Ducati India Celebrates 10 Years Anniversary With Benefits Worth Up To Rs 4 Lakh - Sakshi
Sakshi News home page

Ducati: ఈ బైక్స్ కొనుగోలుపై కనీవినీ ఎరుగని బెనిఫిట్స్ - రూ. 4 లక్షల వరకు..

Published Fri, May 19 2023 2:57 PM | Last Updated on Fri, May 19 2023 4:09 PM

Ducati amazing benefits for selected bikes - Sakshi

Ducati Benefits: భారతీయ మార్కెట్లో అత్యంత  ప్రజాదరణ పొందిన లగ్జరీ బైక్ బ్రాండ్స్‌లో ఒకటైన 'డుకాటి' (Ducati) తన 10వ వార్షికోత్సవం జరుపుకోనున్న సందర్భంగా కంపెనీకి చెందిన కొన్ని ఎంపిక చేసిన మోడల్స్ మీద రూ. 4 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తుంది. కంపెనీ అందించనున్న ఈ బెనిఫీట్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

బెనిఫీట్స్..
నివేదికల ప్రకారం, డుకాటి ఇండియా ఇప్పుడు తన స్ట్రీట్‌ఫైటర్ వి4, మల్టీస్ట్రాడా వి4 మోడల్స్ మీద ఏకంగా రూ. 4 లక్షల ప్రయోజనాలను అందిస్తుంది. ఈ బైక్స్ అసలు ధరలు దేశీయ మార్కెట్లో రూ. రూ. 22.15 లక్షలు, రూ. 21.48 లక్షలు కావడం గమనార్హం. అదే సమయంలో స్ట్రీట్‌ఫైటర్ వి2, మల్టీస్ట్రాడా వి2, మాన్‌స్టర్ మోడల్స్ మీద రూ. 2 లక్షల ప్రయోజనాలను అందిస్తుంది. ఈ మోడల్ బైకుల అసలు ధరలు రూ. 18.10 లక్షలు, రూ. 16.05 లక్షలు, రూ. 12.95 లక్షలు.

(ఇదీ చదవండి: హ్యుందాయ్ ఎక్స్‌టర్ లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది.. డెలివరీలు కూడా..)

కంపెనీ అందిస్తున్న ఈ బెనిఫిట్స్ క్యాష్ డిస్కౌంట్స్ కాదు, అయితే డుకాటి బ్రాండ్ దుస్తులు, యాక్ససరీస్ వంటివి పొందవచ్చు. ఈ బెనిఫీట్స్ కూడా స్టాక్ ఉన్నత వరకు మాత్రమే లభిస్తాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను కొనుగోలుదారులు సమీపంలో ఉన్న డీలర్‌షిప్‌లను సందర్శించి ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement