Yamaha
-
యమహా ఆర్15ఎం: ఇప్పుడు కొత్త హంగులతో..
జపనీస్ టూ వీలర్ బ్రాండ్ యమహా.. దేశీయ విఫణిలో కొత్త ఫీచర్లతో, కొత్త కలర్ ఆప్షన్ కలిగిన 'ఆర్15ఎం' బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ మెటాలిక్ గ్రే, ఐకాన్ పెర్ఫార్మెన్స్ అనే కొత్త కలర్ స్కీమ్ పొందుతుంది. వీటి ధరలు వరుసగా రూ. 1.98 లక్షలు, రూ. 2.08 లక్షలు (ఎక్స్ షోరూమ్).యమహా ఆర్15ఎం బైక్ కార్బన్ ఫైబర్ గ్రాఫిక్స్‌తో చాలా కొత్తగా కనిపిస్తుంది. ఇందులోని ఫ్రంట్ కౌల్, సైడ్ ఫెయిరింగ్, రియర్ ఫెండర్ వంటివి అప్డేట్స్ పొందుతాయి. అంతే కాకుండా బ్లాక్ అవుట్ ఫ్రంట్ ఫెండర్, ఫ్యూయల్ ట్యాంక్‌పై కొత్త గ్రాఫిక్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ బైకుకు మరింత ప్రీమియంగా కనిపించేలా చేస్తాయి.అప్డేటెడ్ యమహా ఆర్15ఎం బైక్ టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో పాటు మ్యూజిక్ అండ్ వాల్యూమ్ కంట్రోల్ వంటివి పొందుతుంది. అయితే వీటన్నింటినీ స్మార్ట్‌ఫోన్ ద్వారా యమహా వై-కనెక్ట్ యాప్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు.ఇదీ చదవండి: ఫోర్డ్ కంపెనీ మళ్ళీ ఇండియాకు: ఎందుకంటే? ఇందులో 155 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 18.4 బీహెచ్పీ పవర్, 14.2 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది. కాబట్టి ఉత్తమ పర్ఫామెన్స్ ఆశించవచ్చు. ఈ బైక్ యూఎస్డీ ఫోర్క్ సెటప్, మోనోషాక్ వంటివి పొందుతుంది. రెండు చివర్లలో డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కూడా లభిస్తుంది. -
ఈ ఆఫర్ ఓ తుఫాన్!
దేశీ ప్రైమరీ మార్కెట్లలో తాజాగా ఒక విచిత్రమైన రికార్డ్ నమోదైంది. కేవలం రూ.12 కోట్ల సమీకరణకు ఒక చిన్నతరహా సంస్థ పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. అయితే కనీవినీ ఎరుగని రీతిలో రూ.4,800 కోట్ల విలువైన బిడ్స్ దాఖలయ్యాయి. ఢిల్లీకి చెందిన రీసోర్స్ఫుట్ ఆటోమొబైల్ కంపెనీ యమహా ద్విచక్ర వాహన డీలర్‌గా వ్యవహరిస్తోంది. అదికూడా రెండు ఔట్లెట్లను మాత్రమే కలిగి ఉంది. 2018లో ఏర్పాటైన సంస్థ 8 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2023 డిసెంబర్ 28న సెబీకి దాఖలు చేసిన ఐపీవో ప్రాస్పెక్టస్ వివరాలు కింది విధంగా ఉన్నాయి.కొద్ది రోజులుగా దేశీ స్టాక్ మార్కెట్లు సాధిస్తున్న రికార్డుల బాటలో ప్రైమరీ మార్కెట్లు సైతం దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. దీంతో చిన్న, మధ్యతరహా కంపెనీల(ఎస్ఎంఈలు) ఐపీవోలకూ ఇటీవల భారీ డిమాండ్ నెలకొంటోంది. వెరసి తాజాగా ఐపీవోకు వచ్చిన రీసోర్స్‌ఫుల్ ఆటోమొబైల్ ఏకంగా 419 రెట్లు అధికంగా సబ్‌స్రైబ్ అయింది. సాహ్నీ ఆటోమొబైల్ బ్రాండుతో యమహా డీలర్‌గా వ్యవహరిస్తున్న కంపెనీ మోటార్ సైకిళ్లు, స్కూటర్ల విక్రయాలు, సర్వీసింగ్ చేపడుతోంది. ఇన్వెస్టర్ల నుంచి హెవీ రష్ఈ నెల 22న ప్రారంభమై 26న ముగిసిన రీసోర్స్‌ఫుల్ ఆటోమొబైల్ ఐపీవోలో భాగంగా 9.76 లక్షల షేర్లను ఆఫర్ చేసింది. అయితే 40.76 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు వెల్తువెత్తాయి. రూ.12 కోట్ల సమీకరణకు తెరతీస్తే ఏకంగా రూ.4,800 కోట్ల విలువైన బిడ్స్ లభించాయి. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల కేటగిరీలో 316 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 496 రెట్లు చొప్పున బిడ్స్ దాఖలయ్యాయి. ఇష్యూకి తొలి రోజు 10.4 రెట్లు, రెండో రోజు 74 రెట్లు అధికంగా స్పందన లభించింది. చివరి రోజుకల్లా బిడ్డింగ్ తుఫాన్ సృష్టించింది. షేరుకి రూ.117 ధరలో మొత్తం 10.25 లక్షల షేర్లను ఆఫర్ చేసింది. చిన్న, మధ్యతరహా కంపెనీల కోసం ఏర్పాటు చేసిన బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్ ద్వారా సాహ్నీ ఆటోమొబైల్ లిస్ట్‌కానుంది.ఇదీ చదవండి: భారత్‌లో ఎప్పటికీ చిన్నకార్లదే హవాఎస్ఎంఈలకు కనిపిస్తున్న అనూహ్య డిమాండ్ అసంబద్ధమని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రధాన పెట్టుబడుల వ్యూహకర్త వీకే విజయకుమార్ పేర్కొన్నారు. లిస్టింగ్ లాభాల కోసం ఇన్వెస్టర్లు నాణ్యతా సంబంధ విషయాలను సైతం విస్మరిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. అధిక సబ్స్క్రిప్షన్వల్ల తాత్కాలికంగా లాభాలు వచ్చినప్పటికీ దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి కొంత నిరాశ కలిగించవచ్చన్నారు. అయితే కంపెనీ బిజినెస్‌పై పూర్తి అవగాహనతో పెట్టుబడి పెట్టే వారు తక్కువవుతున్నారని ఆందోళన వ్యక్తి చేశారు. నియంత్రణ సంస్థలు హెచ్చరిస్తున్నప్పటికీ వేలంవెర్రి కొనసాగుతున్నట్లు తెలియజేశారు. ఎస్ఎంఈ ప్లాట్ ఫామ్ ద్వారా లిస్టయ్యే కంపెనీల ఖాతాలను మరింత అప్రమత్తంగా ఆడిటింగ్ చేయమంటూ గత వారం సెబీ హోల్‌టైమ్ డైరెక్టర్ అశ్వనీ భాటియా చార్టర్డ్ అకౌంటెంట్ల(సీఏలు)కు సూచించడం గమనార్హం.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
భారత్‌లో జపనీస్ బ్రాండ్ స్కూటర్ లాంచ్ - ధర ఎంతో తెలుసా?
