
Jaguar Land Rover Defender 90 ముంబై: జాగ్వార్ ల్యాండ్ రోవర్ తన ఎస్‌యూవీ డిఫెండర్ 90 విక్రయాలను ప్రారంభించింది. గురువారం నుంచి అమ్మకాలు మొదలుపెట్టినట్లు ఒక ప్రకటనలో కంపెనీ తెలిపింది.
కారు ధర రూ.76.57 లక్షలుగా ఉంది. ఈ ఎస్‌యూవీ మూడు ఇంజిన్ ఆప్షన్లలో వస్తుంది. ఆరు సీట్ల సామర్థ్యం ఉంది. ‘‘గతేడాది మార్కెట్లోకి వచ్చిన డిఫెండర్ 110 మోడల్‌కు డిమాండ్ కొనసాగుతుంది. ఇప్పుడు డిఫెండర్ 90 విడుదలతో ల్యాండ్ రోవర్ బ్రాండ్ మరింత ఆకర్షణీయంగా మారుతుంది’’ అని జేఎల్‌ఆర్ విభాగపు ఎండీ రోహిత్ తెలిపారు.