ఈ యమహా స్కూటర్లలో ప్రాబ్లమ్‌.. 3 లక్షల యూనిట్లు రీకాల్‌! | Yamaha recalls 3 lakh scooters in India after big issue | Sakshi
Sakshi News home page

ఈ యమహా స్కూటర్లలో ప్రాబ్లమ్‌.. 3 లక్షల యూనిట్లు రీకాల్‌!

Published Fri, Feb 16 2024 1:15 PM | Last Updated on Fri, Feb 16 2024 2:11 PM

Yamaha recalls 3 lakh scooters in India after big issue - Sakshi

ప్రముఖ ద్విచక్ర వాహన తయారు సంస్థ యమహా ( Yamaha ) తమ కస్టమర్లకు అత్యవసర సమాచారం ఇచ్చింది. 2022 జనవరి 1 నుంచి 2024 జనవరి 4 మధ్య కాలంలో తయారు చేసిన దాదాపు 3 లక్షల యూనిట్ల 125cc స్కూటర్లను తక్షణమే అమలులోకి వచ్చేలా స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. 

ఆ స్కూటర్లు ఇవే..
కంపెనీ వెల్లడించిన ప్రకారం.. ఎంపిక చేసిన యూనిట్లలో బ్రేక్ లివర్ ఫంక్షన్‌లో సమస్య ఉన్నట్లు కంపెనీ గుర్తించింది. Ray ZR 125 Fi హైబ్రిడ్, Fascino 125 Fi హైబ్రిడ్ స్కూటర్ మోడల్స్ (2022 జనవరి తరువాతి మోడల్స్‌) ఎంపిక చేసిన యూనిట్లలో బ్రేక్ లివర్ ఫంక్షన్‌లో ఉన్న సమస్యను పరిష్కరించడమే రీకాల్ లక్ష్యంగా యమహా చెబుతోంది.

ఉచితంగానే రీప్లేస్‌మెంట్‌
రీప్లేస్‌మెంట్ పార్ట్ కస్టమర్‌కు ఉచితంగా అందించనున్నట్లు యమహా కంపెనీ వెల్లడించింది. రీకాల్ కోసం అర్హతను ధ్రువీకరించడానికి కస్టమర్లు ఇండియా యమహా మోటర్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి సర్వీస్ సెక్షన్‌లోని 'SC 125 వాలంటరీ రీకాల్'ని క్లిక్‌ చేయాలి. ఇక్కడ బండి ఛాసిస్ నంబర్, వివరాలు నమోదు చేస్తే తదుపరి దశలు వస్తాయి.

యమహా 2023 కొత్త 125 cc హైబ్రిడ్ స్కూటర్ శ్రేణి BS-VI OBD2 & E-20 ఫ్యూయల్ కంప్లైంట్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్ట్ (FI), 125 cc బ్లూ కోర్ ఇంజన్‌తో 8.2 PS @ 6,500 RPM పవర్ అవుట్‌పుట్‌, 10.3 NM @ 5,000 RPM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. యమహా అంతర్జాతీయ పరిశోధన, అభివృద్ధితో ఈ 125 Fi హైబ్రిడ్ ఇంజన్‌ తయారు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement