యాపిల్ ఐఫోన్ 6ఎస్ వచ్చింది.. | Apple iPhone 6 S Came | Sakshi
Sakshi News home page

యాపిల్ ఐఫోన్ 6ఎస్ వచ్చింది..

Published Thu, Sep 10 2015 1:10 AM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM

యాపిల్ ఐఫోన్ 6ఎస్ వచ్చింది.. - Sakshi

యాపిల్ ఐఫోన్ 6ఎస్ వచ్చింది..

కాలిఫోర్నియా: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తాజాగా మరిన్ని ఉత్పత్తులను, ఇప్పుడున్న వాటికి అప్‌డేటెడ్ వెర్షన్లను ఆవిష్కరించింది. కొత్తగా ఐఫోన్‌కి సంబంధించి 6 ఎస్, 6 ఎస్ ప్లస్ వెర్షన్లను ప్రవేశపెట్టింది. ఇవి సిల్వర్, గోల్డ్, స్పేస్ గ్రే, రోజ్ గోల్డ్ రంగుల్లో లభిస్తాయని కంపెనీ తెలిపింది. 3డీ టచ్, అయాన్ ఎక్స్ గ్లాస్ డిస్‌ప్లే తదితర ఫీచర్లు ఇందులో ఉంటాయి. మిగతా కొత్త ఉత్పత్తుల్లో ఐప్యాడ్ ప్రో, ఏ9ఎక్స్ ప్రాసెసర్ మొదలైనవి ఉన్నాయి. ఐప్యాడ్ ప్రో 12.9 అంగుళాలు ఉంటుంది. దీనికోసం కొత్తగా పెన్సిల్ పేరిట స్టైలస్‌ను కూడా ఆవిష్కరించింది. ఐప్యాడ్ ప్రో ధర అమెరికాలో 799-1,079 డాలర్లు, స్టైలస్ ధర 99 డాలర్లు, స్మార్ట్ కీబోర్డు 169 డాలర్లుగాను ఉండనుంది. 7.9 అంగుళాల ఐప్యాడ్ మినీ4నూ యాపిల్ ఆవిష్కరించింది. దీని ధర 399 డాలర్లు. ఇన్‌బిల్ట్ మైక్  గల టచ్‌స్క్రీన్ రిమోట్‌తో సరికొత్త యాపిల్ టీవీని కంపెనీ సీఈవో టిమ్ కుక్ ప్రవేశపెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement