యమహా ఆర్15ఎం: ఇప్పుడు కొత్త హంగులతో.. | Yamaha R15M Launched in India | Sakshi
Sakshi News home page

యమహా ఆర్15ఎం: ఇప్పుడు కొత్త హంగులతో..

Published Sat, Sep 14 2024 6:15 PM | Last Updated on Sat, Sep 14 2024 7:38 PM

Yamaha R15M Launched in India

జపనీస్ టూ వీలర్ బ్రాండ్ యమహా.. దేశీయ విఫణిలో కొత్త ఫీచర్లతో, కొత్త కలర్ ఆప్షన్‌ కలిగిన 'ఆర్15ఎం' బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ మెటాలిక్ గ్రే, ఐకాన్ పెర్ఫార్మెన్స్ అనే కొత్త కలర్ స్కీమ్ పొందుతుంది. వీటి ధరలు వరుసగా రూ. 1.98 లక్షలు, రూ. 2.08 లక్షలు (ఎక్స్ షోరూమ్).

యమహా ఆర్15ఎం బైక్ కార్బన్ ఫైబర్ గ్రాఫిక్స్‌తో చాలా కొత్తగా కనిపిస్తుంది. ఇందులోని ఫ్రంట్ కౌల్, సైడ్ ఫెయిరింగ్, రియర్ ఫెండర్ వంటివి అప్డేట్స్ పొందుతాయి. అంతే కాకుండా బ్లాక్ అవుట్ ఫ్రంట్ ఫెండర్, ఫ్యూయల్ ట్యాంక్‌పై కొత్త గ్రాఫిక్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ బైకుకు మరింత ప్రీమియంగా కనిపించేలా చేస్తాయి.

అప్డేటెడ్ యమహా ఆర్15ఎం బైక్ టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో పాటు మ్యూజిక్ అండ్ వాల్యూమ్ కంట్రోల్‌ వంటివి పొందుతుంది. అయితే వీటన్నింటినీ స్మార్ట్‌ఫోన్ ద్వారా యమహా వై-కనెక్ట్ యాప్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు.

ఇదీ చదవండి: ఫోర్డ్ కంపెనీ మళ్ళీ ఇండియాకు: ఎందుకంటే?    

ఇందులో 155 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 18.4 బీహెచ్‌పీ పవర్, 14.2 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ పొందుతుంది. కాబట్టి ఉత్తమ పర్ఫామెన్స్ ఆశించవచ్చు. ఈ బైక్ యూఎస్డీ ఫోర్క్ సెటప్, మోనోషాక్ వంటివి పొందుతుంది. రెండు చివర్లలో డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కూడా లభిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement