![Yamaha confirm new premium bikes for india details - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/17/yamaha-premium-bikes.jpg.webp?itok=9ZFPdSht)
స్టైలిష్ బైకులకు ప్రసిద్ధి చెందిన 'యమహా' (Yamaha) దేశీయ మార్కెట్లో రానున్న రోజుల్లో ప్రీమియం బైక్స్ లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. కంపెనీ వీటి కోసం త్వరలోనే ఫ్రీ బుకింగ్స్ కూడా స్వీకరించడానికి సిద్ధమవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
యమహా విడుదల చేయనున్న ఈ కొత్త బైక్స్ తమ బ్లూ స్క్వేర్ షోరూమ్స్ల విక్రయించనున్నట్లు సమాచారం. కంపెనీ ఇటీవలే 200వ షోరూమ్‌ను చెన్నైలో ప్రారభించింది. యమహా 2019 నుంచి ఈ ప్రీమియం డీలర్షిప్ నెట్వర్క్ ప్రారంభించడం మొదలుపెట్టింది. రానున్న రోజుల్లో ఈ షోరూమ్‌ల సంఖ్యను మరింత పెంచడానికి ప్రయత్నిస్తోంది.
(ఇదీ చదవండి: మహీంద్రా థార్ Vs మారుతి జిమ్నీ - ఏది బెస్ట్ అంటే?)
యమహా ఇండియా ఎమ్‌టి03, ఎమ్‌టి-07, ఎమ్‌టి-07, ఆర్3, ఆర్1, ఆర్1ఎమ్ వంటి ప్రీమియం బైకులను త్వరలోనే దేశీయ విఫణిలో విడుదల చేయనుంది. ఇప్పటికే సంస్థ వీటిని ఒక ప్రైవేట్ ఈవెంట్లో ప్రదర్శించింది. అయితే ఇవి మార్కెట్లో ఎప్పుడు విడుదలవుతాయనే ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. బహుశా ఇవి పండుగ సీజన్లో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment