Updated versions
-
Yamaha 2023 కొత్త స్కూటర్లు చూశారా...అదిరే లుక్స్‌లో వచ్చేశాయ్!
సాక్షి, ముంబై: యమహా మోటార్ ఇండియా కొత్త స్కూటర్లను అప్డేటెడ్గా తీసుకొచ్చింది. 125 సీసీ స్కూటర్ లైనప్‌ను 2023 వర్షెన్లను లాంచ్ చేసింది. 2023 Yamaha Fascino, Ray ZR 125, RayZR స్ట్రీట్ ర్యాలీలను తీసుకొచ్చింది. కస్టమర్లను ఆకట్టుకునేలా కొత్త కలర్ స్కీమ్‌లు, అప్డేటెడ్ ఇంజన్ , కొత్త ఫీచర్లతో వీటిని తీసుకొచ్చింది. భారతదేశంలో రూ. 89,530, ఎక్స్-షోరూమ్ ధరలతో ప్రారంభం. 2023 యమహా ఫాసినో 125 ఎక్స్‌షోరూం ధర రూ. 91,030గా ఉంది. రే జెడ్ఆర్ 125 ఫై హైబ్రీడ్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 89,530గా ఉంది. అలాగే రేయ్ జెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ఎక్స్-షోరూమ్ ధర రూ. 93,530గా ఉంది. ఫాసినో 125 డిస్క్ వేరియంట్, రేయ్ జెడ్ఆర్ 125 స్కూటర్లరు డార్క్ మ్యాట్ బ్లూ కలర్‌లోనూ, రేయ్ జెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ కొత్త మ్యాట్ బ్లాక్ & లైట్ గ్రే వెర్మిలియన్ పెయింట్ స్కీమ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ స్కూటర్లు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తోపాటు, ఒకత్తగా బ్లూటూత్-ఎనేబుల్ చేయబడిన మై-కనెక్ట్ యాప్‌కి కనెక్ట్ చేసింది. ఫ్యూయెల్ కన్జమ్షన్ ట్రాకర్, మెయిన్టేనెన్స్ రికమెండేషన్, లాస్ట్ పార్కింగ్ లొకేషన్, మాల్ఫంక్షన్ నోటిఫికేషన్, రివర్స్ డాష్‌బోర్డ్, రైడర్ ర్యాంకింగ్ లాంటి ఫీచర్లు ప్రధానంగా ఉన్నాయి. ఇంజీన్ 125 సీసీ బ్లూ కోర్ ఇంజిన్ 6,500 ఆర్పీఎం వద్ద 8.2 పీఎస్ పవర్‌ను, 5000 ఆర్పీఎం వద్ద 10.3 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. హైబ్రీడ్ ఇంజిన్‌లో స్మార్ట్ మోటార్ జనరేటర్ సిస్టెమ్ కూడా ఉంటుంది. ఇంకా ఓబీడీఐ2, ఈ-20 ఫ్యూయెల్ కంప్లైంట్ బీఎస్6, ఎయిర్- కూల్డ్ ఫ్యూయెల్ ఇంజక్షన్ (ఎఫ్ఐ) కొత్త వెర్షన్ ప్రత్యేకతలుగా ఉన్నాయి. -
Jaguar Land Rover: మార్కెట్లోకి నయా రేంజ్ రోవర్ వర్షన్
ముంబై: జేఎల్ఆర్ ఇండియా మంగళవారం తన రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్వీఆర్ అప్డేటెడ్ వెర్షన్ కారును విడుదల చేసింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం వద్ద కొత్త కారు ధర రూ.2.19 కోట్లుగా ఉంది. ఈ ఎస్‌యూవీలో అత్యంత శక్తివంతమైన సూపర్ చార్జ్డ్ వీ8 పెట్రోల్ ఇంజిన్ వినియోగించారు. ఇది 423 కిలోవాట్ల సామర్థ్యాన్ని, 700 ఎన్ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ స్పోర్ట్ కారు 4.5 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 283 కిలోమీటర్ల వేగం ప్రయాణిస్తుంది. ఈ కారును బ్రిటన్‌లో తయారు చేసి, అక్కడి నుండి సీబీయూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూపంలో భారతదేశానికి దిగుమతి చేసుకుంటారు. ఇందులో డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ–లాక్ బ్రేకింగ్ సిస్టమ్, 360 డిగ్రీల కెమెరాతో సహా అనేక ఫీచర్లు ఉన్నాయి. బ్రిటిష్ ఇంజనీరింగ్ అండ్ డిజైనింగ్ ప్రమాణాలకు అనుగుణంగా ఈ మోడల్ రూపొందించామని జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా ఎండీ రోహిత్ సూరి తెలిపారు. లగ్జరీ కార్ల విభాగంలో ఈ కారుకు మంచి డిమాండ్ లభిస్తుందని సూరీ ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: Airtel: స్పేస్ స్టార్టప్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకున్న ఎయిర్టెల్ -
యాపిల్ ఐఫోన్ 6ఎస్ వచ్చింది..
కాలిఫోర్నియా: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తాజాగా మరిన్ని ఉత్పత్తులను, ఇప్పుడున్న వాటికి అప్డేటెడ్ వెర్షన్లను ఆవిష్కరించింది. కొత్తగా ఐఫోన్‌కి సంబంధించి 6 ఎస్, 6 ఎస్ ప్లస్ వెర్షన్లను ప్రవేశపెట్టింది. ఇవి సిల్వర్, గోల్డ్, స్పేస్ గ్రే, రోజ్ గోల్డ్ రంగుల్లో లభిస్తాయని కంపెనీ తెలిపింది. 3డీ టచ్, అయాన్ ఎక్స్ గ్లాస్ డిస్ప్లే తదితర ఫీచర్లు ఇందులో ఉంటాయి. మిగతా కొత్త ఉత్పత్తుల్లో ఐప్యాడ్ ప్రో, ఏ9ఎక్స్ ప్రాసెసర్ మొదలైనవి ఉన్నాయి. ఐప్యాడ్ ప్రో 12.9 అంగుళాలు ఉంటుంది. దీనికోసం కొత్తగా పెన్సిల్ పేరిట స్టైలస్‌ను కూడా ఆవిష్కరించింది. ఐప్యాడ్ ప్రో ధర అమెరికాలో 799-1,079 డాలర్లు, స్టైలస్ ధర 99 డాలర్లు, స్మార్ట్ కీబోర్డు 169 డాలర్లుగాను ఉండనుంది. 7.9 అంగుళాల ఐప్యాడ్ మినీ4నూ యాపిల్ ఆవిష్కరించింది. దీని ధర 399 డాలర్లు. ఇన్‌బిల్ట్ మైక్ గల టచ్‌స్క్రీన్ రిమోట్‌తో సరికొత్త యాపిల్ టీవీని కంపెనీ సీఈవో టిమ్ కుక్ ప్రవేశపెట్టారు.