KTM 390 Adventure X Launched In India, Check Price Details And Features - Sakshi
Sakshi News home page

KTM 390 Adventure X: తక్కువ ధరలో కెటిఎమ్ బైక్ లాంచ్ - పూర్తి వివరాలు

Published Sat, Apr 15 2023 7:33 AM | Last Updated on Sat, Apr 15 2023 8:52 AM

Ktm 390 adventure x launched in india price and details - Sakshi

యువ రైడర్లను ఎంతగానో మెప్పించిన కెటిఎమ్ (KTM) దేశీయ మార్కెట్లో మరో కొత్త  చేసింది. 'కెటిఎమ్ 390 అడ్వెంచర్ ఎక్స్‌' (KTM 390 Adventure X) పేరుతో విడుదలైన ఈ బైక్ మునుపటి అడ్వెంచర్ బైక్ కంటే తక్కువ ధరకే లభిస్తుంది. ఈ కొత్త బైక్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ధర:
భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త కెటిఎమ్ 390 అడ్వెంచర్ ఎక్స్‌ బైక్ ప్రారంభ ధర రూ. 2.8 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇప్పటికే మార్కెట్లో లభిస్తున్న కెటిఎమ్ 390 అడ్వెంచర్‌తో (రూ. 3.38 లక్షలు) పోలిస్తే దాదాపు యాభై వేలు తక్కువ ధరకే లభిస్తుంది. కావున తక్కువ ధరకు కెటిఎమ్ కావాలనుకునే వారు ఈ లేటెస్ట్ బైక్ ఎంచుకోవచ్చు.

డిజైన్ & ఫీచర్స్:
నిజానికి కెటిఎమ్ విడుదల చేసిన ఈ కొత్త బైక్ ఎంట్రీ-లెవల్ వేరియంట్ మాదిరిగా ఉంటుంది. కావున ఇందులో ట్రాక్షన్ కంట్రోల్, క్విక్‌షిఫ్టర్, కార్నరింగ్ ఏబీఎస్ వంటి ఫీచర్స్ అందుబాటులో లేదు. కానీ ఇందులో డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ సెటప్‌ కలిగి, వెనుక చక్రం వద్ద ABS స్విచ్ ఆఫ్ చేసే సదుపాయం ఉంటుంది. కావున ఇది ఆఫ్-రోడ్‌లో ప్రయాణించేటప్పుడు బైక్‌ను స్లైడ్ చేయడంలో సహాయపడుతుంది.

కెటిఎమ్ 390 అడ్వెంచర్ ఎక్స్‌ బైకులో కలర్-TFT డిస్‌ప్లే ఉంటుందా లేదా LCD డిస్‌ప్లే ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఈ కొత్త బైక్ కొన్ని ఫీచర్స్ కాకుండా మిగిలిన డిజైన్ దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. అదే ఎల్ఈడీ లైట్స్, ఇంజిన్ మొదలైనవన్నీ అలాగే ఉన్నాయి. 

(ఇదీ చదవండి: లక్ష కంటే తక్కువ ధరతో విడుదలైన టీవీఎస్ కొత్త బైక్ - మరిన్ని వివరాలు)

ఇంజిన్ & పర్ఫామెన్స్:
కెటిఎమ్ 390 అడ్వెంచర్ ఎక్స్‌ 373.27 సీసీ సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్, డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్‌షాఫ్ట్‌తో కూడిన ఫోర్ వాల్వ్ ఇంజిన్‌ కలిగి 9000 ఆర్‌పిఎమ్ వద్ద 42.9 బీహెచ్‌పి పవర్, 7000 ఆర్‌పిఎమ్ వద్ద 37 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కావున పనితీరు పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది.

(ఇదీ చదవండి: ఆన్‌లైన్‌లో డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా? ట్విటర్‌ బంపరాఫర్‌)

ప్రత్యర్థులు:
కెటిఎమ్ నుంచి విడుదలైన ఈ సరసమైన బైక్ రూ. 3 లక్షల కంటే తక్కువ కావున మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము. అయితే ఇది దేశీయ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైకుకి ప్రత్యక్ష ప్రత్యర్థిగా వ్యవహరించే అవకాశం ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement