దేశీయ విఫణిలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం పెరుతున్న తరుణంలో 'కైనెటిక్ గ్రీన్' ఓ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. 'కైనెటిక్ జులు' పేరుతో విడుదలైన ఈ స్కూటర్ ధర రూ. 94,990 (ఎక్స్ షోరూమ్). ఈ కొత్త మోడల్ కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరిస్తుంది. డెలివరీలు 2024 ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉంది.
సుమారు 93 కేజీల బరువున్న కైనెటిక్ జులు ఎలక్ట్రిక్ స్కూటర్ 2.1 కిలోవాట్ హబ్ మోటార్ కలిగి గంటకు 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇందులో ఉన్న 2.27 కిలోవాట్ బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్‌తో గరిష్టంగా 104 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది 15 ఏఎంపీ స్టాండర్డ్ ఛార్జర్ ద్వారా కేవలం 30 నిమిషాల్లో 80 శాతం ఛార్జ్ చేసుకుంటుంది.
మంది డిజైన్ కలిగిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టెలిస్కోపిక్ ఫోర్క్, ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు, రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు, 10 ఇంచెస్ వీల్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో ఆప్రాన్-మౌంటెడ్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్, డిజిటల్ స్పీడోమీటర్, సైడ్ స్టాండ్ సెన్సార్, బూట్ లైట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
ఇదీ చదవండి: పతనమవుతున్న పసిడి.. మరింత తగ్గిన వెండి - నేటి కొత్త ధరలు ఇవే
ఒక ఫుల్ చార్జితో 104 కిమీ రేంజ్ అందించే ఈ జులు ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియన్ మార్కెట్లో ఒకినావా ప్రైజ్ ప్రో, ఓలా ఎస్1 ఎక్స్+, ఏథర్ 450ఎస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఈ స్కూటర్ అమ్మకాల పరంగా గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment