ముంబై: జేఎల్‌ఆర్ ఇండియా మంగళవారం తన రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌వీఆర్ అప్‌డేటెడ్ వెర్షన్ కారును విడుదల చేసింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం వద్ద కొత్త కారు ధర రూ.2.19 కోట్లుగా ఉంది. ఈ ఎస్‌యూవీలో అత్యంత శక్తివంతమైన సూపర్ చార్జ్‌డ్ వీ8 పెట్రోల్ ఇంజిన్ వినియోగించారు. ఇది 423 కిలోవాట్ల సామర్థ్యాన్ని, 700 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ స్పోర్ట్ కారు 4.5 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
గరిష్టంగా గంటకు 283 కిలోమీటర్ల వేగం ప్రయాణిస్తుంది. ఈ కారును బ్రిటన్‌లో తయారు చేసి, అక్కడి నుండి సీబీయూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూపంలో భారతదేశానికి దిగుమతి చేసుకుంటారు. ఇందులో డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ–లాక్ బ్రేకింగ్ సిస్టమ్, 360 డిగ్రీల కెమెరాతో సహా అనేక ఫీచర్లు ఉన్నాయి.
బ్రిటిష్ ఇంజనీరింగ్ అండ్ డిజైనింగ్ ప్రమాణాలకు అనుగుణంగా ఈ మోడల్ రూపొందించామని జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా ఎండీ రోహిత్ సూరి తెలిపారు. లగ్జరీ కార్ల విభాగంలో ఈ కారుకు మంచి డిమాండ్ లభిస్తుందని సూరీ ఆశాభావం వ్యక్తం చేశారు.
చదవండి: Airtel: స్పేస్ స్టార్టప్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకున్న ఎయిర్‌టెల్
Comments
Please login to add a commentAdd a comment