Yamaha RX: గత కొన్ని సంవత్సరాల క్రితం బైక్ ప్రేమికులకు బాగా ఇష్టమైన మోడల్ 'యమహా' (Yamaha) కంపెనీకి చెందిన 'ఆర్ఎక్స్100' (RX100). ఒకప్పుడు కుర్రకారుని ఉర్రుతలూగించిన ఈ బైక్ కోసం ఎదురు చూసే కస్టమర్లు ఇంకా భారత్‌లో ఉన్నారు అనటంలో ఏ మాత్రమే సందేహం లేదు. అయితే దీనిని దృష్టిలో ఉంచుకుని సంస్థ మళ్ళీ ఈ బైకుని లాంచ్ చేయడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనల్లో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, యమహా ఆర్ఎక్స్100 భారతీయుల గుండెల్లో నిలిచిపోయిన బైక్ మోడల్. కావున ఆ పేరుకి ఏ మాత్రం భంగం కలగకుండా 'ఆర్ఎక్స్' (RX) అనే పేరుతో మళ్ళీ మార్కెట్లో బైకుని విడుదల చేయనున్నట్లు యమహా మోటార్ ఇండియా ఛైర్మన్ 'ఈషిన్ చిహానా' ఇటీవల ధృవీకరించినట్లు తెలుస్తోంది.
భారతదేశపు ఐకానిక్ మోడల్ అయిన ఆర్ఎక్స్100 మంచి స్టైలింగ్, లైట్ వెయిట్, ప్రత్యేకమైన సౌండ్ సిస్టం కలిగి ఉండేది. ఇది అప్పటి వినియోగదారులను మాత్రమే కాకుండా ఆధునిక కాలంలో బైక్ కొనుగోలు చేస్తున్న వారిని మంత్రముగ్దుల్ని చేసింది.
(ఇదీ చదవండి: ప్రత్యర్థుల పని పట్టడానికి వస్తున్న టీవీఎస్ కొత్త బైక్ - వివరాలు)
ఈ బైకుని మళ్ళీ పునఃరూపకల్పన చేయాలంటే కనీసం 200సీసీ ఇంజిన్ అయినా అమర్చాలి. అయినప్పటికీ ఒకప్పటి సౌండ్ మళ్ళీ వస్తుందా? అనేది ప్రశ్నగానే ఉంటుంది. కావున ఆర్ఎక్స్100 బైకుకి ఉన్న పేరును నాశనం చేయదలచుకోలేదు. ప్రస్తుత లైనప్‌తో 155 సీసీ సరిపోదు. కానీ భవిష్యత్తులో యమహా ఆర్ఎక్స్ పేరుతో తీసుకురావడానికి తప్పకుండా కృషి చేస్తామని ఆయన తెలిపారు. మొత్తానికి ఆర్ఎక్స్ మళ్ళీ ఇండియాలో అడుగుపెట్టనున్నట్లు తెలిసింది. అయితే లాంచ్ ఎప్పుడనేది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment