సాక్షి, హైదరాబాద్: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఎస్‌డీఆర్‌ఎఫ్‌ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ మేరకు ఆయన ఎన్టీఆర్ మార్గ్ వద్ద జెండా ఊపి ఎస్‌డీఆర్ఎఫ్ వాహనాలు, బోట్లను ప్రారంభించారు. అనంతరం హెచ్‌ఎండీఏ మైదానంలో ఏర్పాటు చేసిన ఎస్డీఆర్ఎఫ్ స్టాల్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్‌డీఆర్ఎఫ్ లోగోను సీఎం ఆవిష్కరించారు.
రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం సుమారు రెండు వేల మంది సిబ్బందితో ఏర్పాటుకగా, రాష్ట్ర సర్కార్.. ఎస్డీఆర్ఎఫ్కు రూ.35.03 కోట్లు మంజూరూ చేసింది. ఈ నిధులతో అధునాతన పరికరాలు, కొత్త అగ్నిమాపక వాహనాలు కొనుగోలు చేసి సిబ్బందికి ఎస్‌డీఆర్‌ఎఫ్ ప్రాథమిక కోర్సుల్లో శిక్షణ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment