సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాహనాల సంఖ్య గత పదేళ్ల కాలంగా గణనీయంగా పెరిగింది. 2013–14 ఆర్థిక సంవత్సరంలో 70,73,109 వాహనాలు ఉండగా.. 2022–23 నాటికి 1,54,77,512కు చేరాయి. సగటున ఏడాదికి 9% చొప్పున పెరుగుదల నమోదు అయినట్లు రవాణా శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఒక్క 2022–23 ఆర్థిక సంవత్సరంలోనే 10 లక్షల వాహనాలు కొత్తగా రోడ్లపైకి వచ్చాయి. ఇక రాష్ట్రంలోని మొత్తం వాహనాల్లో దాదాపు సగం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉండటం విశేషం.
గణనీయంగా పెరుగుతున్న ఈవీలు
- తెలంగాణలోని మొత్తం 1.54 కోట్ల వాహనాల్లో ద్విచక్ర వాహనాలే 1.13 కోట్ల వరకు ఉన్నాయి. మోటారు కార్లు 20 లక్షలు, ఆటోలు 4.5 లక్షలు, స్కూలు బస్సులు 28,962, గూడ్స్ ఆటోలు 6.09 లక్షలు, ఈ–కార్ట్స్ 235, మోటారు క్యాబ్స్ 20,335, మ్యాక్సీ క్యాబ్స్ 31,060, కాంట్రాక్ట్ క్యారేజెస్ 9,244, ట్రక్కులు/ట్రాక్టర్లు 7 లక్షల వరకు ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో ఉన్న 70 లక్షల వాహనాల్లో 50 లక్షలు ద్విచక్ర వాహనాలు కాగా కార్ల వంటి తేలికపాటి వాహనాలు 13 లక్షలు ఉన్నాయి.
- 2013–14 నాటికి రాష్ట్రంలో రిజిస్టర్ అయి ఉన్న 70.73 లక్షల వాహనాల్లో 8.22 లక్షలు రవాణా వాహనాలు ఉండగా... 63.68 లక్షలు సరుకు రవాణా వాహనాల కేటగిరీకి చెందినవి. అప్పట్లో ద్విచక్ర వాహనాలు 52.84 లక్షలు, కార్లు 7,96,232, జీపులు 14,989, ట్యాక్సీలు 74,097, బస్సులు 40,807, సరుకు రవాణా చేసే తేలికపాటి వాహనాలు 1,85,688, ట్రక్కులు/ట్రాక్టర్లు 1,25,240 ఉండేవి.
- సెకండ్ హ్యాండ్ మార్కెట్‌ను సైతం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు సహా కొన్ని ఉత్తరాది నగరాల్లోని బడాబా బులు, సంస్థలు ఆర్థిక సంవత్సరం ముగిసేటప్పుడు పెద్ద సంఖ్యలో కొత్త వాహనాలను ఖరీదు చేస్తుంటారు. ఆదాయపన్ను రిటర్న్స్‌లో లెక్కలు చూపించడానికే ఇలా చేస్తుంటారు. ఆయా సమ యాల్లో అక్కడ నుంచి భారీ సంఖ్యలో సెకండ్ హ్యాండ్ వాహనాలు దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్తుంటాయి.
- రాష్ట్రం ఏర్పడే నాటికి హైదరాబాద్‌లో వాహనాల సంఖ్య 25 లక్షలు ఉండగా... గత దశాబ్ద కాలంగా ఏటా ఈ వాహనాలు పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని రోడ్లపై 46,937 విద్యుత్ (ఎలక్ట్రిక్) వాహనాలు రాకపోకలు సాగిస్తున్నట్లు రవాణశాఖ గణాంకాలు చెప్తున్నాయి. ఈ వాహనాలకు తెలంగాణ ప్రభుత్వం రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ చార్జీలు మినహాయింపు ఇస్తోంది. దీంతో ఏటా ఈ వాహనాల సంఖ్య పెరుగుతోందని, రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ గణాంకాలు కేవలం తెలంగాణలో రిజిస్టర్ అయిన వాహనాలకు సంబంధించినవి మాత్రమే కాగా.. ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రిజిస్టర్ అయినవి కూడా రాష్ట్రంలో ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
- వీటిలో నగరానికి వచ్చేవీ పెద్ద సంఖ్యలోనే ఉంటున్నాయి. ఆయా రాష్ట్రాల నుంచి ఇక్కడకు తీసుకువచ్చే వాహనాలను రిజిస్టర్ చేయించి నంబర్ మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో ఇప్పటికీ వేల సంఖ్యలో వాహ నాలు అక్కడి రిజిస్ట్రేషన్ నంబర్లతోనే తిరిగేస్తున్నా యి. ఈ కారణంగా వీటి సంఖ్య అధికారిక గణాంకాల్లోకి చేరట్లేదు.
Comments
Please login to add a commentAdd a comment