last
-
రతన్ టాటాతో చివరి మీటింగ్ గుర్తు చేసుకున్న గూగుల్ సీఈఓ
ముంబై: ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తన 86వ ఏట కన్నుమూశారు. ఆయన మృతిపై పారిశ్రామికవేత్తలతో పాటు పలువురు రాజకీయ నేతలు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు నివాళులు అర్పించిన వారిలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఉన్నారు.భారతీయ సంతతికి చెందిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వ్యాపార దిగ్గజం రతన్ టాటాతో తన చివరి సమావేశాన్ని గుర్తు చేసుకున్నారు. గూగుల్‌లో రతన్ టాటాతో తమ చివరి సమావేశంలో తాము అనేక అంశాలపై చర్చించామని సుందర్ పిచాయ్ తెలిపారు. ఆయన విజన్ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఆయన తన దాతృత్వ విలువలను మనకు అందించారు. మన దేశంలో ఆధునిక వ్యాపార నాయకత్వానికి మార్గదర్శకత్వం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పిచాయ్ ఎక్స్ వేదికగా ఒక పోస్టులో పేర్కొన్నారు.భారతదేశాన్ని అభివృద్ధిపథంలో నడపడంలో టాటా ఎంతో శ్రద్ధ వహించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. రతన్ జీ.. మీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని వేడుకుంటున్నాను అంటూ సుందర్ పిచాయ్ ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. టాటా గ్రూప్‌నకు రతన్ టాటా 20 ఏళ్లు ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన ముంబైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మీడియాకు ఈ విషయాన్ని తెలిపారు.ఇది కూడా చదవండి: రతన్ టాటా..రతనాల మాటలు -
తండ్రి కన్నుమూత, కన్నీరుమున్నీరైన గాయకుడు (ఫోటోలు)
-
టైటానిక్ సబ్‌మెరైన్ విషాదం: యూఎస్ కోస్ట్‌గార్డ్ కీలక ప్రకటన
టైటానిక్ సబ్‌మెరైన్‌కు విషాదానికి సంబంధించిన అన్వేషణలోయూఎస్ కోస్ట్‌గార్డ్ కీలక విషయాన్ని ప్రకటించింది. ఈ ప్రమాదంలో చివరి అవశేషాన్ని స్వాధీనం చేసుకున్నామని కోస్ట్ గార్డ్ వెల్లడించింది. టైటాన్ సబ్మెర్సిబుల్ నుండి మానవ అవశేషాలు భావిస్తున్నవాటితోపాటు, కొన్ని శిథిల భాగాలను సేకరించినట్టు తెలిపింది. అలాగే వీటిని వైద్య నిపుణుల విశ్లేషణ కోసం పంపింది. గత వారం వాటిని స్వాధీనం చేసుకుని కోస్ట్ గార్డ్ అధికారులు యుఎస్ ఓడరేవుకు తరలించినట్లు బీబీసీ రిపోర్ట్ చేసింది. అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ శిధిలాల అన్వేషణకు వెళ్లి మార్గమధ్యలో సబ్‌మెరైన్ పేలిపోయిన ఘటన విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఇప్పటికే కొన్నింటిని సేకరించగా మిగిలిన శిధిలాల చివరి భాగాలను యూఎస్ కోస్ట్ గార్డ్ తాజాగా గుర్తించింది. ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఓషన్ ఆపరేటర్ అయిన Ocean Gate అప్పటినుండి వ్యాపారాన్ని నిలిపివేసింది. ఈ ఏడాది జూన్ 18న ఉత్తర అట్లాంటిక్ జలాల్లోకి ప్రవేశించినప్పుడు జరిగిన పేలుడులో మరణించిన వారిలో సబ్మెర్సిబుల్ పైలట్, కంపెనీ సీఈవో స్టాక్టన్ రష్ కూడా ఉన్నారు. మిగిలిన నలుగురు ప్రయాణికుల్లో బ్రిటిష్-పాకిస్తానీ వ్యాపారవేత్త షాజాదా దావూద్, అతని కుమారుడు సులేమాన్, బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, పాల్-హెన్రీ నార్గోలెట్, మాజీ ఫ్రెంచ్ నౌకాదళ డైవర్ ఉన్నారు.ఈ విషాదంపై ప్రపంచ వ్యాప్త విచారణ కొనసాగుతోంది. కాగా 1912లో టైటినిక్ షిప్‌ను మొదటిసారిగా ప్రవేశపెట్టినపుడు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రయాణనౌకగా పేరు గాంచింది. అయితే ఇంగ్లాండ్‌లోని సౌత్‌హాంప్టన్ నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు బయలుదేరిన తొలి ప్రయాణంలోనే 1912 ఏప్రిల్ 14న ప్రమాదవశాత్తూ ఒక మంచు కొండను ఢీకొని సముద్రంలో మునిగిపోయిన ఘటనలో 1517 మంది మృత్యువాత పడటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాదంపై 1997లో ప్రఖ్యాత హాలీవుడ్ దర్శక నిర్మాత జేమ్స్ కామెరూన్ తీసిన‘ టైటానిక్’ సినిమా భారీ హిట్ అందుకుంది. -
దశాబ్దిలో రెండింతలు..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాహనాల సంఖ్య గత పదేళ్ల కాలంగా గణనీయంగా పెరిగింది. 2013–14 ఆర్థిక సంవత్సరంలో 70,73,109 వాహనాలు ఉండగా.. 2022–23 నాటికి 1,54,77,512కు చేరాయి. సగటున ఏడాదికి 9% చొప్పున పెరుగుదల నమోదు అయినట్లు రవాణా శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఒక్క 2022–23 ఆర్థిక సంవత్సరంలోనే 10 లక్షల వాహనాలు కొత్తగా రోడ్లపైకి వచ్చాయి. ఇక రాష్ట్రంలోని మొత్తం వాహనాల్లో దాదాపు సగం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉండటం విశేషం. గణనీయంగా పెరుగుతున్న ఈవీలు తెలంగాణలోని మొత్తం 1.54 కోట్ల వాహనాల్లో ద్విచక్ర వాహనాలే 1.13 కోట్ల వరకు ఉన్నాయి. మోటారు కార్లు 20 లక్షలు, ఆటోలు 4.5 లక్షలు, స్కూలు బస్సులు 28,962, గూడ్స్ ఆటోలు 6.09 లక్షలు, ఈ–కార్ట్స్ 235, మోటారు క్యాబ్స్ 20,335, మ్యాక్సీ క్యాబ్స్ 31,060, కాంట్రాక్ట్ క్యారేజెస్ 9,244, ట్రక్కులు/ట్రాక్టర్లు 7 లక్షల వరకు ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో ఉన్న 70 లక్షల వాహనాల్లో 50 లక్షలు ద్విచక్ర వాహనాలు కాగా కార్ల వంటి తేలికపాటి వాహనాలు 13 లక్షలు ఉన్నాయి. 2013–14 నాటికి రాష్ట్రంలో రిజిస్టర్ అయి ఉన్న 70.73 లక్షల వాహనాల్లో 8.22 లక్షలు రవాణా వాహనాలు ఉండగా... 63.68 లక్షలు సరుకు రవాణా వాహనాల కేటగిరీకి చెందినవి. అప్పట్లో ద్విచక్ర వాహనాలు 52.84 లక్షలు, కార్లు 7,96,232, జీపులు 14,989, ట్యాక్సీలు 74,097, బస్సులు 40,807, సరుకు రవాణా చేసే తేలికపాటి వాహనాలు 1,85,688, ట్రక్కులు/ట్రాక్టర్లు 1,25,240 ఉండేవి. సెకండ్ హ్యాండ్ మార్కెట్‌ను సైతం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు సహా కొన్ని ఉత్తరాది నగరాల్లోని బడాబా బులు, సంస్థలు ఆర్థిక సంవత్సరం ముగిసేటప్పుడు పెద్ద సంఖ్యలో కొత్త వాహనాలను ఖరీదు చేస్తుంటారు. ఆదాయపన్ను రిటర్న్స్‌లో లెక్కలు చూపించడానికే ఇలా చేస్తుంటారు. ఆయా సమ యాల్లో అక్కడ నుంచి భారీ సంఖ్యలో సెకండ్ హ్యాండ్ వాహనాలు దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్తుంటాయి. రాష్ట్రం ఏర్పడే నాటికి హైదరాబాద్‌లో వాహనాల సంఖ్య 25 లక్షలు ఉండగా... గత దశాబ్ద కాలంగా ఏటా ఈ వాహనాలు పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని రోడ్లపై 46,937 విద్యుత్ (ఎలక్ట్రిక్) వాహనాలు రాకపోకలు సాగిస్తున్నట్లు రవాణశాఖ గణాంకాలు చెప్తున్నాయి. ఈ వాహనాలకు తెలంగాణ ప్రభుత్వం రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ చార్జీలు మినహాయింపు ఇస్తోంది. దీంతో ఏటా ఈ వాహనాల సంఖ్య పెరుగుతోందని, రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ గణాంకాలు కేవలం తెలంగాణలో రిజిస్టర్ అయిన వాహనాలకు సంబంధించినవి మాత్రమే కాగా.. ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రిజిస్టర్ అయినవి కూడా రాష్ట్రంలో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. వీటిలో నగరానికి వచ్చేవీ పెద్ద సంఖ్యలోనే ఉంటున్నాయి. ఆయా రాష్ట్రాల నుంచి ఇక్కడకు తీసుకువచ్చే వాహనాలను రిజిస్టర్ చేయించి నంబర్ మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో ఇప్పటికీ వేల సంఖ్యలో వాహ నాలు అక్కడి రిజిస్ట్రేషన్ నంబర్లతోనే తిరిగేస్తున్నా యి. ఈ కారణంగా వీటి సంఖ్య అధికారిక గణాంకాల్లోకి చేరట్లేదు. -
కైకాల సత్యనారాయణ చివరి వీడియో ఇదే..
-
దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ చివరి వీడియో ఇదే..
సాక్షి, హైదరాబాద్: కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు కైకాల సత్యనారాయణ.. శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్న ఆయన.. జూలై 25న 87వ పుట్టిన రోజు జరుపుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఆయన నివాసానికి కేక్ తీసుకెళ్లి బైడ్పైనే కట్ చేయించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బర్త్‌డేకు సంబంధించిన ఫొటోలు చిరంజీవి షేర్ చేస్తూ కైకాలకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచానికి చూపిన కైకాల చివరి వీడియో ఇదే. కైకాల సత్యనారాయణ 1935, జులై 25న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు (మ) కౌతారంలో జన్మించారు. 770కిపైగా సినిమాల్లో నటించారు. ఆయన తండ్రి కైకాల లక్ష్మీనారాయణ. కైకాల ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడలలో పూర్తిచేసి, గుడివాడ కళాశాల నుండి పట్టభద్రుడయ్యారు. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో వివాహమైంది. ఆయనకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. 1996లో ఆయన రాజకీయాల్లోకి వచ్చి, మచిలీపట్నం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 11వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. చదవండి: నవరస నటనా సార్వభౌముడి సినీ, రాజకీయ ప్రస్థానం ఇదే.. -
అమ్మ చేతి ఆఖరి వంట.. కంటతడి పెట్టిస్తున్న పోస్ట్
అమ్మ ప్రేమకు కొలమానం ఉంటుందా?.. అంతులేని మమకారాన్ని ప్రదర్శించిన ఓ అమ్మ వీడియో కోట్ల మందితో కంటతడి పెట్టిస్తోంది. ఎందుకంటే ఆమె ఆఖరి గడియలు ఉంది కాబట్టి. అయినా ఆ ఇబ్బందికర క్షణాల్లోనూ ఆమె కొడుకు కోసమే ఆలోచించింది. ప్రేమగా అతనికి వండిపెట్టింది. చైనాలో ఓ వీడియో.. సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఇప్పటిదాకా కోట్ల మంది ఆ వీడియోను తిలకించడంతో రికార్డు సృష్టించింది. అంతేకాదు.. ఈ వారం మోస్ట్ సెర్చ్డ్ న్యూస్‌గా అక్కడి నిలిచింది ఆ వీడియో. క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఓ మహిళ.. ఆఖరి క్షణాల్లో తన కొడుకు కోసం ప్రేమగా వండిపెడితే.. వ్లోగర్ అయిన ఆ కుర్రాడు కన్నీళ్లతో తీసిన వీడియో అది. దలైయాన్కు చెందిన ఓ 20 ఏళ్ల టీనేజర్.. డెంగ్ అనే మారుపేరుతో గత వారం చైనా షార్ట్‌వీడియో యాప్ డౌయిన్‌లో వీడియోను పోస్ట్ చేశాడు. చైనా జానపద సంగీతం ఫేర్వెల్ సంగీతాన్ని ఆ వీడియోకు జత చేశాడు. ‘‘అమ్మా.. ఇక ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో. ఇకపై ఏదీ నన్ను ఓడించదు’’ కన్నీళ్లతో ఆమెకు నివాళి ఇస్తూ క్యాప్షన్ ఉంచాడు. ‘‘మా అమ్మకి మనోధైర్యం ఎక్కువ. స్వతంత్రంగా బతకాలనుకునే మనిషి. ఈ ఫిబ్రవరిలో ఆమె(49) క్యాన్సర్ బారిన పడింది. కానీ, ఇంట్లోవాళ్లకు ఆ విషయం చెప్పలేదు. ఎందుకంటే.. ఆ విషయం తెలిస్తే మేం ఏమైపోతామో అని ఆమె భయం. ఆమెకి ఉన్న జబ్బు మాకు తెలిసేసరికి.. పరిస్థితి చేజారిపోయింది. అయినా అమ్మను బతికించుకునేందుకు ప్రయత్నించాం. మూడో సెషన్ కీమోథెరపీ పూర్తైన కొన్నాళ్లకు.. ఆమె ఒకరోజు హఠాత్తుగా ‘ఏం తినాలని ఉంది’ అని నన్ను అడిగింది. మార్కెట్‌కు తాను కూడా వచ్చింది. కావాల్సిన సరుకులన్నీ ఆమె ఎంచుకుంది. స్వయంగా వంట గదిలో దగ్గరుండి వండింది. మా అమ్మను అలా చూసేసరికి నా కన్నీళ్లు ఆగలేదు. ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందిపడుతూనే ఆమె వంట చేసింది. కనీసం నన్ను దగ్గరికి కూడా రావొద్దని వారించింది. దగ్గరుండి ఆమె వడ్డించింది. ఆమె వండిన వంట.. ఎప్పటిలాగే రుచికరంగా ఉంది. దురదృష్టవశాత్తూ అదే మా అమ్మ చేతి ఆఖరి వంట అయ్యింది. ఆ మరుసటిరోజే ఆమె నిద్రలో కన్నుమూశారు. ఆమె జ్ఞాపకాలను, చివరి క్షణాలను ఇక నేను జీవితాంతం మోయక తప్పదు అంటూ భావోద్వేగంగా ఆ వీడియోను ఉంచాడు. కేవలం ఆ షార్ట్ వీడియో డౌయిన్‌లో రెండు లక్షల దాకా లైకులు తెచ్చుకుంది. చావు.. ఎల్లప్పుడూ బతికి ఉండే ప్రేమకు ముగింపు కాదు అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేయగా.. తన అమ్మ చనిపోయిన తర్వాత ఆమె వండిన వంటకాలు ఫ్రిజ్‌లో ఉండిపోయాయని, వాటిని చాలాకాలం ఆమెను తల్చుకుంటూ తిన్నానని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఇక ఏ లోకంలో ఉన్నా ఆ అమ్మ నిన్ను చూస్తూనే ఉంటుందని ఓ మహిళ కామెంట్ చేసింది. -
మరుగుదొడ్ల నిర్మాణంలో అంబాజీపేట అథమం
అధికారుల తీరుపై మండిపడ్డ కలెక్టర్ నిర్లక్ష్యంపై శాఖాపరమైన చర్యలు అంబాజీపేట (పి.గన్నవరం) : వ్యక్తిగత మరుగుదొడ్ల (ఐఎస్ఎల్) నిర్మాణంలో అంబాజీపేట మండలం జిల్లాలోనే అథమ స్థానంలో ఉందని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయాన్ని, గంగలకుర్రు అగ్రహారం అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. మరుగుదొడ్ల నిర్మాణంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. మండలంలోని 11 గ్రామాల్లో నూరు శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని ఎంపీడీఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ హామీ ఇచ్చారన్నారు. అయితే ఇప్పటివరకూ ఏ ఒక్క గ్రామంలో కూడా నూరు శాతం నిర్మాణాలు పూర్తి కాలేదని చెప్పారు. ప్రజాప్రతినిధులకంటే అధికారుల నిర్లక్ష్యమే అధికంగా కనబడుతోందన్నారు. జిల్లాలో బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలు 530కి గానూ ఇప్పటికే 270 గ్రామాల్లో నూరు శాతం ఐఎస్ఎల్ నిర్మించామని వివరించారు. ఈ 270 గ్రామాల్లో అంబాజీపేట మండలం నుంచి ఒక్క గ్రామం కూడా లేకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో 830 అంగన్వాడీ కేంద్రాలకు 100 భవనాల నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. మార్చి నెలాఖరుకు లక్ష్యం చేరుకుంటామన్నారు. ఈ భవన నిర్మాణాలకు ఉపాధి హామీ పథకం నుంచి నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. ఐఎస్ఎల్ నిర్మించుకున్నవారికి తక్షణమే బిల్లులు మంజూరు చేస్తామన్నారు. క్షేత్ర స్థాయి సిబ్బంది బిల్లులు ఆన్లైన్ చేయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అందువల్లే బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోందని వివరించారు. నిర్లక్ష్యంగా పనిచేసే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఐఎస్ఎల్ నిర్మాణాల్లో బాధ్యతారహితంగా వ్యవహరించిన ఎంపీడీఓపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎంపీడీఓ కార్యాలయంలో అందుబాటులో లేరని, కేవలం సెలవు చీటీ టేబుల్‌పై ఉంచి నిర్లక్ష్యంగా వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు ఉపాధి హామీ పథకం సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ఆర్డబ్ల్యూఎస్ జేఈలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ దాసరి వీరవెంకట సత్యనారాయణ, సర్పంచ్ మట్టపర్తి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
పుస్తకం...వెన్నంటి వచ్చే నేస్తం
కష్టాల్లో ఓ దారుస్తుంది ఆత్మీయతను పంచుతుంది నేటితో ముగియనున్న పుస్తక సంబరాలు రాజమహేంద్రవరం కల్చరల్ : పుస్తకం... ప్రతి ఒక్కరికి వెన్నంటి వచ్చే నేస్తం. ఓ మంచి పుస్తకం కష్ట సమయంలో ఓదారుస్తుంది. మనసుకు సాంత్వన చేకూరుస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఆత్మీయతను పంచుతుంది. ఆనంద సమయంలో మరింత ఆహ్లాదం కలిగిస్తుంది. అలాంటి అద్భుత పుస్తకాల సమాహారంగా రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్‌కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బుక్ ఎగ్జిబిషన్ పుస్తక ప్రియుల మదిని దోచుకుంటోంది. నవ్యాంధ్ర పుస్తక సంబరాలు ఆదివారంతో ముగియనున్నాయి. మొదట్లో అంతంత మాత్రంగానే సందర్శకులు ఈ ప్రదర్శనను తిలకించినా, రెండు రోజులుగా వీరి సంఖ్య పెరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఆదివారం మరింతగా పుస్తకాల అమ్మకాలు పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక ప్రాచీన సాహిత్యాలు... మైదానంలోని 20, 21, 22, 23, 24 నంబరు స్టాళ్లలో ఉన్న ఎమెస్కోలో వైవిధ్యభరితమైన పుస్తకాలు ఉన్నాయి. పి.వి.నరసింహారావు ‘లోపలి మనిషి’, టంగుటూరి ప్రకాశం ‘స్వీయచరిత్ర,’, నారా చంద్రబాబు నాయుడి ‘మనసులో మాట’ ఇక్కడ పది శాతం డిసౌంట్లో లభిస్తున్నాయి. కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతీమహాస్వామి ఉపదేశాలు ‘అమృతవాణి’ పేరిట లభిస్తున్నాయి. దాశరథి, గాలిబ్ గీతాలు, బి.వి.ఎస్.రామారావు గోదావరి కథలు, అడవి బాపిరాజు నవలలు, వడ్డెర చండీదాస్ హిమజ్వాల, శ్రీశ్రీ అనంతం కథలు, అమరావతి కథలు, బాలసాహిత్యం..ఇలా ఎన్నో ఎన్నో పుస్తకాలు, ప్రాచీన, ఆధునిక సాహిత్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. విప్లవ శంఖం ఇదిగో.. నవ్యాంధ్ర సంబరాలు, స్టాల్ నంబరు 70, ‘విరసం’ స్టాలులో విప్లవ, వామ పక్షభావాలకు చెందిన సాహితీ గ్రంథాలు లభిస్తున్నాయి. దిగంబర కవులు, రావిశాస్త్రి, కొడవటిగంటి కుటుంబరావుల రచనలు ఇక్కడ ఉన్నాయి. కథక చక్రవర్తి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి నిర్వహించిన ప్రబుద్ధాంధ్ర పత్రికలను గ్రంథరూపంలో ఇక్కడ చూడవచ్చు. డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ ఈ సంకలనానికి సంపాదకత్వం వహించారు. నేటికీ పుస్తకాలపై ఆసక్తి పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో అన్ని రంగాలు అంతో, ఇంతో దెబ్బతిన్నాయి. పుస్తకాల పట్ల పాఠకుల్లో నేటికీ ఆసక్తి ఉంది. ఈ స్టాళ్ళను సందర్శించడం వల్లఏ పుస్తకం ఎక్కడ లభిస్తుంది అన్న విషయంపై అవగాహన కలుగుతుంది. - జి.జనార్దన్, ఎమెస్కో నిర్వాహకుడు ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేవు నవ్యాంధ్ర పుస్తక సంబరాలలో అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. కారణాలు అందరికీ తెలిసినవే. తరుచుగా ఇటువంటి ప్రదర్శనలను నిర్వహించాల్సిన అవసరం ఎంతయినా ఉంది. - అరసవిల్లి కృష్ణ, విరసం కార్యవర్గ సభ్యుడు -
నేటితో ముగియనున్న అంత్య పర్వం
పుష్కరుడి వీడ్కోలు సంబరానికి సీఎం ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం పదకొండోరోజు పుష్కరఘాట్‌కు పోటెత్తిన భక్తులు సాక్షి, రాజమహేంద్రవరం : గోదావరి నదీతీరంలో 11 రోజులపాటు ఉత్సవంలా సాగిన అంత్యపుష్కరాలకు గురువారంతో తెరపడనుంది. గురువారం సాయంత్రం రాజమహేంద్రవరంలోని పుష్కరాల రేవులో హారతి కార్యక్రమం అనంతరం అంత్యపుష్కరాలు ముగియనున్నాయి. ముగింపు రోజు పుష్కరుడికి వీడ్కోలు పలికేందుకు సీఎం చంద్రబాబు వస్తుండడంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఈ పుష్కరాలు ముగుస్తున్న నేపథ్యంలో పదో రోజు రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్‌కు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఇక్కడ రాత్రి ఏడు గంటల వరకు 51వేల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగింది. ఘాట్ వద్ద కూడలిలో వాహనాల రద్దీ పెరిగింది. జిల్లా మొత్తంమీద 85,652 మంది భక్తులు వచ్చారని అధికారులు తెలిపారు. అంతర్వేది, అయినవిల్లి, జొన్నాడ, కోటిపల్లి తదతర ఘాట్లకు భక్తులు వెళ్లారు. ఉభయ గోదావరితోపాటు ఉత్తరాంధ్ర జిల్లాల యాత్రికులు తరలివచ్చారు. చివరిరోజు భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసారి ఒడిసా భక్తుల తాకిడి పెద్దగా లేదు. పూరి జగన్నాథ రథయాత్ర అంత్యపుష్కరాలకు ముందే జరగడంతో ఒడిసా నుంచి భక్తులు పెద్దగా రాలేదని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. జగన్నాథ రథయాత్ర ముగియడంతో అంత్యపుష్కరాలు కూడా ముగిసినట్లుగా వారు భావిస్తారని చెబుతున్నారు. అర్బన్ ఎస్పీ రాజకుమారి ఘాట్ల వద్ద భద్రను పరిశీలించి సిబ్బందికి సూచన లిచ్చారు. కంట్రోల్ రూమ్ నుంచి నోడల్ అధికారి ఘాట్లలో ఏర్పాట్లును పర్యవేక్షించారు. ఘనంగా ముగింపు వేడుకలు... అంత్యపుష్కరాలను ఘనంగా ముగించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. సరస్వతీ ఘాట్ నుంచి పుష్కరఘాట్ వరకు చిన్నారులతో ప్రదర్శన నిర్వహించనున్నారు. సాయంత్రం పుష్కరఘాట్ వద్ద ఆధ్యాత్మిక, సాంసృ్కతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. గోదావరి హారతి కార్యక్రమం అనంతరం 108 మంది ముల్తైదువులు నదిలో దీపాలను వదిలి పుష్కరుడికి ఘనంగా వీడ్కోలు పలకనున్నారు. దేవాదాయ శాఖ తరఫున జిల్లాలోని అనవ్నవరం, అయినవిల్లి పుణ్య క్షేత్రాల ప్రసాదాలను భక్తులకు ఉచితంగా పంచిపెట్టనున్నట్లు ఆ శాఖ అసిస్టెంట్ కమిషనర్ డీవీఎల్ రమేష్‌బాబు తెలిపారు. ఇందుకోసం పుష్కరఘాట్ బయట ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యంత్రాంగం అప్రమత్తం ముగింపు వేడుకలకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతోపాటు సీఎం చంద్రబాబు వస్తుండడంతో పుష్కరఘాట్ వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు రాకపోకలకు ప్రత్యేక మార్గాలను నిర్ణయించారు. గురువారం సాయంత్రం హారతి కార్యక్రమానికి కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, అంత్యపుష్కరాల నోడల్ అధికారి వి.విజయకుమార్, సబ్‌కలెక్టర్ విజయ్‌కృష్ణన్ హాజరై ఏర్పాట్లను పరిశీలించారు. హారతి కార్యక్రమానికి మేయర్ పంతంరజనీ శేషసాయి, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విచ్చేశారు. -
తుదిదశకు చేరుకున్న సీబీఐ విచారణ
జమ్మికుంట సీసీఐ కొనుగోళ్లలో వెలుగు చూసిన అవినీతి అక్రమార్కుల అరెస్ట్‌కు రంగం సిద్ధం జమ్మికుంట : జమ్మికుంట మార్కెట్లో సీసీఐ పత్తి కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ తుది దశకు చేరుకుంది. ఈ వ్యవహారంలో పలుమార్లు విచారణ చేసిన అధికారులు తుదినివేదికను తయారుచేశారు. సీసీఐ అధికారులు వ్యాపారులతో కలిసి అక్రమదందాను కొనసాగించినట్లు సీబీఐ విచారణలో గుర్తించినట్లు తెలిసింది. ఏడాదిన్నర పాటు జరిగి విచారణ తుది దశకు చేరినట్లు సమాచారం. అధికారులు త్వరలో అక్రమార్కులను అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. క్షేత్రస్థాయిలో విచారణ.. 2015 పిబ్రవరిలో హైకోర్టు ఆదేశాలతో సీసీఐ కొనుగోళ్లపై విచారణకు ప్రారంభించిన సీబీఐ అధికారుల పలుమార్లు విచారణ జరిపారు. ఏడేళ్ల పాటు జరిగిన కొనుగోళ్లలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పత్తిని విక్రయించిన రైతుల వివరాలు సేకరించారు. రైతులు సాగుచేసిన భూములు, సీసీఐకి విక్రయించిన పత్తి వివరాలను అడిగితెలుసుకున్నారు. బ్యాంక్ ఖాతా బుక్కులు, సీసీఐ చెక్కులు, పట్టదారు పాసు పుస్తకాలు, పహణీ పత్రాలు, సీసీఐ రిజిస్టర్ సంతకాలు, తక్పట్టిలను పరిశీలించారు. గ్రామాల్లో కొందరు వ్యవసాయం లేకున్న సీసీఐకి పత్తిని విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. రైతుల పేరుతో కొందరు ఆడ్తిదారులు బ్యాంకుల్లో ఖాతాలు తెరచి డబ్బులు డ్రా చేసుకున్నట్లు విచారణలో బయటపడింది. సీసీఐ కొనుగోళ్లలో బీనామి రైతుల దందా జరిగినట్లు సీసీఐ చెల్లింపుల వివరాలతో అధికారులు నివేదిక తయారచేశారు. భయందోళనలో అక్రమార్కులు.. పత్తి కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడిన వారిని సీబీఐ అరెస్ట్‌లు చేస్తుందనే ప్రచారం జరుగుతుండటంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఏడేళ్ల నుంచి పని చేసిన మార్కెటింగ్ శాఖ అధికారులు ఎవరేవరికి సంబంధాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఏడేళ్లలో మద్దతు ధరల్లో రైతులను దగా చేయడంలో ఎంత వరకు చేతుల మారాయి. ఏవరేవరికి ఎంత వాట ముట్టింది అనే విషయాలపై సీబీఐ వివరాలను సేకరించింది. అక్రమాలకు పాల్పడిన వారి నుంచి డబ్బులు ఎలా వసూలు చేస్తారు విషయం ఆసక్తిగా మారింది. -
తహసీల్దార్ నరేందర్‌కు కన్నీటì వీడ్కోలు
ముకరంపుర :గుండెపోటుతో మృతిచెందిన మెట్పల్లి తహసీల్దార్ వి.నరేందర్‌కు శనివారం కన్నీటి వీడ్కోలు పలికారు. కరీంనగర్‌లోని ఖార్ఖానాగడ్డలోని ఆయన నివాసానికి వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు చేరుకుని మృతదేహం వద్ద నివాళులర్పించారు. వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఖార్ఖానాగడ్డలోని శ్మశాన వాటికలో మధ్యాహ్నం అంత్యక్రియలు ముగిశాయి. కలెక్టర్ నీతూప్రసాద్, జేసీ శ్రీదేవసేన, ఏజేసీ నాగేంద్ర, డీఆర్వో వీరబ్రహ్మయ్య, జగిత్యాల సబ్‌కలెక్టర్ శశాంక, కరీంనగర్ ఆర్డీవో చంద్రశేఖర్, సిరిసిల్ల ఆర్డీవో శ్యాంసుందర్, వరంగల్ ఆర్డీవో వెంకటమాధవ్ తదితరులు నివాళులర్పించారు. తహసీల్దార్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లచ్చిరెడ్డి, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాÄæూస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శివశంకర్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్, కార్యదర్శి సుగుణాకర్‌రెడ్డి, పెన్షనర్స్ సంఘం నాయకులు నర్సయ్య, కేశవరెడ్డి తదితరులు నివాళులర్పించారు.