జపనీస్ టూ వీలర్ తయారీ సంస్థ యమహా దేశీయ మార్కెట్లో 'ఫాసినో ఎస్' వేరియంట్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ లేటెస్ట్ స్కూటర్ ధర ధర రూ. 93730 (ఎక్స్ షోరూమ్). ఈ కొత్త స్కూటర్ ఇప్పుడు అప్డేటెడ్ ఫీచర్లతో వస్తుంది. ఇందులో ఆన్సర్ బ్యాక్ అనే ఫైండ్ మై స్కూటర్ యాప్ కూడా ఉంది.యమహా ఫాసినో ఎస్ వేరియంట్ 125 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8.2 హార్స్ పవర్ మరియు 10.3 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని బరువు కేవలం 99 కేజీలు మాత్రమే. ఇది 21 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ పొందుతుంది.యమహా ఫాసినో ఇప్పుడు డ్రమ్, డిస్క్, ఎస్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 79900, రూ. 91130, రూ. 93730 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). ఈ స్కూటర్ దేశీయ మార్కెట్లో సుజుకి యాక్సెస్ 125, హోండా యాక్టివా 125, టీవీఎస్ జుపీటర్ 125, యమహా రే జెడ్ఆర్ 125 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
ఈ యమహా స్కూటర్లలో ప్రాబ్లమ్.. 3 లక్షల యూనిట్లు రీకాల్!
ప్రముఖ ద్విచక్ర వాహన తయారు సంస్థ యమహా ( Yamaha ) తమ కస్టమర్లకు అత్యవసర సమాచారం ఇచ్చింది. 2022 జనవరి 1 నుంచి 2024 జనవరి 4 మధ్య కాలంలో తయారు చేసిన దాదాపు 3 లక్షల యూనిట్ల 125cc స్కూటర్లను తక్షణమే అమలులోకి వచ్చేలా స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ స్కూటర్లు ఇవే.. కంపెనీ వెల్లడించిన ప్రకారం.. ఎంపిక చేసిన యూనిట్లలో బ్రేక్ లివర్ ఫంక్షన్లో సమస్య ఉన్నట్లు కంపెనీ గుర్తించింది. Ray ZR 125 Fi హైబ్రిడ్, Fascino 125 Fi హైబ్రిడ్ స్కూటర్ మోడల్స్ (2022 జనవరి తరువాతి మోడల్స్) ఎంపిక చేసిన యూనిట్లలో బ్రేక్ లివర్ ఫంక్షన్లో ఉన్న సమస్యను పరిష్కరించడమే రీకాల్ లక్ష్యంగా యమహా చెబుతోంది. ఉచితంగానే రీప్లేస్మెంట్ రీప్లేస్మెంట్ పార్ట్ కస్టమర్‌కు ఉచితంగా అందించనున్నట్లు యమహా కంపెనీ వెల్లడించింది. రీకాల్ కోసం అర్హతను ధ్రువీకరించడానికి కస్టమర్లు ఇండియా యమహా మోటర్ వెబ్సైట్లోకి వెళ్లి సర్వీస్ సెక్షన్‌లోని 'SC 125 వాలంటరీ రీకాల్'ని క్లిక్ చేయాలి. ఇక్కడ బండి ఛాసిస్ నంబర్, వివరాలు నమోదు చేస్తే తదుపరి దశలు వస్తాయి. యమహా 2023 కొత్త 125 cc హైబ్రిడ్ స్కూటర్ శ్రేణి BS-VI OBD2 & E-20 ఫ్యూయల్ కంప్లైంట్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్ట్ (FI), 125 cc బ్లూ కోర్ ఇంజన్‌తో 8.2 PS @ 6,500 RPM పవర్ అవుట్‌పుట్, 10.3 NM @ 5,000 RPM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. యమహా అంతర్జాతీయ పరిశోధన, అభివృద్ధితో ఈ 125 Fi హైబ్రిడ్ ఇంజన్ తయారు చేశారు. -
యమహా ఎలక్ట్రిక్ బైక్ ఎలా ఉందో చూశారా?
-
‘యమహా’ యమ్మా ఏం బైక్ గురూ..! (ఫొటోలు)
-
ఆర్ఎక్స్100 మళ్ళీ రానుందా? ఇదిగో క్లారిటీ!
Yamaha RX: గత కొన్ని సంవత్సరాల క్రితం బైక్ ప్రేమికులకు బాగా ఇష్టమైన మోడల్ 'యమహా' (Yamaha) కంపెనీకి చెందిన 'ఆర్ఎక్స్100' (RX100). ఒకప్పుడు కుర్రకారుని ఉర్రుతలూగించిన ఈ బైక్ కోసం ఎదురు చూసే కస్టమర్లు ఇంకా భారత్‌లో ఉన్నారు అనటంలో ఏ మాత్రమే సందేహం లేదు. అయితే దీనిని దృష్టిలో ఉంచుకుని సంస్థ మళ్ళీ ఈ బైకుని లాంచ్ చేయడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనల్లో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, యమహా ఆర్ఎక్స్100 భారతీయుల గుండెల్లో నిలిచిపోయిన బైక్ మోడల్. కావున ఆ పేరుకి ఏ మాత్రం భంగం కలగకుండా 'ఆర్ఎక్స్' (RX) అనే పేరుతో మళ్ళీ మార్కెట్లో బైకుని విడుదల చేయనున్నట్లు యమహా మోటార్ ఇండియా ఛైర్మన్ 'ఈషిన్ చిహానా' ఇటీవల ధృవీకరించినట్లు తెలుస్తోంది. భారతదేశపు ఐకానిక్ మోడల్ అయిన ఆర్ఎక్స్100 మంచి స్టైలింగ్, లైట్ వెయిట్, ప్రత్యేకమైన సౌండ్ సిస్టం కలిగి ఉండేది. ఇది అప్పటి వినియోగదారులను మాత్రమే కాకుండా ఆధునిక కాలంలో బైక్ కొనుగోలు చేస్తున్న వారిని మంత్రముగ్దుల్ని చేసింది. (ఇదీ చదవండి: ప్రత్యర్థుల పని పట్టడానికి వస్తున్న టీవీఎస్ కొత్త బైక్ - వివరాలు) ఈ బైకుని మళ్ళీ పునఃరూపకల్పన చేయాలంటే కనీసం 200సీసీ ఇంజిన్ అయినా అమర్చాలి. అయినప్పటికీ ఒకప్పటి సౌండ్ మళ్ళీ వస్తుందా? అనేది ప్రశ్నగానే ఉంటుంది. కావున ఆర్ఎక్స్100 బైకుకి ఉన్న పేరును నాశనం చేయదలచుకోలేదు. ప్రస్తుత లైనప్‌తో 155 సీసీ సరిపోదు. కానీ భవిష్యత్తులో యమహా ఆర్ఎక్స్ పేరుతో తీసుకురావడానికి తప్పకుండా కృషి చేస్తామని ఆయన తెలిపారు. మొత్తానికి ఆర్ఎక్స్ మళ్ళీ ఇండియాలో అడుగుపెట్టనున్నట్లు తెలిసింది. అయితే లాంచ్ ఎప్పుడనేది తెలియాల్సి ఉంది. -
ప్రత్యర్థులకు దడపుట్టిస్తున్న యమహా ప్లాన్స్
స్టైలిష్ బైకులకు ప్రసిద్ధి చెందిన 'యమహా' (Yamaha) దేశీయ మార్కెట్లో రానున్న రోజుల్లో ప్రీమియం బైక్స్ లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. కంపెనీ వీటి కోసం త్వరలోనే ఫ్రీ బుకింగ్స్ కూడా స్వీకరించడానికి సిద్ధమవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. యమహా విడుదల చేయనున్న ఈ కొత్త బైక్స్ తమ బ్లూ స్క్వేర్ షోరూమ్స్ల విక్రయించనున్నట్లు సమాచారం. కంపెనీ ఇటీవలే 200వ షోరూమ్‌ను చెన్నైలో ప్రారభించింది. యమహా 2019 నుంచి ఈ ప్రీమియం డీలర్షిప్ నెట్వర్క్ ప్రారంభించడం మొదలుపెట్టింది. రానున్న రోజుల్లో ఈ షోరూమ్‌ల సంఖ్యను మరింత పెంచడానికి ప్రయత్నిస్తోంది. (ఇదీ చదవండి: మహీంద్రా థార్ Vs మారుతి జిమ్నీ - ఏది బెస్ట్ అంటే?) యమహా ఇండియా ఎమ్‌టి03, ఎమ్‌టి-07, ఎమ్‌టి-07, ఆర్3, ఆర్1, ఆర్1ఎమ్ వంటి ప్రీమియం బైకులను త్వరలోనే దేశీయ విఫణిలో విడుదల చేయనుంది. ఇప్పటికే సంస్థ వీటిని ఒక ప్రైవేట్ ఈవెంట్లో ప్రదర్శించింది. అయితే ఇవి మార్కెట్లో ఎప్పుడు విడుదలవుతాయనే ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. బహుశా ఇవి పండుగ సీజన్లో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
భారత్‌లో యమహా డార్క్ నైట్ ఎడిషన్ లాంచ్ - వివరాలు
Yamaha YZF-R15 V4 Dark Knight Edition: భారతదేశంలో యమహా బైకులకున్న ప్రజాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మార్కెట్లో తనదైన రీతిలో దూసుకెళ్తున్న ఈ కంపెనీ తాజాగా మరో బైకుని లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ పేరు 'వైజెడ్ఎఫ్-ఆర్15 వి4' (YZF-R15 V4) డార్క్ నైట్ ఎడిషన్. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర & కలర్ ఆప్షన్స్ కొత్త యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 వి4 డార్క్ నైట్ ఎడిషన్ నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కలర్ ఆప్షన్ని బతి ధరలు కూడా మారుతూ ఉంటాయి. వైజెడ్ఎఫ్-ఆర్15 రెడ్ కలర్ ధర రూ. 1.18 లక్షలు, డార్క్ నైట్ ధర రూ. 1.82 లక్షలు, బ్లూ అండ్ ఇంటెన్సిటీ వైట్ ధరలు రూ. 1.86 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 వి4 డార్క్ నైట్ ఎడిషన్ చూడటానికి దాదాపు బ్లాక్ కలర్ పొందుతుంది. అయితే ఇందులో లోగోలు, అల్లాయ్ వీల్స్ వంటివి గోల్డ్ హైలైట్లను పొందుతాయి. కావున చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా దాదాపు దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటాయి. (ఇదీ చదవండి: భారత్‌లో విడుదలైన ఆల్ట్రోజ్ సిఎన్జి.. ధర తక్కువ & ఎక్కువ ఫీచర్స్!) ఇంజిన్ ఇంజిన్ కూడా స్టాండర్డ్ ఎడిషన్ బైక్‌తో సమానంగా ఉంటుంది. కావున అదే లిక్విడ్ కూల్డ్ 155 సీసీ సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ కలిగి 18.4 hp పవర్, 14.2 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది. కావున ఉత్తమ పనితీరుని అందిస్తుంది. ప్రత్యర్థులు దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 వి4 డార్క్ నైట్ ఎడిషన్ ఇప్పటికే అమ్మకానికి ఉన్న సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250, కెటిఎమ్ RC 200 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
కొత్త హంగులతో ముస్తాబైన కొత్త యమహా ఎలక్ట్రిక్ స్కూటర్ - వివరాలు
ప్రముఖ బైక్ అండ్ స్కూటర్ తయారీ సంస్థ యమహా తన నియో ఎలక్ట్రిక్ స్కూటర్ని అప్డేట్ చేసింది. ఈ 2023 మోడల్ అంతర్జాతీయ మార్కెట్లో అధికారికంగా అరంగేట్రం చేసింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ గురించి మరిన్ని అప్డేటెడ్ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. యమహా కంపెనీ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు కొత్త కలర్ స్కీమ్ పొందుతుంది, కావున చూడటానికి దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఆధునికంగా ఉంటుంది. ఇందులోని స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ డిఆర్ఎల్ వంటివి అద్భుతంగా పనిచేస్తాయి. అయితే వెనుక భాగంలో టెయిల్ లాంప్ మాత్రం నెంబర్ ప్లేట్ మీద అమర్చి ఉండటం చూడవచ్చు. ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో అందుబాటులో ఉన్న స్కూటర్ల మాదిరిగానే మంచి పనితీరుని అందిస్తుంది. ఇందులో రెండు రిమూవబుల్ లిథియం అయాన్ బ్యాటరీలు ఉంటాయి. అంతే కాకుండా 2.03 కిలోవాట్ మోటార్ ఇందులో అమర్చబడి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 40 కిలోమీటర్ల మాత్రమే. ఇది పూర్తి ఛార్జ్ చేసుకోవడానికి గరిష్టంగా 8 గంటల సమయం తీసుకుంటుంది. (ఇదీ చదవండి: ఒకప్పుడు ఆసియాలో అత్యంత ధనవంతుడు! ఇప్పుడు ఆస్తులు సున్నా అంటున్నాడు..) ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన LCD డిస్ప్లే లభిస్తుంది. ఇది బ్యాటరీ స్టేటస్, రూట్ ట్రాకింగ్, కాల్స్ అండ్ మెసేజస్ వంటి వాటిని యాక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది బైక్ రైడర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎంపిక చేసిన కొన్ని డీలర్‌షిప్‌లలో ప్రదర్శించారు. ఇది ఈ సంవత్సరం చివరినాటికి లేదా 2024 ప్రారంభంలో భారతదేశంలో విక్రయానికి రానున్నట్లు భావిస్తున్నారు. -
మార్కెట్లోకి యమహా ఏరాక్స్ 155 కొత్త వెర్షన్ @ 1,42 లక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ కంపెనీ యమహా తాజాగా ఏరాక్స్ 155 స్పోర్ట్స్ స్కూటర్ 2023 వెర్షన్‌ను భారత్‌లో ప్రవేశపెట్టింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.1,42,800 ఉంది. ఈ20 ఇంధన ప్రమాణాలకు అనుగుణంగా 155 సీసీ ఇంజన్ పొందుపరిచింది. ఎల్ఈడీ పొజిషనింగ్ ల్యాంప్స్‌తో ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, మొబైల్ చార్జింగ్ కోసం పవర్ సాకెట్, 24.5 లీటర్ల స్టోరేజ్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్, 14 అంగుళాల అలాయ్ వీల్స్, ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్స్తోపాటు స్కూటర్లలో తొలిసారిగా ఈ మోడల్‌కు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. అలాగే ఆర్15ఎస్, ఎంటీ15 వీ2, ఆర్15 వీ4 మోడళ్లలో 2023 వేరియంట్లను ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూం ధర రూ.1.63–1.86 లక్షల మధ్య ఉంది. కాఫీడే రూ.436 కోట్ల రుణాల ఎగవేత న్యూఢిల్లీ: కాఫీ డే ఎంటర్ప్రైజెస్ మార్చి 31 నాటికి మొత్తం రూ.436 కోట్ల రుణాలను చెల్లించడంలో విఫలమైనట్టు స్టాక్ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. స్వల్పకాల, దీర్ఘకాల రుణాలు ఇందులో ఉన్నట్టు తెలిపింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.220 కోట్ల రుణ సదుపాయాల్లో అసలు రూ.190 కోట్లు, వడ్డీ రూ.6 కోట్ల వరకు చెల్లించలేకపోయినట్టు తెలిపింది. మరో రూ.200 కోట్లు, దీనిపై రూ.40 కోట్ల వడ్డీ మేర ఎన్సీడీలు, ఎన్‌సీఆర్‌పీఎస్‌ల రూపంలో తీసుకున్నవి చెల్లించలేదని సమాచారం ఇచ్చింది. కంపెనీ తన ఆస్తులను విక్రయించడం ద్వారా క్రమంగా రుణ భారాన్ని తగ్గించుకుంటూ వస్తుండడం గమనార్హం. -
Yamaha 2023 కొత్త స్కూటర్లు చూశారా...అదిరే లుక్స్‌లో వచ్చేశాయ్!
సాక్షి, ముంబై: యమహా మోటార్ ఇండియా కొత్త స్కూటర్లను అప్డేటెడ్గా తీసుకొచ్చింది. 125 సీసీ స్కూటర్ లైనప్‌ను 2023 వర్షెన్లను లాంచ్ చేసింది. 2023 Yamaha Fascino, Ray ZR 125, RayZR స్ట్రీట్ ర్యాలీలను తీసుకొచ్చింది. కస్టమర్లను ఆకట్టుకునేలా కొత్త కలర్ స్కీమ్‌లు, అప్డేటెడ్ ఇంజన్ , కొత్త ఫీచర్లతో వీటిని తీసుకొచ్చింది. భారతదేశంలో రూ. 89,530, ఎక్స్-షోరూమ్ ధరలతో ప్రారంభం. 2023 యమహా ఫాసినో 125 ఎక్స్‌షోరూం ధర రూ. 91,030గా ఉంది. రే జెడ్ఆర్ 125 ఫై హైబ్రీడ్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 89,530గా ఉంది. అలాగే రేయ్ జెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ఎక్స్-షోరూమ్ ధర రూ. 93,530గా ఉంది. ఫాసినో 125 డిస్క్ వేరియంట్, రేయ్ జెడ్ఆర్ 125 స్కూటర్లరు డార్క్ మ్యాట్ బ్లూ కలర్‌లోనూ, రేయ్ జెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ కొత్త మ్యాట్ బ్లాక్ & లైట్ గ్రే వెర్మిలియన్ పెయింట్ స్కీమ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ స్కూటర్లు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తోపాటు, ఒకత్తగా బ్లూటూత్-ఎనేబుల్ చేయబడిన మై-కనెక్ట్ యాప్‌కి కనెక్ట్ చేసింది. ఫ్యూయెల్ కన్జమ్షన్ ట్రాకర్, మెయిన్టేనెన్స్ రికమెండేషన్, లాస్ట్ పార్కింగ్ లొకేషన్, మాల్ఫంక్షన్ నోటిఫికేషన్, రివర్స్ డాష్‌బోర్డ్, రైడర్ ర్యాంకింగ్ లాంటి ఫీచర్లు ప్రధానంగా ఉన్నాయి. ఇంజీన్ 125 సీసీ బ్లూ కోర్ ఇంజిన్ 6,500 ఆర్పీఎం వద్ద 8.2 పీఎస్ పవర్‌ను, 5000 ఆర్పీఎం వద్ద 10.3 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. హైబ్రీడ్ ఇంజిన్‌లో స్మార్ట్ మోటార్ జనరేటర్ సిస్టెమ్ కూడా ఉంటుంది. ఇంకా ఓబీడీఐ2, ఈ-20 ఫ్యూయెల్ కంప్లైంట్ బీఎస్6, ఎయిర్- కూల్డ్ ఫ్యూయెల్ ఇంజక్షన్ (ఎఫ్ఐ) కొత్త వెర్షన్ ప్రత్యేకతలుగా ఉన్నాయి. -
యమహా త్రీ వీల్ స్కూటర్.. కొత్త లుక్ & అదిరిపోయే ఫీచర్స్
అంతర్జాతీయ మార్కెట్లో మూడు చక్రాల స్కూటర్లు చాలా అరుదు, అయితే ప్రపంచం ప్రగతి మార్గంలో పరుగులు పెడుతున్న తరుణంలో ఆధునిక వాహనాల ఉత్పత్తి, వినియోగం చాలా అవసరం. ఇందులో భాగంగా యమహా కంపెనీ ఇప్పుడు జపనీస్ మార్కెట్లో ట్రైసిటీ స్కూటర్ విడుదల చేసింది. యమహా విడుదల చేసిన ట్రైసిటీ స్కూటర్ 125 సీసీ, 155 సీసీ విభాగంలో అందుబాటులో ఉన్నాయి. నిజానికి కంపెనీ ఇలాంటి స్కూటర్ 2014 లో గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసినప్పటికీ భారతీయ మార్కెట్లో అందుబాటులోకి తీసుకురాలేదు. ఇది సాధారణ స్కూటర్ మాదిరిగా ఉన్నప్పటికీ ముందు భాగంలో రెండు చక్రాలు, వెనుక ఒక చక్రం పొందుతుంది. ట్రైసిటీ స్కూటర్ LED డేటైమ్ రన్నింగ్ లైట్స్, సెంటర్ సెట్ LED హెడ్‌లైట్, LCD సెంటర్ కన్సోల్ వంటి వాటితో పాటు సింగిల్ సీట్‌తో ఇంటిగ్రేటెడ్ గ్రాబ్ రైల్ పొందుతుంది. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్స్, రెండు వైపులా డిస్క్ బ్రేకులు, ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక డ్యూయెల్ షాక్ అబ్జార్బర్ కలిగి ఉంటుంది. ట్రైసిటీ స్కూటర్లోని 125 సీసీ ఇంజిన్ 12.06 బిహెచ్పి పవర్, 11.2 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది, అదే సమయంలో 155 సీసీ ఇంజిన్ 14.88 బిహెచ్పి పవర్ మరియు 14 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. జపనీస్ మార్కెట్లో విడుదలైన ట్రైసిటీ 125 స్కూటర్ 125 ధర రూ. 4,95,000 యెన్లు (సుమారు రూ. 3.10 లక్షలు) 155 స్కూటర్ ధర 5,56,500 యెన్లు (సుమారు రూ. 3.54 లక్షలు). డెలివరీలు ఫిబ్రవరి, ఏప్రిల్ సమయంలో మొదలవుతాయి. ఈ మోడల్ స్కూటర్ మన దేశంలో విడుదలవుతుందా.. లేదా అనే విషయాన్నీ యమహా ధ్రువీకరించలేదు. -
కళ్లు చెదిరే బైక్‌లు లాంచ్ చేసిన యమహా.. సూపర్ ఫీచర్స్!
యువత అభిరుచికి అనుగుణంగా ఎప్పటికప్పుడు లేటెస్ట్, అధిక సీసీ బైక్‌లను తయారు చేస్తున్న యమహా మోటార్ ఇండియా కంపెనీ 150 సీసీ రేంజ్లో మరికొన్ని వర్షన్లను లాంచ్ చేసింది. యమహా ఆర్15 వీ4, ఎంటీ 15, ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్‌లను విడుదల చేసింది. వీటి ప్రత్యేకతలు.. ధరలు ఎలా ఉన్నాయో చూడండి.. మిగతా యమహా 150 సీసీ బైక్‌లకు ఉన్న ఇంజిన్ ప్రత్యేకతలన్నీ వీటికీ కొనసాగింపు. బీఎస్6 నిబంధనలకు అనుగుణంగా కొత్తగా ఆన్‌బోర్డ్ డయాగ్నస్టిక్ డివైజ్(ఓబీడీ). అన్నింటికీ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్. ఎఫ్‌జెడ్-ఎక్స్‌లో 149 సీసీ ఎఫ్ఐ ఇంజిన్, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లు, ఎస్సెమ్మెస్, ఈ-మెయిల్ అలర్ట్స్ వచ్చే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఎంటీ 15లో అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, డిజిటల్ ఎల్సీడీ మీటర్. ఆర్15 వీ4లో ఏబీఎస్ డ్యుయల్ చానల్. యమహా ఎంటీ 15 వీ5లో నాలుగు రంగులు. ధర రూ.1,68,400. ఎఫ్జెడ్ఎస్ ఎఫ్ఐ వీ4 డీలక్స్ మూడు రంగులు. ధర రూ.1,27,400. ఎఫ్‌జెడ్ ఎఫ్ఐ వీ3 డీలక్స్ రెండు రంగులు. ధర రూ.1,15,200. ఎఫ్‌జెడ్-ఎక్స్ మూడు రంగులు. డాక్ట్ మ్యాటీ బ్లూ ధర రూ.1,36,900, మిగతా రెండింటి ధర రూ.1,35,900. ఆర్15 వీ4 ఒకే రంగు. ధర రూ.1,93,900. (ధరలన్నీ ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రైజెస్) -
యమహా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్..
-
యమహా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్
ప్రముఖ ద్విచక్రవాహనాల తయారీ బ్రాండ్ యమహా మెటార్ ఇండియా..తనకున్న యూత్ క్రేజ్‌ను అంతకంతకూ పటిష్టం చేసుకునేలా ఉత్పత్తుల్ని అందిస్తున్న విషయం విదితమే. ఇదే క్రమంలో గత ఏడాది ఆర్ 15వి4, ఆర్ 15ఎమ్ వంటి స్పోర్ట్స్ మోడల్స్‌ను, లిక్విడ్ కూల్ ఇంజన్‌తో ఎఇఆర్ఒఎక్స్ 155 స్పోర్ట్స్ స్కూటర్‌ను దేశీయంగా విడుదల చేసింది. మరోవైపు దేశంలో ఎలక్ట్రానిక్ వెహికల్స్ (ఇవి)లకు సంబంధించి, పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా, భారతదేశంలోని యమహా కంపెనీ ఇంజనీర్లు జపాన్‌లోని యమహా హెడ్‌క్వార్టర్స్‌లోని బృందం సమన్వయంతో భారతీయ మార్కెట్ కోసం ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లాట్‌ఫారమ్‌పై దృష్టి సారించారు. భారతీయ రైడింగ్ పరిస్థితులకు అనుకూలంగా ఉండేలా మా మోటార్ / బ్యాటరీ ప్రమాణాలపై మేం మళ్లీ పని చేయాల్సి ఉంటుంది. భారతీయ సరఫరాదారులను ఉపయోగించడం ద్వారా అందుబాటులో ధర నిర్ణయించగలమని ఆశిస్తున్నామని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రవీందర్ సింగ్ తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్లు ఎల్లప్పుడూ యమహాకు చాలా ముఖ్యమైన మార్కెట్ అని ఇక్కడి 18–26 ఏళ్ల మధ్య ఉన్న అద్భుతమైన, స్టైలిష్ స్పోర్టీ మోటార్‌సైకిళ్లను ఇష్టపడే యువ కస్టమర్ల బలమైన ఆదరణతో తాము మార్కెట్‌ను విస్తరిస్తున్నామన్నారు. -
యమహా గుడ్‌న్యూస్ చెప్పిందిగా!
సాక్షి, ముంబై: పెరుగుతున్న ఇంధన ధరలు, కర్బన ఉద్గారాల కాలుష్యం, ఇథనాల్లాంటి ప్రత్యామ్నాయ ఇంధనాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో తన వినియోగ దారులకు మంచి వార్త చెప్పింది.ఎలక్ట్రిక్ వాహనాలు ధరలను చూసి బెంబేలెత్తిపోతున్న రైడర్లకు ఊరట కలిగేలా పెట్రోలు, ఇథనాల్ లేదా రెండిటితో కలిసి పనిచేసి అద్భుతమైన ఇంజీన్‌తో కొత్త బైక్‌ను తీసుకొచ్చింది. 2023 యమహా ఎఫ్‌జెడ్-15ను బ్రెజిల్లో లాంచ్ చే సింది. కంపెనీ ఈ బైక్‌ను దక్షిణ అమెరికా దేశంలో Fazer FZ-15 పేరుతో విక్రయిస్తోంది. అయితే ఇదే ఇంజీన్‌తో అప్డేట్ చేసి ఇండియాలో ఇథనాల్ ఆధారిత Yamaha FZ V3 బైక్‌ను త్వరలోనే తీసుకురావచ్చని భావిస్తున్నారు. యమహా ఎఫ్‌జెడ్-15ను బ్లూఫ్లెక్స్ సిస్టమ్‌తో కూడిన 150సీసీ ఇంజిన్‌తో వచ్చింది. ఇది పెట్రోల్, ఇథనాల్ లేదా రెండింటిలో ఏది ఎక్కువ పొదుపుగా ఉంటుందో దాన్ని ఎంచుకునేలా సపోర్ట్ చేస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే, కొత్త యమహా బైక్‌లు ప్రొజెక్టర్, ఎల్ఈడీ హెడ్‌లైట్, ముందు భాగంలో ABS బ్రేక్‌లు, రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, మోనోక్రాస్ సస్పెన్షన్, వైడ్ టైర్లు, క్లాక్, గేర్ ఇండికేటర్, టాకోమీటర్,ఈకో ఫంక్షన్‌గా విడదుల చేసింది.రేసింగ్ బ్లూ, మిడ్నైట్ బ్లాక్ మరియు మాగ్మా రెడ్ అనే మూడు రంగుల ఎంపికలో లభ్యం. ధర సుమారు రూ. 2.69 లక్షలుగా ఉంటుంది. -
అన్నీ పరిస్థితులను తట్టుకునేలా.. యమహా ఎలక్ట్రిక్ స్కూటర్..రేంజ్ ఎంతంటే..?
Yamaha E01 Electric Scooter: ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసేందుకు ప్రముఖ టూవీలర్ దిగ్గజం యమహా మోటార్స్ సిద్దమవుతోంది. తాజాగా యమహా తన కంపెనీ నుంచి రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ యమహా ఈ01ను పరీక్షించడం మొదలుపెట్టింది. థాయిలాండ్, తైవాన్, ఇండోనేషియాతో పాటు మలేషియాలో యమహా ఈ01 లాంచ్ చేసేందుకు కంపెనీ ప్రణాళికలను రచిస్తోంది. అన్నీ పరిస్థితుల్లో తట్టుకునేలా..! యమహా ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ01ను అన్నీ పరిస్థితుల్లో తట్టుకునేలా రూపొందించనుంది. అందుకోసమే విభిన్న వాతావరణ పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ01ను పరీక్షించనుంది. రానున్న రోజుల్లో యూరప్, జపాన్‌లో కూడా ఈ స్కూటర్‌పై పరీక్షలు నిర్వహించనున్నారు. సిటీ మొబిలిటీని దృష్టిలో ఉంచుకుని ఈ స్కూటర్ డిజైన్ చేసింది యమహా. రేంజ్ విషయానికి వస్తే.. యమహా ఈ01 ఎలక్ట్రిక్ స్కూటర్ 4.9 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో రానున్నట్లు సమాచారం. ఈ బ్యాటరీ సహాయంతో 5000 ఆర్పీఎం వద్ద వద్ద 8.1 kW మరియు 1,950 rpm వద్ద 30.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. ఈ స్కూటర్ సుమారు 100కి.మీ రేంజ్‌ను అందించనుంది. Yamaha E01 ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు పవర్ మోడ్లతో పాటు రివర్స్ మోడ్‌లో వస్తుంది. స్కూటర్లో మూడు ఛార్జింగ్ ఎంపికలు అందుబాటులో ఉంటాయి. ఇటీవలే భారత్‌లో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను యమహా ఆవిష్కరించింది. ఐతే ఈ స్కూటర్ల లాంచ్ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: హల్చల్ చేస్తోన్న రోల్స్ రాయిస్ ఘోస్ట్..! -
కేసీఆర్ చెప్పినట్టే జరగబోతుందా? ఆ విషయంలో జట్టు కట్టిన యమహా, కవాసాకి
భవిష్యత్తులో పెట్రోలు, డీజిల్ వాహనాలు ఉండబోవంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇటీవల ప్రెస్మీట్లో వ్యాఖ్యానించారు. ఆయన చెప్పినట్టే ఫ్యూచర్ ఉండబోతుందా ? అంటే అవును అన్నట్టుగానే వెహికల్ ఇండస్ట్రీలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల వరి ధాన్యం కొనుగోలు అంశంపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడుతూ.. టెక్నాలజీ వేగంగా మారుతుందని, త్వరలో రోడ్ల మీద పెట్రోలు , డీజిల్ వాహనాలు కనపించవన్నారు. రోడ్లపై కాలుష్యం వెదజల్లని ఎలక్ట్రిక్ వెహకిల్స్ మాత్రమే తిరుగుతాయన్నారు. తాను అటువంటి కారు ఒకటి కొన్నట్టు చెప్పారు. ఆయన మాటలకు నిజం కావడానికి ఎంతో కాలం పట్టేట్టుగా లేదు. ఇంతకాలం పెట్రోలు, డీజిల్‌లను ఉపయోగించే ఇంటర్నల్ కంబస్టన్ (ఐసీ) ఇంజన్లతో కార్లు, బైకులు, స్కూటర్లు తయారు చేస్తూ వచ్చిన సంస్థలన్నీ త్వరలో వాటికి ఫుల్స్టాప్ పెట్టబోతున్నట్టు సంకేతాలు ఇచ్చాయి. అంతేకాదు కాలుష్య రహిత ఇంజన్లను తయారు చేసేందుకు వీలుగా దశబ్ధాల తరబడి ఉన్న వైరాన్ని మరిచి జట్టు కట్టేందుకు సైతం రెడీ అయ్యాయి. కలిసికట్టుగా జపాన్‌లోని ఓకహాలో నవంబరు 13,14 తేదీల్లో ఇంటర్నల్ కంబస్టన్ (ఐసీ) ఇంజన్ల తయారీ సంస్థ సదస్సులో కీలక ప్రకటన వెలువడింది. ఐసీ ఇంజన్ల తయారీలో మార్కెట్ దిగ్గజ కంపెనీలైన కవాసాకి, యమహా, టయోటా, మజ్దా, సబరు కార్పొరేషన్లు కలిసి పని చేయాలని నిర్ణయించాయి. పరస్పరం సాంకేతిక సహకారం అందించుకుంటూ ఐసీ ఇంజన్ల స్థానంలో హైడ్రోజన్ ఇంజన్లు రెడీ చేస్తామంటూ సంయుక్త ప్రకటన జారీ చేశాయి. హైడ్రోజన్ ఇంజన్ డీజిల్, పెట్రోల్‌లకు ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్‌ను ఉపయోగించే టెక్నాలజీ 2018లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. అంతకు ముందు 2010 నుంచే హైడ్రోజన్‌తో వాహనాలు నడిచే ఇంజన్లను తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానంపై కవాసాకి ప్రయోగాలు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి హైడ్రోజన్ ఫ్యూయల్ ఇంజన్ అందుబాటులోకి తేనుంది. అనంతరం ఆ టెక్నాలజీనికి మిగిలిన కంపెనీలతో మరింత సమర్థంగా మార్చి కమర్షియల్ వెహికల్స్ మార్కెట్లోకి తేవాలని నిర్ణయించారు. ఒక్కసారి ఇంజన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత హోండా, సుజుకిలను కూడా ఇందులో భాగస్వాములను చేస్తామంటున్నారు. ఈవీ హవా ఇండియాలో ఉన్న బైకుల్లో నూటికి తొంభై శాతం జపాన్ కంపెనీలు తయారు చేసిన ఐసీ ఇంజన్లతోనే తయారవుతున్నాయి. కాగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్ పుంజుకుంటోంది. రోజుకో కొత్త స్టార్టప్ కంపెనీ ఈవీ బైకులు, స్కూటర్లతో మార్కెట్‌ని ముంచెత్తుతున్నాయి. దీంతో ఐసీ ఇంజన్ల వాహనాల మార్కెట్‌కి కోత పడుతోంది. రిలయన్స్ సైతం ఇక రియలన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఏకంగా హైడ్రోజన్ ఫ్యూయల్ ఉత్పత్తి చేసే రెండు గిగా ఫ్యాక్టరీలు నిర్మించబోతున్నట్టు ప్రకటించారు. ముఖేశ్‌తో పాటు అదానీ సైతం ఈ రంగంలో పోటీ పడుతున్నారు. ఫలితంగా రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్, హైడ్రోజన్ ఫ్యూయల్ ఇంజన్ల హవా నడవనుంది. ఒకప్పటి స్టీమ్ ఇంజన్ల తరహాలోనే పెట్రోలు, డీజిల్ ఇంజన్లు మూలన పడే పరిస్థితి ఎదురుకానుంది. చదవండి:ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. టెస్ట్ రైడ్‌కి మీరు సిద్ధమా? -
యమహా నుంచి కొత్త ఎడిషన్ బైక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ యమహా.. ఎంటీ15 మాన్స్టర్ ఎనర్జీ యమహా మోటోజీపీ ఎడిషన్ బైక్‌ను ప్రవేశపెట్టింది. ధర ఢిల్లీ ఎక్స్‌షోరూంలో రూ.1.48 లక్షలు. ఫ్యూయల్ ట్యాంక్‌పై యమహా మోటోజీపీ బ్రాండింగ్ ఉంటుంది. 155 సీసీ, ఫ్యూయల్ ఇంజెక్టెడ్, లిక్విడ్ కూల్డ్, 4 స్ట్రోక్, ఎస్వోహెచ్సీ, 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో 4 వాల్వ్ ఇంజన్‌ను పొందుపరిచారు. 10,000 ఆర్పీఎంతో 18.5 పీఎస్, 13.9 ఎన్ఎం టార్క్ ఉంది. సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్, సింగిల్ చానల్ ఏబీఎస్, వేరియబుల్ వాల్వ్ యాక్చువేషన్ సిస్టమ్ వంటి హంగులు ఉన్నాయి. -
టూ వీలర్ తర్వాత వచ్చే కొత్త మోడల్ బైక్స్ ఇవేనా
పెద్ద పెద్ద కంపెనీలు త్రీ–వీలర్ మోటర్సైకిల్స్పై దృష్టి సారించాయి. ‘యమహా’ కూడా ఇదే దారిలో నడుస్తుంది. త్రీ–వీలర్ స్కూటర్ డిజైన్ కోసం ఎప్పుడో పేటెంట్‌ను రిజిస్టర్ చేయించింది. నెక్ట్స్ జెనరేషన్ పర్సనల్ మొబిలిటీ కాన్సెప్ట్‌లో భాగంగా మల్టీ–వీల్ టెక్నాలజీతో రకరకాల మోడల్స్‌కు రూపకల్పన చేసింది. ఇక్కడ మీరు చూస్తున్నది ‘యమహా ఎండబ్ల్యూ–విజన్’ మోడల్. -
స్టైలిష్ లుక్‌తో కట్టిపడేస్తున్న 'యమహా'
సాక్షి,వెబ్‌డెస్క్: యమహా ఇండియా నియో రెట్రో కమ్యూటర్ కు చెందిన 149సీసీ యమహా ఎఫ్‌జెడ్ సిరీస్ బైక్ విడుదలైంది. స్టైలిష్ లుక్‌తో ‘యమహా ఎఫ్-ఎక్స్’ ఈ బైక్ రెండు వేరియంట్లతో బైక్ లవర్స్‌ను అలరించనుంది. ధర : రెండు వేరియంట్లలోఇది లభ్యం. ప్రారంభ ధర రూ.1,16,800గా ఉండగా, స్మార్ట్‌ఫోన్ సాయంతో కనెక్ట్ చేయగలిగే ఫీచర్ బైక్ ధర రూ.1,19,800గా కంపెనీ నిర్ణయించింది. 'వై కనెక్ట్' యాప్ ద్వారా ఇన్ కమింగ్ కాల్ నోటిఫికేషన్లు, ఎస్ఎంస్ అలెర్ట్, బ్యాటరీ ఛార్జింగ్, ఇంధన వినియోగం, పనిచేయని పక్షంలో అలర్ట్స్ అలాగే పనితీరు, ఆయిల్ మార్చేలా సలహాలతో పాటు మరెన్నో ఫీచర్స్ ఈ బైక్ సొంతం. ఈ కొత్త యమహా ఎఫ్‌జెడ్ -ఎక్స్ అమ్మకాలు జూన్ నుండి ప్రారంభం కానున్నాయి. ఫీచర్ల విషయానికొస్తే ఇంజిన్ బాష్ ప్లేట్‌తో నిటారుగా రైడింగ్ పొజిషన్, ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఎల్ఈడి టైలైట్లు,149 సీసీ ఇంజిన్, 7,250 ఆర్పీఎం వద్ద 12.4 పవర్‌ను అందిస్తుంది 500 ఆర్‌పిఎమ్ 13.3 ఎన్ఎమ్. ఫ్రేమ్ యమహా ఎఫ్ జెడ్ డిజైన్ లాగే ఉంది. ఇక దీని బరువు 139 కిలోలుగా ఉంది. చదవండి: Tesla: భారత్‌లో రయ్..రయ్ : వైరల్ వీడియో -
అదిరిపోయిన యమహా ఎలక్ట్రిక్ స్కూటర్
యమహా ఈ01 ఎలక్ట్రిక్ స్కూటర్ గుర్తుందా? జపనీస్ ద్విచక్ర వాహన తయారీ దారి దిగ్గజం కొన్ని సంవత్సరాల క్రితం టోక్యో మోటార్ షోలో 2019 ఎడిషన్ సందర్భంగా ఈ బైక్ ప్రోటో టైపుని విడుదల చేసి ఆశ్చర్య పరిచింది. సుదీర్ఘ కాలం నిరీక్షణ తర్వాత ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీకి సిద్దం అవుతుంది. యమహా మోటార్ త్వరలో తీసుకురాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ నమూనాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుందని సమాచారం. ఈ ఏడాది ప్రారంభంలో యమహా ఈ01 ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం కంపెనీ పేటెంట్లను కూడా దాఖలు చేసిన మాట వాస్తవం. లీకైన యమహా ఎలక్ట్రిక్ స్కూటర్ పేటెంట్ చిత్రాలను పరిశీలిస్తే సూపర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాగా ఉంది. డిజైన్ పరంగా అన్నీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కంటే చాలా బాగుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చిత్రాలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. దీని ముందు భాగంలో పెద్ద హెడ్‌ల్యాంప్, వెనుక భాగంలో స్ట్రీమ్లైన్డ్ డిజైన్ వంటివి దీన్ని ప్రీమియం స్కూటర్‌గా నిలుపుతాయి. ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. యమహా రాబోయే ఈ–స్కూటర్లో ఆల్-ఎల్ఈడి లైటింగ్ సెటప్, ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైన వాటిని అందిస్తుంది. ఇక్కడ గమనించదగ్గ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దీని బ్యాటరీని రైడర్ లెగ్స్ మధ్యలో చేర్చారు. ఇక స్కూటర్ మోటారును బ్యాటరీ వెనుక అమర్చారు. ఇవి డిస్క్ బ్రేక్‌లను కూడా కలిగి ఉంటాయి. E01 ఎలక్ట్రిక్ స్కూటర్ రిటైల్ కోసం ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనే విషయంపై యమహా స్పష్టతనివ్వలేదు. అంతర్జాతీయ మార్కెట్(ల)లో స్కూటర్ ప్రారంభించబడటానికి ఎక్కువ సమయం పట్టదని అంచనా. నిజంగా చెప్పాలంటే, రాబోయే దశాబ్ద కాలం మాత్రం ఇండియాదే అనిపిస్తుంది. భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల రోజు రోజుకి పెరిగిపోతుంది. చదవండి: రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధర -
మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్స్.. ఆధునీకరించిన జడ్ఎస్ ఎలక్ట్రిక్ వెహికిల్‌ను రెండు వేరియంట్లలో ప్రవేశపెట్టింది. ఇందులోని 44.5 కిలోవాట్ అవర్ బ్యాటరీతో ఒకసారి చార్జీ చేస్తే 419 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. 143 పీఎస్ పవర్, 350 ఎన్ఎం టార్క్, 8.5 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం అందుకోవడం దీని ప్రత్యేకత. ఎంజీ కొత్త జడ్ఎస్ ఎలక్ట్రిక్ వెహికిల్ పనోరమిక్ సన్‌రూఫ్, 17 అంగుళాల అలాయ్ వీల్స్, పీఎం 2.5 ఎయిర్ ఫిల్టర్ ఏర్పాటు ఉంది. 31 నగరాల్లో బుకింగ్స్‌కు జడ్ఎస్ 2021 వర్షన్ అందుబాటులో ఉంది. వినియోగదార్లకు మెరుగైన అనుభూతి కొరకు దేశంలో పెద్ద ఎత్తున చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఎంజీ మోటార్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రాజీవ్ చాబ ఈ సందర్భంగా తెలిపారు. ప్రారంభ ధర ఢిల్లీ ఎక్స్‌షోరూంలో రూ.20.99 లక్షలు. జాగ్వార్ ఐ-పేస్ వాహన తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ మార్చి 9న జాగ్వార్ ఐ-పేస్ మోడల్‌ను భారత్‌లో ప్రవేశపెడుతోంది. ప్రపంచంలో తొలి ప్రీమియం పూర్తి ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారు ఇదేనని కంపెనీ అంటోంది. వాహనానికి 90 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీని పొందుపరిచారు. 696 ఎన్ఎం టార్క్, 4.8 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం అందుకోవడం దీని ప్రత్యేకత. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. 80కిపైగా అంతర్జాతీయ అవార్డులను ఈ కారు సొంతం చేసుకుంది. వీటిలో 2019లో అందుకున్న వరల్డ్ కార్ ఆఫ్ ద ఇయర్, వరల్డ్ గ్రీన్ కార్ ఆఫ్ ద ఇయర్, వరల్డ్ కార్ డిజైన్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు ఉన్నాయి. ఆఫీస్, హోం చార్జింగ్ సొల్యూషన్స్ కోసం టాటా పవర్‌తో కంపెనీ చేతులు కలిపింది. యమహా ఎఫ్‌జెడ్ మోటర్‌సైకిల్స్ కొత్త శ్రేణి జపాన్ ద్విచక్ర వాహనాల దిగ్గజం యమహా తాజాగా తమ ఎఫ్‌జెడ్ మోటర్‌సైకిల్స్ సిరీస్‌లో కొత్త శ్రేణిని ఆవిష్కరించింది. వీటి ధర రూ. 1,03,700 నుంచి (ఢిల్లీ ఎక్స్‌షోరూం) ప్రారంభమవుతుంది. కొత్త ఎఫ్‌జెడ్ సిరీస్‌లో ఎఫ్‌జెడ్ ఎఫ్ఐ, ఎఫ్జెడ్ఎస్, ఎఫ్ఐ మోడల్స్ ఉన్నాయి. బీఎస్6 ఇంజిన్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కటాఫ్ స్విచ్, ఏబీఎస్ (యాంటీ–లాక్ బ్రేకింగ్ సిస్టం), ఎల్ఈడీ హెడ్‌లైట్ వంటి ఫీచర్లతో ఇవి తేలికగా ఉంటాయని సంస్థ తెలిపింది. మోటర్‌సైకిల్ బరువును 137 కేజీల నుంచి 135 కేజీలకు తగ్గించినట్లు వివరించింది. ధర రూ. 1,03,700 నుంచి ప్రారంభం -
అమెజాన్‌తో జట్టు కట్టిన యమహా
న్యూఢిల్లీ: దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటార్ ప్రముఖ ఈ–కామర్స్ కంపెనీ అమెజాన్‌తో ఒప్పందం చేసుకుంది. దీంతో కస్టమర్లు యమహా ఇండియా టీషర్ట్స్, జాకెట్స్, స్టిక్కర్స్, కీచెయిన్స్ వంటి ఇతరత్రా యాక్ససరీలను అమెజాన్ ఇండియాలో కొనుగోలు చేయవచ్చు. ఒక మోటార్ కంపెనీ అపెరల్స్, యాక్ససరీలను ఆన్లైన్లో విక్రయించే ఒప్పందం చేసుకోవటం దేశంలోనే తొలిసారని యమహా మోటార్ ఇండియా గ్రూప్ చైర్మన్ మోటోఫుమీ శిటారా ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవలే యమహా కంపెనీ ఆన్లైన్లో వాహన విక్రయాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే.