భారతదేశంలో ఎట్టకేలకు డుకాటీ కంపెనీ మరో కొత్త బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ దాని మునుపటి మోడల్ కంటే ఖరీదైనప్పటికీ అద్భుతమైన డిజైన్, ఆధునిక పరికరాలను పొందుతుంది. దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కొత్త బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
ధరలు:
దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'డుకాటీ మాన్‌స్టర్ ఎస్‌పి' (Ducati Monster SP) ధర రూ. 15.95 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ లేటెస్ట్ బైక్ దాని స్టాండర్డ్ వెర్షన్ కంటే కూడా రూ. 3 లక్షలు ఎక్కువ ఖరీదైనది కావడం విశేషం.
డిజైన్ & ఫీచర్స్:
నిజానికి లేటెస్ట్ డుకాటీ మాన్‌స్టర్ ఎస్‌పి డిజైన్ దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఇందులో MotoGP ఇన్స్ఫైర్డ్ లివరీతో పాటు బ్లాక్ అవుట్ పార్ట్స్ కలిగి ప్యాసింజర్ సీట్ కౌల్ పొందుతుంది. LED DRL ప్రొజెక్టర్ స్టైల్ హెడ్ లాంప్ ఇందులో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ ఫ్రంట్ ఇండికేటర్లతో మస్కులర్ ఫ్యూయెల్ ట్యాంక్, స్టెప్ అప్ సీట్, రెండు వైపులా 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ లభిస్తాయి.
(ఇదీ చదవండి: వయసు 24.. సంపాదన రూ. 100 కోట్లు - అతడే సంకర్ష్ చందా!)
ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ కలిగిన 4.3 ఇంచెస్ కలర్ TFT డిస్ప్లే ఉంటుంది. ఇది బైక్ గురించి రైడర్ కి కావలసిన సమాచారం అందిస్తుంది. ఎలక్ట్రానిక్ లాంచ్ కంట్రోల్ సిస్టం, రైడింగ్ మోడ్స్, కార్నరింగ్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, క్విక్ షిఫ్టర్ వంటివి అందుబాటులో ఉంటాయి.
ఇంజిన్ & పర్ఫామెన్స్:
కొత్త డుకాటీ మాన్‌స్టర్ ఎస్‌పి బైక్ ఇంజిన్ దాని మునుపటి మోడల్ మాదిరిగానే 937 సిసి ట్విన్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ కలిగి 9250 rpm వద్ద 109.9 bhp పవర్ & 6500 rpm వద్ద 93 Nm టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్ కలిగి ఉత్తమ పర్ఫామెన్స్ అందిస్తుంది. ఇందులోని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్ల వరకు ఉంటుంది.
(ఇదీ చదవండి: వాట్సాప్‌లో ఇంటర్నేషనల్ కాల్స్.. క్లిక్ చేసారో మీ పని అయిపోయినట్టే!)
ప్రత్యర్థులు:
దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'డుకాటీ మాన్‌స్టర్ ఎస్‌పి' బైక్ ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ RS, బీఎండబ్ల్యూ ఎఫ్900 ఆర్, కవాసకి జెడ్900 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కంపెనీ ఈ లేటెస్ట్ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి.
Comments
Please login to add a commentAdd a comment