రెక్కల వాహనం వచ్చేస్తోంది!
వియత్నాంః జోరుగా హుషారుగా షికారు పోదమా... అంటూ ఇప్పుడిక.. రెక్కల స్కూటర్ పై విహరించ వచ్చు. పక్షుల్లా రెక్కలు విప్పి జామ్ అంటూ దూసుకుపోవచ్చు. వియత్నాం మోటర్ సైకిల్ షోలో మొదటిసారి విభిన్నంగా కనిపించిన వింగ్స్ స్కూటర్... ద్విచక్ర వాహనదారులనే కాక, సాధారణ ప్రజలనూ అమితంగా ఆకట్టుకుంటోంది.
ప్టాస్టిక్ వంటి ట్రాన్స్ లూసెంట్ మెటీరియల్ తో, ప్రత్యేకాకరంలో ఉన్న సీటుకు తోడు రెక్కలతో తయారైన యమహా 04 జెన్ ద్విచక్రవాహనాన్ని వియత్నాం మోటర్ సైకిల్ షోలో ప్రదర్శనకు ఉంచారు. హో చి మించ్ నగరంలో ఏప్రిల్ 7 న ప్రారంభమై, 10 వరకు కొనసాగే ప్రదర్శనలో కొత్తరకం వింగ్స్ స్కూటర్ ను సందర్శకులు అందుబాటులో ఉంచారు. మోటర్ వాహన సంస్థ యమహా ద్వారా కొత్తగా రూపొందిన రెక్కల వాహనం 04జెన్...వియత్నాంలోని మోటార్ సైకిల్ షోలో యమహా సంస్థ... మొదటిసారి ప్రవేశపెట్టింది. రెక్కల కీటకాలను, పక్షులను తలపిస్తున్న 04జెన్ డిజైన్... ఆస్థెటిక్ మెటీరియల్ తో తయారై పలువురిని ఆకర్షిస్తోంది.
యమహా సంస్థ నాలుగో సృష్టి అయిన ఈ నమూనా వాహనం... యమహా 'రన్' ఫిలాసఫీ ఆధారంగా తయారైంది. ఇప్పుడు వియత్నాం షోలో ప్రత్యేకతను సంతరించుకున్న 04జెన్ వాహన బాహ్య నిర్మాణం.. పారదర్శక రూపంతో, రెక్కలతో... విభిన్నసౌందర్యంతో యమహా అభిమానుల్నే కాక, ఇతరుల చూపునూ కట్టిపడేస్తోంది. ఈ వాహనంలో ప్రత్యేకంగా కనిపించే వింగ్స్... స్కూటర్ సైడ్ ప్యానెల్ ను కవర్ చేసేట్లుగా ఉంటాయి. అలాగే హ్యాండిల్ బార్ గ్రిప్స్, స్కూటర్ సీట్ కవర్ లెదర్ తో తయారై అత్యంత సౌకర్యంవంతంగా ఉంటాయి. చూసేందుకు ఓ కళా రూపంలా కనిపించే 04జెన్ కాన్సెప్ట్... ప్రపంచ మార్కెట్లోనే ఇప్పటి వరకూ ఎక్కడా, ఎవ్వరూ సృష్టించలేదు. ఈ కొత్త రకం యమహా ఉత్పత్తిని త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేసే యోచనలో సంస్థ పావులు కదుపుతోంది.