సాక్షి, ముంబై: యమహా మోటార్ ఇండియా కొత్త స్కూటర్లను అప్‌డేటెడ్‌గా తీసుకొచ్చింది. 125 సీసీ స్కూటర్ లైనప్‌ను 2023 వర్షెన్లను లాంచ్ చేసింది. 2023 Yamaha Fascino, Ray ZR 125, RayZR స్ట్రీట్ ర్యాలీలను తీసుకొచ్చింది. కస్టమర్లను ఆకట్టుకునేలా కొత్త కలర్ స్కీమ్‌లు, అప్‌డేటెడ్ ఇంజన్ , కొత్త ఫీచర్లతో వీటిని తీసుకొచ్చింది. భారతదేశంలో రూ. 89,530, ఎక్స్-షోరూమ్ ధరలతో ప్రారంభం.
2023 యమహా ఫాసినో 125 ఎక్స్‌షోరూం ధర రూ. 91,030గా ఉంది. రే జెడ్ఆర్ 125 ఫై హైబ్రీడ్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 89,530గా ఉంది. అలాగే రేయ్ జెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ఎక్స్-షోరూమ్ ధర రూ. 93,530గా ఉంది.
ఫాసినో 125 డిస్క్ వేరియంట్, రేయ్ జెడ్ఆర్ 125 స్కూటర్లరు డార్క్ మ్యాట్ బ్లూ కలర్‌లోనూ, రేయ్ జెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ కొత్త మ్యాట్ బ్లాక్ & లైట్ గ్రే వెర్మిలియన్ పెయింట్ స్కీమ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ స్కూటర్‌లు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తోపాటు, ఒకత్తగా బ్లూటూత్-ఎనేబుల్ చేయబడిన మై-కనెక్ట్ యాప్‌కి కనెక్ట్ చేసింది. ఫ్యూయెల్ కన్జమ్షన్ ట్రాకర్, మెయిన్టేనెన్స్ రికమెండేషన్, లాస్ట్ పార్కింగ్ లొకేషన్, మాల్ఫంక్షన్ నోటిఫికేషన్, రివర్స్ డాష్‌బోర్డ్, రైడర్ ర్యాంకింగ్ లాంటి ఫీచర్లు ప్రధానంగా ఉన్నాయి.
ఇంజీన్
125 సీసీ బ్లూ కోర్ ఇంజిన్ 6,500 ఆర్పీఎం వద్ద 8.2 పీఎస్ పవర్‌ను, 5000 ఆర్పీఎం వద్ద 10.3 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. హైబ్రీడ్ ఇంజిన్‌లో స్మార్ట్ మోటార్ జనరేటర్ సిస్టెమ్ కూడా ఉంటుంది. ఇంకా ఓబీడీఐ2, ఈ-20 ఫ్యూయెల్ కంప్లైంట్ బీఎస్6, ఎయిర్- కూల్డ్ ఫ్యూయెల్ ఇంజక్షన్ (ఎఫ్ఐ) కొత్త వెర్షన్ ప్రత్యేకతలుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment