డోగ్జే వాహనాలలో సమస్యలను పరిష్కరించనున్నారు.