![Yamaha MT-15 Monster Energy MotoGP edition - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/24/YAMAHA-MT-15.jpg.webp?itok=30ti_lbh)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ యమహా.. ఎంటీ15 మాన్‌స్టర్ ఎనర్జీ యమహా మోటోజీపీ ఎడిషన్ బైక్‌ను ప్రవేశపెట్టింది. ధర ఢిల్లీ ఎక్స్‌షోరూంలో రూ.1.48 లక్షలు. ఫ్యూయల్ ట్యాంక్‌పై యమహా మోటోజీపీ బ్రాండింగ్ ఉంటుంది. 155 సీసీ, ఫ్యూయల్ ఇంజెక్టెడ్, లిక్విడ్ కూల్డ్, 4 స్ట్రోక్, ఎస్‌వోహెచ్‌సీ, 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో 4 వాల్వ్ ఇంజన్‌ను పొందుపరిచారు. 10,000 ఆర్‌పీఎంతో 18.5 పీఎస్, 13.9 ఎన్‌ఎం టార్క్ ఉంది. సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్, సింగిల్ చానల్ ఏబీఎస్, వేరియబుల్ వాల్వ్ యాక్చువేషన్ సిస్టమ్ వంటి హంగులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment