
కిర్రాక్ ..యమహ త్రీవీలర్
బైక్ పై ప్రయాణించేటప్పుడు ఎండలో ఎండొద్దు...వానలో తడవద్దు అనుకుంటున్నారా..? అయితే మీకోసం లేటెస్ట్ బైక్ ను జపనీస్ టూవీలర్ దిగ్గజం యమహ ఆవిష్కరించింది. ఇది టూవీలర్ బైక్ కాదండోయ్. త్రీవీలర్ వెహికిలట. 05జెన్ పేరుతో ఈ కిర్రాక్ త్రీవీలర్ వెహికిల్ కాన్సెప్ట్ ను యమహ మార్కెట్లోకి విడుదల చేసింది. ఎలక్ట్రిక్ అసిస్ట్ టెక్నాలజీతో డిజైన్ చేసిన ఈ బైక్... మొదట తక్కువ దూరం ప్రయాణాలకు బాగా కవర్ చేస్తుందట. ఈ బైక్ చూడటానికే కాదు.. డ్రైవింగ్ లో కూడా ఇప్పటివరకున్న బైక్ లకు వినూత్నమైన అనుభవాన్ని కల్పిస్తుందని కంపెనీ చెబుతోంది.
స్పోర్ట్స్ కంపాక్ట్ బాడీ, రూఫ్ డిజైన్ ఓపెనెస్ ఫీలింగ్ కల్పిస్తూ హాయిగా డ్రైవింగ్ కు సహకరించనున్నాయట. వర్షం, ఎండ నుంచి కాపాడుతూ.. బయటి వారితో కూడా సంభాషించేందుకు వీలుగా దీన్ని డిజైన్ చేశారు.
దీంతో పాటు మరో ఫోర్ వీలర్ మొబిలిటీ వెహికిల్ 06జెన్ పేరుతో యమహ డిజైన్ చేసింది. ఇది చూడటానికి ఓ చిన్న సైజు కారులా ఉన్నా.. కారు మాత్రం కాదు. ఒక రౌండ్ టేబుల్ మాదిరిలా ఉంటూ డ్రైవింగ్ లో జోయ్ ఫీలింగ్ ను కల్పిస్తుందని యమహ చెబుతోంది. ఇది కారు లాగా పూర్తిగా మూసినట్టు.. బైక్ లాగా పూర్తిగా తెరిచినట్టుగా స్పెషల్ గా దీన్ని డిజైన్ చేసింది. ఈ రెండు బైక్ లను జూలై 2, 3న జరుగునున్న ఒమిషిమాలో ఇమబరీ టోయో ఇటో ఆర్కిటెక్చర్ మ్యూజియం రెన్యూవల్ ఓపెన్ ఈవెంట్, టాక్ ఈవెంట్ లో యమహ వీటిని డిస్ ప్లే చేయనుంది.