ముంబై: ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తన 86వ ఏట కన్నుమూశారు. ఆయన మృతిపై పారిశ్రామికవేత్తలతో పాటు పలువురు రాజకీయ నేతలు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు నివాళులు అర్పించిన వారిలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఉన్నారు.
భారతీయ సంతతికి చెందిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వ్యాపార దిగ్గజం రతన్ టాటాతో తన చివరి సమావేశాన్ని గుర్తు చేసుకున్నారు. గూగుల్‌లో రతన్ టాటాతో తమ చివరి సమావేశంలో తాము అనేక అంశాలపై చర్చించామని సుందర్ పిచాయ్ తెలిపారు. ఆయన విజన్ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఆయన తన దాతృత్వ విలువలను మనకు అందించారు. మన దేశంలో ఆధునిక వ్యాపార నాయకత్వానికి మార్గదర్శకత్వం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పిచాయ్ ఎక్స్ వేదికగా ఒక పోస్టులో పేర్కొన్నారు.
భారతదేశాన్ని అభివృద్ధిపథంలో నడపడంలో టాటా ఎంతో శ్రద్ధ వహించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. రతన్ జీ.. మీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని వేడుకుంటున్నాను అంటూ సుందర్ పిచాయ్ ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. టాటా గ్రూప్‌నకు రతన్ టాటా 20 ఏళ్లు ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన ముంబైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మీడియాకు ఈ విషయాన్ని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment