Range Rover Sport
-
Jaguar Land Rover: మార్కెట్లోకి నయా రేంజ్ రోవర్ వర్షన్
ముంబై: జేఎల్ఆర్ ఇండియా మంగళవారం తన రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్వీఆర్ అప్డేటెడ్ వెర్షన్ కారును విడుదల చేసింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం వద్ద కొత్త కారు ధర రూ.2.19 కోట్లుగా ఉంది. ఈ ఎస్‌యూవీలో అత్యంత శక్తివంతమైన సూపర్ చార్జ్డ్ వీ8 పెట్రోల్ ఇంజిన్ వినియోగించారు. ఇది 423 కిలోవాట్ల సామర్థ్యాన్ని, 700 ఎన్ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ స్పోర్ట్ కారు 4.5 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 283 కిలోమీటర్ల వేగం ప్రయాణిస్తుంది. ఈ కారును బ్రిటన్‌లో తయారు చేసి, అక్కడి నుండి సీబీయూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూపంలో భారతదేశానికి దిగుమతి చేసుకుంటారు. ఇందులో డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ–లాక్ బ్రేకింగ్ సిస్టమ్, 360 డిగ్రీల కెమెరాతో సహా అనేక ఫీచర్లు ఉన్నాయి. బ్రిటిష్ ఇంజనీరింగ్ అండ్ డిజైనింగ్ ప్రమాణాలకు అనుగుణంగా ఈ మోడల్ రూపొందించామని జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా ఎండీ రోహిత్ సూరి తెలిపారు. లగ్జరీ కార్ల విభాగంలో ఈ కారుకు మంచి డిమాండ్ లభిస్తుందని సూరీ ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: Airtel: స్పేస్ స్టార్టప్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకున్న ఎయిర్టెల్ -
రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ లాంచ్.. ధర ఎంత
సాక్షి,ముంబై: టాటా మోటార్స్ సొంతమైన ల్యాండ్ రోవర్ ఇండియా తన పాపులర్ వేరియంట్లో కొత్త ఎస్‌యూవీలను లాంచ్ చేసింది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా లిమిటెడ్ (జె.ఎల్.ఆర్.ఐ.ఐ.ఐ.ఐ) తన రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ 2018 మోడళ్లను విడుదల చేసింది. బుధవారం వీటిని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. క్లామ్ షోల్ బోయినెట్, ఆల్ న్యూ ఫ్రంట్ గిల్లే , పిక్సెల్ లేజర్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ లాంటి అప్‌గ్రేడ్ ఫీచర్స్‌తో వీటిని లాంచ్ చేసింది. రేంజ్ రోవర్ డీజిల్ వేరియంట్ ప్రారంభ ధర 1.74కోట్ల రూపాయిలు. గరిష్ట ధర 3.76కోట్లు, పెట్రోల్ వేరియంట్ ధర రూ.1.87 కోట్ల నుంచి, రూ. 3.88కోట్ల మధ్య ఉంటుందని కంపెనీ తెలిపింది. రేంజ్ రోవర్ స్పోర్ట్ డీజిల్ వేరియంట్ ప్రారంభ ధర రూ .99.48 లక్షలు, గరిష్ట ధర రూ. 1.43 కోట్లుగా ఉంది. అదే పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర 1.1003 కోట్లు, గరిష్టంగా 1.96 కోట్లరూపాయలుగా ఉండనుంది. 2018 రేంజ్ రోవర్ మోడల్ ఎస్‌యూవీలు గ్జరీ, సామర్ధ్యం, టెక్నాలజీలోని అందించడం లో ల్యాండ్ రోవర్ వారసత్వాన్ని కొనసాగిస్తుందని, కంపెనీ ప్రెసిడెంట్ , మేనేజింగ్ డైరెక్టర్, రోహిత్ సూరి తెలిపారు. ల్యాండ్ రోవర్ వాహనాలు భారతదేశంలో 27 అధికారిక కేంద్రాల ద్వారా అందుబాటులో ఉన్నాయి. -
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన రేంజ్ రోవర్
-
జోరుగా జేఎల్ఆర్ అమ్మకాలు
అంతర్జాతీయ అమ్మకాలు 20 శాతం వృద్ధి న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) అంతర్జాతీయ అమ్మకాలు 20 శాతం పెరిగాయి. జాగ్వార్ బ్రాండ్ అమ్మకాలు 4 శాతం వృద్ధితో 6,450కు, ల్యాండ్ రోవర్ అమ్మకాలు 23 శాతం వృద్ధితో 32,381కు పెరిగాయని జేఎల్ఆర్ గ్రూప్ డెరైక్టర్ (సేల్స్ ఆపరేషన్స్) ఆండీగాస్ తెలిపారు. మొత్తం మీద జేఎల్ఆర్ అమ్మకాలు 20 శాతం వృద్ధితో 38,831కు చేరాయని పేర్కొన్నారు. జేఎల్ఆర్ అమ్మకాలు చైనాలో 53 శాతం, ఉత్తర అమెరికాలో 19 శాతం, ఇంగ్లాండ్‌లో 15 శాతం, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 11 శాతం, యూరప్‌లో 8 శాతం చొప్పున వృద్ధి సాధించాయని వివరించారు. జాగ్వార్ మోడళ్లలో ఎఫ్-టైప్ కన్వర్టిబుల్, కూప్ మోడళ్లు, ల్యాండ్ రోవర్ మోడళ్లలో రేంజ్ రోవర్ స్పోర్ట్, ఇవోక్లు మంచి అమ్మకాలు సాధిస్తున్నాయని గాస్ పేర్కొన్నారు.