ప్రముఖ బైక్ అండ్ స్కూటర్ తయారీ సంస్థ యమహా తన నియో ఎలక్ట్రిక్ స్కూటర్‌ని అప్డేట్ చేసింది. ఈ 2023 మోడల్ అంతర్జాతీయ మార్కెట్లో అధికారికంగా అరంగేట్రం చేసింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ గురించి మరిన్ని అప్డేటెడ్ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
యమహా కంపెనీ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు కొత్త కలర్ స్కీమ్ పొందుతుంది, కావున చూడటానికి దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఆధునికంగా ఉంటుంది. ఇందులోని స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ డిఆర్ఎల్ వంటివి అద్భుతంగా పనిచేస్తాయి. అయితే వెనుక భాగంలో టెయిల్ లాంప్ మాత్రం నెంబర్ ప్లేట్ మీద అమర్చి ఉండటం చూడవచ్చు.
ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో అందుబాటులో ఉన్న స్కూటర్ల మాదిరిగానే మంచి పనితీరుని అందిస్తుంది. ఇందులో రెండు రిమూవబుల్ లిథియం అయాన్ బ్యాటరీలు ఉంటాయి. అంతే కాకుండా 2.03 కిలోవాట్ మోటార్ ఇందులో అమర్చబడి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 40 కిలోమీటర్ల మాత్రమే. ఇది పూర్తి ఛార్జ్ చేసుకోవడానికి గరిష్టంగా 8 గంటల సమయం తీసుకుంటుంది.
(ఇదీ చదవండి: ఒకప్పుడు ఆసియాలో అత్యంత ధనవంతుడు! ఇప్పుడు ఆస్తులు సున్నా అంటున్నాడు..)
ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన LCD డిస్ప్లే లభిస్తుంది. ఇది బ్యాటరీ స్టేటస్, రూట్ ట్రాకింగ్, కాల్స్ అండ్ మెసేజస్ వంటి వాటిని యాక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది బైక్ రైడర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎంపిక చేసిన కొన్ని డీలర్‌షిప్‌లలో ప్రదర్శించారు. ఇది ఈ సంవత్సరం చివరినాటికి లేదా 2024 ప్రారంభంలో భారతదేశంలో విక్రయానికి రానున్నట్లు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment