భారత్‌లో జపనీస్ బ్రాండ్ స్కూటర్ లాంచ్ - ధర ఎంతో తెలుసా? | Sakshi
Sakshi News home page

భారత్‌లో జపనీస్ బ్రాండ్ స్కూటర్ లాంచ్ - ధర ఎంతో తెలుసా?

Published Mon, Jun 10 2024 8:32 PM

Yamaha New Fascino S launched in India

జపనీస్ టూ వీలర్ తయారీ సంస్థ యమహా దేశీయ మార్కెట్లో 'ఫాసినో ఎస్' వేరియంట్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ లేటెస్ట్ స్కూటర్ ధర ధర రూ. 93730 (ఎక్స్ షోరూమ్). ఈ కొత్త స్కూటర్ ఇప్పుడు అప్డేటెడ్ ఫీచర్లతో వస్తుంది. ఇందులో ఆన్సర్ బ్యాక్ అనే ఫైండ్ మై స్కూటర్ యాప్ కూడా ఉంది.

యమహా ఫాసినో ఎస్ వేరియంట్ 125 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8.2 హార్స్ పవర్ మరియు 10.3 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని బరువు కేవలం 99 కేజీలు మాత్రమే. ఇది 21 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ పొందుతుంది.

యమహా ఫాసినో ఇప్పుడు డ్రమ్, డిస్క్, ఎస్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 79900, రూ. 91130, రూ. 93730 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). ఈ స్కూటర్ దేశీయ మార్కెట్లో సుజుకి యాక్సెస్ 125, హోండా యాక్టివా 125, టీవీఎస్ జుపీటర్ 125, యమహా రే జెడ్ఆర్ 125 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement